Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మూడేళ్ల క్రితం ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న పవన్ .. చెట్ల కింద చదువులకు గుడ్ బై..

మూడేళ్ల క్రితం ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న పవన్ .. చెట్ల కింద చదువులకు గుడ్ బై..

Telugu Samayam 2 weeks ago

ప్రజా సమస్యల పరిష్కారంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనదైన ముద్ర వేస్తున్నారు. జనవాణి కార్యక్రమాలు, సోషల్ మీడియా ద్వారా తన దృష్టికి వచ్చే అంశాలపై వేగంగా స్పందించే పవన్ కళ్యాణ్..

ఆ సమస్యల పరిష్కారంపైనా అంతే శ్రద్ధ తీసుకుంటున్నారు. అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తూ వాటిని వేగంగా పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా మూడేళ్ల కిందట.. ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో తాను ఇచ్చిన మాటను పవన్ కళ్యాణ్ తాజాగా నిలబెట్టుకున్నారు. ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో పవన్ కళ్యాణ్ రాష్ట్రవ్యాప్తంగా పర్యటించారు. జనవాణి, వారాహి యాత్రలు నిర్వహించారు. ఈ క్రమంలోనే ఏలూరు డిగ్రీ కళాశాలలో తరగతి గదులు లేక తాము పడుతున్న అవస్థలను ఆ కాలేజీ విద్యార్థులు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువచ్చారు.

ఈ నేపథ్యంలో చెట్ల కింద పాఠాలు చెబుతున్న దీనస్థితిపై అప్పటి ప్రభుత్వాన్ని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. చెట్ల కింద చదువులు చూడాలంటే ఎక్కడో మారుమూల పల్లెలకు వెళ్ళనవసరం లేదని.. ఏలూరు నగరంలోని ప్రభుత్వ కళాశాలకు వెళ్తే చాలంటూ విమర్శలు గుప్పించారు. పథకాలకు పేర్లు పెట్టుకోవడం మీద ఉన్న శ్రధ్ధ కాలేజీకి భవనం నిర్మించడంపై పెట్టాలని వైసీపీ సర్కారుకు చురకలు అంటించారు."300మంది చదువుతున్న ఈ కాలేజీకి బటన్ నొక్కి బిల్డింగ్ కట్టించు జగన్". అంటూ అప్పట్లో పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్ వైరల్ అయ్యింది.

ఈ క్రమంలోనే తాము అధికారంలోకి వస్తే ఏలూరు డిగ్రీ కాలేజీ సమస్యలకు పరిష్కారం చూపిస్తామని అప్పట్లో విద్యార్థి సంఘాలకు పవన్ కళ్యాణ్ మాట ఇచ్చారు. ప్రస్తుతం కూటమి సర్కారు అధికారంలో ఉండటంతో నాడు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ఏలూరు ప్రభుత్వ డిగ్రీ కాలేజీ శాశ్వత భవన నిర్మాణానికి రూ.12.60 కోట్ల నిధులు మంజూరు చేయించారు. దీంతో విద్యార్థులు, స్థానికులు పవన్ కళ్యాణ్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. మరోవైపు ఏలూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలకి నిధులు మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌లకు పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు తెలియజేశారు.
Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Samayam