Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు తగ్గడానికి అద్భుతమైన ఇంటి చిట్కా, జిల్లేడు ఆకులు+ నువ్వుల నూనె చాలు!

మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు తగ్గడానికి అద్భుతమైన ఇంటి చిట్కా, జిల్లేడు ఆకులు+ నువ్వుల నూనె చాలు!

Telugu Samayam 1 week ago

నేటి ఉరుకుల పరుగుల జీవితంలో వయసుతో సంబంధం లేకుండా చాలామందిని వేధిస్తున్న ప్రధాన సమస్య మోకాళ్ల నొప్పులు. ఒకప్పుడు వృద్ధాప్యంలో మాత్రమే కనిపిందే ఈ కీళ్ల నొప్పులు ప్రస్తుతం ఉన్న ఆహారపు అలవాట్లు, జీవనశైలి మార్పుల వల్ల యువతలోనూ కనిపిస్తున్నాయి.

నడవాలన్నా, మెట్లు ఎక్కాలన్నా నరకం కనిపిస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో మన పెరట్లో దొరికే అద్భుత ఔషధం జిల్లేడు ఆకులు, నువ్వుల నూనె కలయిక.

వాస్తవానికి ఆయుర్వేదంలో జిల్లేడును వాయు హరిణిగా పిలుస్తారు. ఇది మోకాళ్ల నొప్పులకు మంచిగా పనిచేస్తుంని SIJTCM అధ్యయనం సైతం పేర్కొంది. ఇది కీళ్లలో పేరుకుపోయిన వాయువును, వాపును తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే నువ్వుల నూనె ఎముకలకు బలాన్ని ఇచ్చి కందెనలా పనిచేసి కీళ్ల కదలికలను సులభతం చేస్తుంది. అయితే ఈ రెండింటినీ శాస్త్రీయ పద్ధతిలో ఎలా ఉపయోగించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఉపయోగించే విధానం

  • మొదట ముదురు రంగులో ఉండే జిల్లేడు ఆకులను కోసుకుని వాటి శుభ్రంగా తుడవాలి.
  • ఇప్పుడు జిల్లేడు ఆకు వెనుక భాగంలో స్వచ్ఛమైన నువ్వుల నూనె రాయాలి.
  • అనంతరం నువ్వుల నూనె రాసిన ఆకును లో ఫ్లేమ్‌లో స్టవ్‌ మీద కానీ, పెనం మీద కానీ కొంచెం గోరువెచ్చగా వేడి చేయాలి. ఆకు మాడిపోకుండా చూసుకోవాలి.
  • గోరువెచ్చగా ఉన్న జిల్లేడు ఆకును నొప్పి మోకాలిపై లేదా కీళ్లపై ఉంచాలి.
  • రాత్రి పడుకునే ముందు ఇలా చేసి రాత్రంతా అలాగే ఉంచి ఉదయాన్నే తీసివేయవచ్చు.

ఎలా పని చేస్తుందంటే?

  • జిల్లేడు ఆకుల్లో ఉండే యాంటీ ఇన్‌ఫ్టమేటరీ గుణాలు వాపును, నొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి. ఇది కీళ్లలో పేరుకుపోయిన వాయువును బయటకు పంపుతుంది.
  • ఇక ఆయుర్వేదం ప్రకారం నువ్వుల నూనె వాతం తగ్గించడానికి ఉత్తమైనది. ఇది చర్మంలోకి త్వరగా చొచ్చుకుపోయి కండరాలకు ఉపశమనం ఇస్తుంది.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

  • జిల్లేడు ఆకు కోసేటప్పుడు వచ్చే తెల్లటి పాలు కళ్లలో పడకుండా చూసుకోవాలి. అవి కంటికి చాలా ప్రమాదకరం. ఒకవేళ పొరపాటున చేతులకు తగిలితే వెంటనే సబ్బుతో చేతులు కడుక్కోండి.
  • అలాగే కొంతమందికి జిల్లేడు పాలు లేదా ఆకుల వల్ల చర్మంపై ఎర్రటి పొక్కులు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే మొదట చిన్నగా ప్యాచ్‌ టెస్ట్‌ చేసుకోవాలి. ఆ సమయంలో మంట లేకపోతే వాడాలి. మంట ఉంటే వాడకూడదు.
  • ఇది కేవలం చర్మంపైన రాసే చికిత్స మాత్రమే. జిల్లేడు పాలను గానీ, ఆకులను గానీ ఎట్టి పరిస్థితుల్లోనూ తినకూడదు.
  • అలాగే కీళ్లు, మోకాల నొప్పులు మరీ ఎక్కువగా, దీర్ఘకాలికంగా ఉంటే ఈ చిట్కాతో పాటు డాక్టర్‌ని సంప్రదించడం మంచిది.

ముఖ్య గమనిక: ఈ కథనంలోని సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, కొందరు నిపుణులు పేర్కొన్న అంశాల ఆధారంగా తెలియజేశాము. వీటిని ఎంత వరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం. అలాగే పాటించే ముందు తప్పనిసరిగా వైద్య నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. సమయం తెలుగు వీటిని ధృవీకరించడం లేదు.
Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Samayam