Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మొటిమలు తగ్గాలంటే కొన్ని ఆహార పదార్థాలు ఎట్టిపరిస్థితుల్లో తినకూడదట, అవేమిటంటే?

మొటిమలు తగ్గాలంటే కొన్ని ఆహార పదార్థాలు ఎట్టిపరిస్థితుల్లో తినకూడదట, అవేమిటంటే?

Telugu Samayam 5 days ago

మొటిమల సమస్య వల్ల చాలామంది ఇబ్బంది పడుతుంటారు. ముఖ్యంగా యువత ఎదుర్కునే సమస్యల్లో ప్రధానమైనది మొటిమల సమస్య. మొటిమలు తగ్గించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు.

రకరకాల ప్రొడక్ట్స్‌ ఉపయోగిస్తూ ఉంటారు. అదే సమయంలో మనం తీసుకునే కొన్ని ఆహార పదార్థాలు మొటిమలు రావడానికి కారణం అవుతాయని, వాటిని ట్రిగ్గర్‌ చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మొటిమల తగ్గాలంటే ఏయే ఆహారపదార్థాలకు దూరంగా ఉండాలో ఈ స్టోరీలో వివరంగా తెలుసుకుందాం..


కాంతివంతమైన, స్వచ్ఛమైన, స్పాట్‌లెస్‌ ముఖం కావాలని అందరూ కోరుకుంటారు. అయితే.. అందమైన, గ్లోయింగ్‌ చర్మం కోసం చాలా కేర్‌ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే కొన్నిసార్లు సరైన చర్మ సంరక్షణ పద్ధతులను పాటించినప్పటికీ మొటిమలు, మచ్చలు, సౌందర్య సమస్యలు వేధిస్తూ ఉంటాయి. ముఖ్యంగా మొటిమలు ఎంత కేర్‌ తీసుకున్నా తిరిగి వస్తూనే ఉంటాయి. మీకూ ఇలాంటి సమస్యే ఎదురవుతుంటే మీ స్కిన్‌కేర్‌ రొటీన్‌ను తప్పుబట్టడం మానేసి మొటిమలను ట్రిగ్గర్‌ చేసే కొన్ని ఆహార పదార్థాలకు దూరంగా ఉండటం స్టార్ట్‌ చేయండి.

ఈ విషయాన్ని చాలామంది నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. మనం తీసుకునే ఆహారం చర్మ ఆరోగ్యంపై ఎంతో ప్రభావం చూపుతాయని DE అధ్యయనం పేర్కొంది. మనం తీసుకునే ఆహార పదార్థాల్లో కొన్ని మొటిమల సమస్యను ట్రిగ్గర్‌ చేస్తాయి. మొటిమలు రావడానికి కారణం అయ్యే కొన్ని ఆహార పదార్థాల గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం..పాల ఉత్పత్తులు

కొందరిలో పాల ఉత్పత్తులు మొటిమల సమస్యను ట్రిగ్గర్‌ చేస్తాయి. చీజ్‌, ఫుల్-ఫ్యాట్ పెరుగు, ఐస్‌క్రీమ్ వంటి డెయిరీ ఉత్పత్తుల కారణంగా మొటిమలు వచ్చే అవకాశం ఉంది. పాలలో ఉండే కొన్ని అమైనో యాసిడ్స్‌ లివర్‌ను ప్రేరేపించి 'IGF-1' అనే హార్మోన్ ఉత్పత్తిని పెంచుతుంది. ఈ హార్మోన్ మొటిమల సమస్యతో ముడిపడి ఉంటుంది. లాక్టోస్‌ ఇన్‌టాలరెన్స్‌ ఉన్నవారిలో కూడా పాల ఉత్పత్తులు తీసుకున్న తర్వాత మొటిమలు, మెడపై దద్దుర్లు వచ్చే అవకాశం ఉంది.


