తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒకానొక దశలో యాక్షన్ అనే పదానికి నిలువెత్తు రూపం డాక్టర్ రాజశేఖర్. తనదైన విలక్షణమైన మేనరిజమ్స్, పవర్‌ఫుల్ వాయిస్, కళ్ళలో రౌద్రంతో బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించిన ఘనత ఆయనది.
దశాబ్దాల కాలం పాటు టాలీవుడ్‌లో తిరుగులేని 'యాంగ్రీ యంగ్ మ్యాన్'గా ముద్ర వేసుకున్న రాజశేఖర్ ఇటీవలి కాలంలో సరైన బ్రేక్ కోసం ఎదురుచూశారు. కానీ, పట్టుదల ఉంటే విజయం వరిస్తుందని నిరూపిస్తూ ఈ వారం విడుదలైన 'బైకర్' (Biker) చిత్రంతో ఆయన మళ్ళీ ఫామ్‌లోకి వచ్చారు.
* టాలీవుడ్‌లో ఎన్నారై యువతికి క్యాస్టింగ్ కౌచ్ అనుభవం.. పూనమ్ కౌర్ షాకింగ్ పోస్ట్
శర్వానంద్ హీరోగా నటించిన 'బైకర్' చిత్రంలో రాజశేఖర్ 'బుల్లెట్ సునీల్' అనే కీలక పాత్ర పోషించారు. ఈ సినిమాలో ఆయన కేవలం ఒక నటుడిగానే కాకుండా, కథకు వెన్నెముకగా నిలిచారు. ముఖ్యంగా తండ్రీకొడుకుల మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్‌లో రాజశేఖర్ నటన అద్భుతమని ప్రేక్షకులు కొనియాడుతున్నారు. గతంలో 'పిఎస్‌వి గరుడ వేగ'తో తన సెకండ్ ఇన్నింగ్స్‌ను ఘనంగా ప్రారంభించినప్పటికీ, ఆ తర్వాత వచ్చిన సినిమాలు ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. కానీ 'బైకర్' విజయంతో రాజశేఖర్ మళ్ళీ బిజీ కావడం ఖాయమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. యాక్షన్ కంటే కూడా ఎమోషన్ పండించడంలో ఆయన చూపిన పరిణితి సినిమాకు పెద్ద అసెట్ అయ్యింది.
సినిమా విడుదలకు ముందు జరిగిన వేడుకల్లో రాజశేఖర్ మాట్లాడుతూ.. "దయచేసి నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, మంచి పాత్ర వస్తే చేయడానికి సిద్ధంగా ఉన్నాను" అని అన్నప్పుడు ఆయన అభిమానులు ఎంతో ఆవేదనకు గురయ్యారు. ఒకప్పుడు ఇండస్ట్రీని ఏలిన స్టార్ హీరో ఇలా అడగడం చూసి అంతా షాక్ అయ్యారు. అయితే ఆ విన్నపాన్ని ప్రేక్షకులు మన్నించారు. 'బైకర్' చిత్రానికి వస్తున్న పాజిటివ్ టాక్, విమర్శకుల ప్రశంసలు చూస్తుంటే, రాజశేఖర్ సెకండ్ ఇన్నింగ్స్‌కు గట్టి పునాది పడిందని చెప్పవచ్చు.
* 'పెద్ది' అడ్వాన్స్ బుకింగ్స్ డేట్ ఫిక్స్, ఫ్యాన్స్ రెడీ అయిపోండమ్మా
1985లో 'వందేమాతరం' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన రాజశేఖర్ సుమారు 40 ఏళ్ల కెరీర్‌లో 75కి పైగా చిత్రాల్లో నటించారు. 'అంకుశం', 'మగాడు', 'ఆహుతి', 'శివయ్య', 'అన్న' వంటి చిత్రాలు ఆయనను మాస్ ఆడియన్స్‌కు దగ్గర చేశాయి. ముఖ్యంగా పోలీస్ ఆఫీసర్ పాత్రల్లో ఆయన నటన చిరస్థాయిగా నిలిచిపోతుంది. 'మగాడు', 'అన్న' చిత్రాలకు గాను ఆయన రెండుసార్లు ఉత్తమ నటుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డులను అందుకున్నారు. రాజశేఖర్ పాత్రలకు సాయికుమార్ చెప్పే డబ్బింగ్ ఒక ప్రత్యేక ఆకర్షణగా ఉండేది. కేవలం యాక్షన్ మాత్రమే కాదు, 'అల్లరి ప్రియుడు', 'సూర్యుడు', మనసున్న మారాజు' వంటి చిత్రాలతో ఫ్యామిలీ ఆడియన్స్‌ను కూడా మెప్పించారు. ప్రస్తుతం రాజశేఖర్ పవన్ సాదినేని దర్శకత్వంలో 'మగాడు' అనే మరో క్రేజీ ప్రాజెక్ట్‌లో నటిస్తున్నారు. 'బైకర్' విజయం ఇచ్చిన ఉత్సాహంతో ఆయన రాబోయే చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మరిన్ని సంచలనాలు సృష్టించాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు.

