Dailyhunt
Makara Rashi Ugadi Rasi Phalalu 2026-27 శ్రీ పరాభవ నామ సంవత్సరంలో మకర రాశి వారిపై శని, గురు ప్రభావం ఎలా ఉండబోతోంది?

Makara Rashi Ugadi Rasi Phalalu 2026-27 శ్రీ పరాభవ నామ సంవత్సరంలో మకర రాశి వారిపై శని, గురు ప్రభావం ఎలా ఉండబోతోంది?

Telugu Samayam 0 months ago

Makara Rashi Ugadi Rashi Phalalu 2026-27 జ్యోతిష్యం ప్రకారం, శ్రీ పరాభవ నామ సంవత్సరంలో మకర రాశి వారిపై శని, గురువు, రాహువు, కేతువు ప్రభావంతో ఎలాంటి ఫలితాలు రానున్నాయనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Makara Rashi Ugadi Rashi Phalalu 2026-27 హిందూ పంచాంగం ప్రకారం, ఈ ఏడాది మార్చి 19వ తేదీన గురువారం రోజున శ్రీ 'పరాభవ' నామ సంవత్సరం ప్రారంభమైంది. వైదిక క్యాలెండర్ ప్రకారం, ఛైత్ర నవరాత్రులు కూడా ఈరోజు నుంచే ప్రారంభమయ్యాయి. ఇదిలా ఉండగా జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, మకర రాశి వారికి శని దేవుడు అధిపతిగా ఉంటాడు. ఈ నేపథ్యంలో కొత్త ఏడాదిలో 19 మార్చి 2026 నుంచి 6 ఏప్రిల్ 2027 వరకు గురు గ్రహం ప్రభావంతో ప్రతికూల ఫలితాలొచ్చే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకు శత్రువుల నుంచి ఇబ్బందులు ఎదురవ్వొచ్చు. మరోవైపు అవివాహితుల వివాహ ప్రయత్నాలు ఫలించే అవకాశాలున్నాయి. అనారోగ్య సమస్యల నుంచి బయటపడొచ్చు. ఈ సందర్భంగా తెలుగు నూతన సంవత్సరంలో మకర రాశి వారికి, ఆదాయ పరంగా, ఆరోగ్యం, కుటుంబ జీవితంలో ఎలాంటి ఫలితాలు రానున్నాయనే ఆసక్తికరమైన విషయాలను మాటల్లో తెలుసుకుందాం.ఆదాయం-02, వ్యయం-08

మకర రాశి వారికి ఉగాది నుంచి ఆర్థిక పరంగా ప్రతికూల ఫలితాలొచ్చే అవకాశం ఉంది. సంవత్సరం ప్రారంభం నుంచి జూన్ 2 వరకు, సంపదను సూచించే గ్రహం అయిన గురుడి అనుగ్రహంతో మీకు శుభ ఫలితాలు రానున్నాయి. ఈ ఏడాది ప్రారంభం నుంచి డిసెంబర్ 5వ తేదీ వరకు రాహువు రెండో స్థానంలో సంచారం చేయనున్నాడు. ఈ కాలంలో అనవసర ఖర్చులు పెరగొచ్చు. ఈ కాలంలో ఎలాంటి రిస్క్ తీసుకోకూడదు. ఈ కాలంలో పెట్టుబడి పెట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.


రాజపూజ్యం -01, అవమానం-02

తెలుగు నూతన సంవత్సరంలో మకర రాశి వారికి రాజపూజ్యం -01, అవమానం-02గా ఉంటాయి. ఉగాది తర్వాత మకర రాశి వారికి కుటుంబ జీవితంలో కొంత బలహీనంగా ఉండొచ్చు. మీ కుటుంబ సభ్యుల మధ్య పరస్పర అవగాహన లోపించొచ్చు. ఈ రాశి నుంచి నాలుగో ఇంటి అధిపతి అయిన కుజుడి ప్రభావంతో ప్రతికూల ఫలితాలొచ్చే అవకాశాలున్నాయి. మీరు ఆస్తికి సంబంధించిన సమస్యలను పరిష్కరించడంలో ఎక్కువ సమయం కేటాయించాలి. మీ కుటుంబ వాతావరణం బాగుంటుంది. ఈ కారణంగా మీరు సంతోషంగా ఉంటారు.