శుద్ధి చేసిన ఆహార పదార్థాలు

బ్రెడ్, వైట్ పాస్తా, మైదా నూడుల్స్, వైట్‌ బ్రెడ్‌ వంటి శుద్ధి చేసిన ధాన్యాలతో చేసిన ఆహార పదార్థాలు మొటిమల సమస్యను ట్రిగ్గర్‌ చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. శుద్ధి చేసిన ఆహార పదార్థాల్లో అధిక మొత్తంలో కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఇవి రక్తంలోని చక్కెర స్థాయిలపై డైరెక్ట్‌ ఎఫెక్ట్‌ చూపిస్తాయి. ఇది ఇన్సులిన్ స్థాయిలో స్పైక్‌కు కారణం అవుతుంది. ఇన్సులిన్‌ స్థాయిలు పెరిగితే చర్మంలో నూనె ఉత్పత్తి పెరుగుతుంది. చర్మ రంధ్రాలు మూసుకుపోయేలా చేస్తుంది. దీంతో మొటిమల సమస్య తీవ్రమవుతుంది.


డీప్-ఫ్రై చేసిన ఆహార పదార్థాలు

మీకు తరచుగా మొటిమల సమస్య ఉంటే, డీప్-ఫ్రై చేసిన ఆహారాన్ని తక్కువగా తినమని కొందరు మీకు సలహా ఇచ్చే ఉంటారు. ఎందుకంటే ఫ్రెంచ్ ఫ్రైస్, బర్గర్లు, పకోడీలు, బజ్జీలు వంటి నూనెలో వేయించిన పదార్థాలు కేవలం బరువును పెంచడమే కాదు, మొటిమలకు కారణం అవుతాయి. డీప్‌-ప్రై చేసిన ఆహారం ఎక్కువగా తింటే చర్మం జిడ్డుగా మారుతుంది., దీంతో త్వరగా మొటిమలు వచ్చే అవకాశం పెరుగుతుంది.


స్పైసీ ఆహారం వద్దు

మన తెలుగుంటి వంటల్లో కొంచెం మసాలాలు, కారాలు ఎక్కువగానే ఉంటాయి. స్పైసీ చికెన్‌ కర్రీ, మసాలాలతో ఘుమఘమలాడే బిర్యానీని ఎవరు ఇష్టపడరు చెప్పండి. అయితే స్పైసీ ఫుడ్స్‌ ఎక్కువగా తింటే మొటిమల సమస్య అధికమవుతుందని నిపుణులు అంటున్నారు. స్పైసీ ఫుడ్‌ ఎక్కువగా తింటే కడుపు వేడెక్కి, ఇన్ఫ్లమేషన్‌ను ప్రేరేపిస్తుంది. ఇది మొటిమల సమస్యను తీవ్రం చేస్తుంది.


చక్కర, స్వీట్స్‌ వద్దు

స్వీట్స్‌, చక్కెర మీ రక్తంలో చక్కెర స్థాయిలపైనా, ఇన్సులిన్ స్థాయిలపైనా ఎఫెక్ట్‌ చూపిస్తాయి. స్వీట్స్‌, షుగర్‌ ఎక్కువగా తింటే రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరుగుతాయి. ఆ తర్వాత ఆ స్థాయిని తిరిగి తగ్గించడానికి మీ శరీరం అధిక మొత్తంలో ఇన్సులిన్‌ను విడుదల చేస్తుంది. ఇన్సులిన్‌ స్థాయిలు పెరిగితే చర్మంలో నూనె ఉత్పత్తి పెరుగుతుంది. ఇది మొటిమలకు కారణం అవుతుంది.

ముఖ్య గమనిక: ఈ కథనంలోని సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, కొందరు నిపుణులు పేర్కొన్న అంశాల ఆధారంగా తెలియజేశాము. వీటిని ఎంత వరకు విశ్వసించాలనేది, పాటించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం. సమయం తెలుగు వీటిని ధృవీకరించడం లేదు.


Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Samayam