Dailyhunt
లుంగీ ఎంగిడి మైండ్‌బ్లోయింగ్ స్లో యార్కర్.. పూరన్ ఫ్యూజుల్ ఔట్, వికెట్లు ఫట్!

లుంగీ ఎంగిడి మైండ్‌బ్లోయింగ్ స్లో యార్కర్.. పూరన్ ఫ్యూజుల్ ఔట్, వికెట్లు ఫట్!

Telugu Samayam 1 week ago

టీ20 వరల్డ్‌కప్‌లో సౌతాఫ్రికా పేసర్ లుంగి ఎంగిడి పేరు మార్మోగింది. భారీ స్పీడ్‌తో వేయగల ఈ పేసర్ స్లో యార్కర్లు, స్లో బంతులు వేసి సౌతాఫ్రికా సెమీస్ వరకూ చేరడంలో కీలక పాత్ర పోషించాడు.

ముఖ్యంగా భారత్‌పై మ్యాచ్‌లు కూడా అద్భుత బౌలింగ్ చేశాడు. ఇప్పుడు అదే బౌలింగ్ టైమింగ్‌ను ఐపీఎల్ 2026లోనూ ప్రదర్శిస్తూ ఆకట్టుకుంటున్నాడు.

లక్నో సూపర్ జెయింట్స్ - ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో లుంగీ ఎంగిడి స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాడు. లక్నో సూపర్ జెయింట్స్ టాప్ బ్యాటర్లతో పాటు టెయిలెండర్లను అవుట్ చేసి ఢిల్లీ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ముఖ్యంగా లక్నో డైనమైట్ నికోలస్ పూరన్‌కు ఒక అద్భుతమైన బంతి వేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు.

పవర్ ప్లే తర్వాత క్రీజులోకి వచ్చిన నికోలస్ పూరన్ స్కోర్ బోర్డును పరుగులు పెట్టిస్తాడని అందరూ అనుకున్నారు. 7 బంతుల్లో 8 పరుగులు చేసి నిలకడగా ఆడుతున్న సమయంలో లుంగీ ఎంగిడి వేసిన స్లో యార్కర్ దెబ్బకు పూరన్ ఫ్యూజులు ఎగిరిపోయాయి. స్లో యార్కర్‌ను అడ్డుకోలేక.. షాట్ ఆడలేక వికెట్లు కోల్పోయాడు. ఎంగిడి ఇలాంటి బంతులనే టీ20 వరల్డ్‌కప్‌లోనూ వేసి బ్యాటర్లను ఇబ్బంది పెట్టాడు.

ఈ మ్యాచ్‌లో లుంగీ ఎంగిడి 3.4 ఓవర్లు బౌలింగ్ చేసి 27 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు కీలక వికెట్లు తీసుకున్నాడు. పవర్ హిట్టింగ్ బ్యాటర్ పూరన్‌తో పాటు ఆఖర్లో నోకియా, మొహ్సిన్ నక్వీని వరుస బంతుల్లో అవుట్ చేసి లక్నో ఆలౌట్ కావడంలో కీలక పాత్ర పోషించాడు. లుంగీ ఎంగిడి ఢిల్లీలో కీలక పాత్ర పోషిస్తుండటంతో ఆ జట్టుకు బాగా కలిసొచ్చే అంశంగా మారింది.

ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఇకానా స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్‌కు వచ్చిన లక్నో సూపర్ జెయింట్స్ జట్టు మిడిలార్డర్ విఫలం కావడంతో 141 పరుగులకే ఆలౌట్ అయింది. లక్నో కూడా అదే స్థాయిలో బౌలింగ్ చేసినా సమీర్ రిజ్వీ - ట్రిస్టన్ స్టబ్స్ అద్భుతమైన భాగస్వామ్యంతో ఢిల్లీకి విజయాన్ని అందించారు.
Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Samayam