శని ప్రభావం

మకర రాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో శని దేవుని అనుగ్రహంతో అనుకూల ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఈ కాలంలో మీ వ్యక్తిగత జాతకంలో శని స్థానం బలంగా ఉండటంతో మీకు ఆరోగ్య పరంగా మెరుగైన ఫలితాలొచ్చే అవకాశాలున్నాయి. ఈరోజు ఏ చిన్న పని అయినా పూర్తి చేసేందుకు ఎక్కువ సమయం తీసుకుంటారు. మీ తోబుట్టువుల నుంచి సహకారం లభిస్తుంది. మొత్తానికి కొత్త ఏడాదిలో మకర రాశి వారు శుభప్రదమైన ఫలితాలు పొందే అవకాశాలున్నాయి. శ్రీ పరాభవ నామ సంవత్సరంలో మకర రాశి వారికి ఏలినాటి శని దశ ఉండదు.


రాహువు ప్రభావం

మకర రాశి వారికి కొత్త ఏడాదిలో రాహువు ప్రభావంతో ప్రతికూల ఫలితాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ కాలంలో మీ ఖర్చులు విపరీతంగా పెరిగే అవకాశాలున్నాయి. కొత్తగా పెళ్లైన వ్యక్తులకు సంతానం గురించి శుభవార్తలు వినిపిస్తాయి. ఏ కారణం లేకుండా ఇతరులకు హాని చేయాలనే ఆలోచనలు రావొచ్చు. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. రాహువు శాంతి కోసం రాహు గ్రహ మంత్రాలను పఠించాలి.


కేతువు ప్రభావం

మకర రాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో కేతువు కారణంగా ప్రతికూల ఫలితాలొచ్చే అవకాశం ఉంది. వ్యక్తిగత జాతకంలో కాల సర్ప దోషం కలిగిన వ్యక్తులు కేతువు ప్రభావంతో ప్రతికూల ఫలితాలు ఎదుర్కోవాల్సి రావొచ్చు. మీ వైవాహిక జీవితంలో సమస్యలు ఎదురయ్యే అవకాశాలున్నాయి. కేతువు ప్రభావం నుంచి ఉపశమనం పొందడానికి కేతు గ్రహ మంత్రాలను పఠించాలి.


విద్యా పరంగా

మకర రాశి వారికి ఉగాది తర్వాత విద్యా రంగంలో కొన్ని మిశ్రమ ఫలితాలొచ్చే అవకాశం ఉంది. ఈ రాశి నుంచి నాలుగో ఇంటి అధిపతి కుజుడు మిశ్రమ ఫలితాలు ఇవ్వనున్నాడు. ఐదో ఇంటి అధిపతి అయిన శుక్రుడి కారణంగా సానుకూల ఫలితాలు రావొచ్చు. మరోవైపు ఐదో స్థానంలో శని మూడో కారణం కారణంగా, మీ మనసు విద్య నుంచి పరధ్యానం చెందొచ్చు. ప్రాథమిక విద్యకు బాధ్యత వహించే బుధుడి ప్రభావంతో కొంత మెరుగైన ఫలితాలు రానున్నాయి. ఈ ఏడాది ప్రారంభం నుంచి జూన్ 2 వరకు గురుడి అనుగ్రహంతో పోటీ పరీక్షల్లో రాణించే అవకాశం ఉంది.


