Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
LPG Price: మళ్లీ పెరిగిన వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర.. హైదరాబాద్‌ సహా నగరాల వారీగా కొత్త రేట్లు ఇవే..

LPG Price: మళ్లీ పెరిగిన వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర.. హైదరాబాద్‌ సహా నగరాల వారీగా కొత్త రేట్లు ఇవే..

Telugu Samayam 2 weeks ago

LPG Price: ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు మరోసారి ధరల భారం పెరిగింది. సెప్టెంబర్ నెల ప్రారంభం రోజున ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి.

19 కిలోల కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ల ధరలను (Commercial LPG Cylinder Price) పెంచాయి. దీంతో వాణిజ్య సిలిండర్ వినియోగించే రెస్టారెంట్లు, హోటళ్లు, బేకరీలు, క్యాంటిన్ల వంటి సంస్థలపై అదనపు భారం పడుతుంది. అయితే, గృహ అవసరాలకు ఉపయోగించే 14.2 కిలోల సిలిండర్ ధరలను స్థిరంగా కొనసాగిస్తూ సామాన్యులకు ఊరట కల్పించారు. మరి నగరాల వారీగా సిలిండర్ ధరలు ఎంత పెరిగాయో తెలుసుకుందాం.

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) విడుదల చేసిన తాజా ధరల ప్రకారం 19 కిలోల కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ ధర ఢిల్లీలో రూ. 9.50 మేర పెరిగింది. దీంతో ఒక్క సిలిండర్ ధర రాజధాని నగరంలో రూ. 2,747.50 వద్దకు చేరుకుంది. ఇక ఆర్థిక రాజధాని ముంబైలోనూ రూ. 9.50 పెరగడంతో రూ. 2691.50 నుంచి రూ. 2701 వద్దకు పెరిగింది. హైదరాబాద్ నగరంలో రూ. 11 మేర పెరిగి రూ.2,996 వద్దకు చేరింది. చెన్నై నగరంలో 19 కిలోల సిలిండరే ర్టు రూ. 2916.50 వద్దకు పెరిగింది. అంటే ఒక్క సిలిండర్ పై రూ. 10.50 మేర పెంచారు. ఇతర నగరాల్లోనూ ధరలు పెరిగాయి. అయితే గత ఆగస్టు నెలలో వాణిజ్య సిలిండర్ ధరలను స్వల్పంగా తగ్గించిన సంగతి తెలిసిందే.

నగరం19 కిలోల సిలిండర్ కొత్త ధరలు
ఢిల్లీరూ.2747.50
ముంబైరూ.2691.50
హైదరాబాద్రూ.2996
చెన్నైరూ.2916.50
గురుగ్రామ్రూ.2764
నోయిడారూ.2747.50
లఖ్‌నవూరూ.2870
పాట్నారూ.3044

స్థిరంగానే 14.2 కిలోల సిలిండర్ ధర

వాణిజ్య వినియోగ సిలిండర్ ధరలను మరోసారి పెంచినప్పటికీ గృహ వినియోగానికి ఉపయోగించే 14.2 కిలోల సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు చేయకుండా స్థిరంగానే కొనసాగించారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో 14.2 కిలోల సిలిండర్ ధర రూ. 994 వద్ద ఉంది. ఇక ఢిల్లీలో రూ. 942 వద్ద ఉంది. ముంబైలో రూ. 941.50 వద్ద ఉంది. అయితే, గత జూన్ నెలలో ఈ సిలిండర్ ధరలను రూ.29 మేర పెంచారు.

ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలైన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్, హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ సంస్థలు ప్రతి నెల ఒకటవ తేదీన ఎల్‌పీజీ ధరలను సమీక్షిస్తుంటాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మొదలైన తర్వాత వంట గ్యాస్ కొరత ఏర్పడిన సంగతి తెలిసిందే. దీంతో వాణిజ్య సిలిండర్ ధరలను భారీగా పెంచాయి. వరుస నెలల్లో ధరలను పెంచుతూ వస్తున్నాయి. అయితే, గృహ వినియోగ సిలిండర్ ధరలను స్థిరంగా కొనసాగిస్తూ సామాన్య ప్రజలపై భారం పడకుండా చూసుకోవడం ఊరట కల్పించే అంశంగా చెప్పవచ్చు.
Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Samayam