సినిమా తారలకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వారు ఎక్కడ కనిపిస్తే అక్కడ అభిమానులు గుమిగూడటం సహజం. అయితే, ఇటీవల కాలంలో అభిమానం పేరుతో కొందరు చేస్తున్న పనులు సెలబ్రిటీలకు, ముఖ్యంగా హీరోయిన్లకు చుక్కలు చూపిస్తున్నాయి.
బహిరంగ ప్రదేశాల్లో, సినిమా ప్రమోషన్లలో లేదా షాపింగ్ మాల్ ప్రారంభోత్సవాల్లో సెలబ్రిటీలపై ఎగబడటం, వారి అనుమతి లేకుండా తాకడం వంటి సంఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి.
* సైలెంట్‌గా పని కానిచ్చేస్తోన్న ప్రశాంత్ వర్మ.. 'జై హనుమాన్'లో కీలక మార్పులు, రంగంలోకి ఆస్కార్ విజేత
మలయాళ నటి హనీ రోజ్ ఇటీవల కేరళలో ఒక షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి వెళ్లినప్పుడు ఒక చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నారు. ఆమెతో సెల్ఫీలు దిగేందుకు అభిమానులు విపరీతంగా ఎగబడ్డారు. ఈ క్రమంలోనే కొందరు అత్యుత్సాహవంతులు సెల్ఫీ తీసుకునే నెపంతో ఆమె నడుమును తాకుతూ అసభ్యంగా ప్రవర్తించారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా, నెటిజన్లు సదరు వ్యక్తుల ప్రవర్తనను తీవ్రంగా ఖండించారు.
* కోలీవుడ్‌లో 'కోర్టు' రీమేక్: హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తోన్న నటి దేవయాని కుమార్తె
తాజాగా మలయాళ స్టార్ హీరోయిన్ మంజు వారియర్ కు కూడా పాలక్కాడ్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ఇలాంటి ఇబ్బందికర పరిస్థితే ఎదురైంది. పాలక్కాడ్ ఈవెంట్లో ఆమెతో ఫోటోలు దిగేందుకు అభిమానులు పోటీ పడ్డారు. ఈ క్రమంలో ఒక మహిళా అభిమాని అందరూ చూస్తుండగానే అకస్మాత్తుగా హీరోయిన్ మంజు వారియర్‌కు బలవంతంగా ముద్దు పెట్టింది. ఈ అనూహ్య ఘటనతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈవెంట్ యాంకర్ వెంటనే స్పందిస్తూ.. "మన ఆహ్వానం మేరకు వచ్చిన అతిథులతో ఇలా ప్రవర్తించడం సరైన పద్ధతి కాదు" అని అభిమానులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
అభిమాని అంతలా ఇబ్బంది పెట్టినా మంజు వారియర్ ఎక్కడా అసహనం వ్యక్తం చేయకపోవడం విశేషం. ఆమె చాలా కూల్‌గా హుందాగా వ్యవహరించారు. తనపై జరిగిన ఈ సంఘటనకు సంబంధించి ఆమె సీరియస్ అవ్వకుండా చిరునవ్వుతోనే అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆమె ప్రవర్తన తీరుపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నప్పటికీ, సెలబ్రిటీల వ్యక్తిగత స్వేచ్ఛ, భద్రతపై చర్చ మళ్లీ తెరపైకి వచ్చింది. సెలబ్రిటీల మీద పడిపోవడం, వారి ప్రైవసీకి భంగం కలిగించడం అభిమానం అనిపించుకోదని, అభిమానులు హుందాగా ప్రవర్తించాలని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన మంజు వారియర్ సెకండ్ ఇన్నింగ్స్‌లో అద్భుతమైన పాత్రలతో ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు. తెగింపు, వేట్టయాన్, విడుదల 2 వంటి చిత్రాలతో ఆమె క్రేజ్ మరింత పెరిగింది.