వ్యాపార పరంగా

మకర రాశి వారికి కొత్త ఏడాదిలో వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు రానున్నాయి. ఈ రాశి నుంచి కర్మ స్థానంలో ఎలాంటి పెద్ద గ్రహాల కదలిక లేకపోవడం కారణంగా శుభ ఫలితాలొచ్చే అవకాశాలున్నాయి. మరోవైపు దశమ ఇంటి అధిపతి అయిన శుక్రుడి కారణంగా మీకు ఎక్కువ సమయం అనుకూలంగా ఉంటుంది. ఈ ఏడాది ప్రారంభం నుంచి జూన్ 2 వరకు గురుడి స్థానం బలహీనంగా ఉంటుంది. మరోవైపు గురుడి ప్రభావంతో జూన్ 2 నుంచి అక్టోబర్ 31వరకు ఉన్నత స్థితిలో ఉండటం వల్ల వ్యాపారులకు మెరుగైన ఫలితాలొచ్చే అవకాశం ఉంది. అక్టోబర్ 31 తర్వాత వ్యాపారులు రాహువు, కేతువు ప్రభావంతో కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి రావొచ్చు. కాబట్టి ఇలాంటి సమయంలో ఎలాంటి రిస్క్ తీసుకోకుండా ఉండాలి.


ఆరోగ్య పరంగా

మకర రాశి వారు తెలుగు నూతన సంవత్సరంలో ఆరోగ్య పరంగా సానుకూల ఫలితాలు రానున్నాయి. ఈ రాశి నుంచి శని దేవుడు ఏడాది పొడవునా మూడో స్థానంలో సంచారం చేయనున్నాడు. ఈ స్థానం శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఈ ఏడాది ప్రారంభం నుంచి జూన్ 2 వరకు గురుడు ఆరో స్థానంలో సంచారం చేయనున్నాడు. ఇది బలహీనమైన స్థానంగా పరిగణించబడుతుంది. ఈ సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. జూన్ 2 నుంచి అక్టోబర్ 31వ తేదీ సప్తమ స్థానంలో సంచారం చేయనున్నాడు. ఈ స్థానంలో ఉన్న సమయంలో ఆరోగ్య పరంగా మంచి ఫలితాలొస్తాయి. అయితే మీరు సరైన ఆహార నియమాలు పాటించాలి. మరోవైపు రాహువు డిసెంబర్ 5 తర్వాత మొదటి స్థానంలో సంచారం చేయనున్నాడు.


ప్రేమ జీవితంలో

మకర రాశి వారికి కొత్త ఏడాదిలో ప్రేమ జీవితంలో మెరుగైన ఫలితాలు రానున్నాయి. ఈ ఏడాది ప్రేమకు సంబంధించి కొన్ని సమస్యలు ఎదురవ్వొచ్చు. శని దేవుని అనుగ్రహం కారణంగా మీరు కొంత ఆందోళన చెందాల్సి రావొచ్చు. మరోవైపు శుక్రుడి అనుగ్రహంతో సానుకూల ఫలితాలొచ్చే అవకాశాలున్నాయి. జూన్ 2 నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు ప్రేమ సంబంధాలు మెరుగుపడతాయి. మొత్తానికి ఈ ఏడాది ప్రేమ సంబంధాలను ఆస్వాదించగలుగుతారు.


పాటించాల్సిన పరిహారాలు

* మకర రాశి వారు కొత్త ఏడాదిలో తల్లి లాంటి మహిళలకు సేవలు చేయాలి.
* క్రమం తప్పకుండా ప్రతి గురువారం ఏదైనా ఆలయంలో ధాన్యాలు నైవేద్యంగా సమర్పించుకోవాలి.
* కొత్త ఏడాదిలో గణేశుడిని క్రమం తప్పకుండా పూజించాలి.
గమనిక : ఇక్కడ అందించిన సమాచారం, పరిహారాలన్నీ మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇవి కేవలం ఊహాల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఈ సమాచారాన్ని మీరు పరిగణనలోకి తీసుకునేందుకు సంబంధిత నిపుణులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరు. పై సమాచారాన్ని ''సమయం తెలుగు'' దృవీకరించడం లేదు.
Read Latest Astrology News and Telugu News


Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Samayam