Mid Cap Funds: ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకునే వారిలో చాలా మంది ఏ కేటగిరీ ఫండ్స్ ఎంచుకోవాలో తేల్చుకోలేకపోతుంటారు. మిడ్ క్యాప్ ఫండ్స్ వైపు చూస్తున్న వారిలోనూ ఈ కన్ఫ్యూజన్ ఉంటుంది.
మిడ్ క్యాప్ స్టాక్స్ దీర్ఘకాలంలో మంచి రాబడులు అందిస్తుంటాయి. మిడ్ క్యాప్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడం ద్వారా ఇన్వెస్టర్లకు మంచి రాబడులు పొందుతుంటారు. మిడ్ క్యాప్ స్కీమ్స్ మిడ్ క్యాప్ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తుంటాయి.సెబీ నిబంధనల ప్రకారం మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రకారం 101 నుంచి 250 మధఅయలో ఉన్న కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. భవిష్యత్తులో ఈ కంపెనీలో మార్కెట్ లీడర్లుగా మారుతుంటాయి. అందుకే వీటిని ఎంచుకునేందుకు చాలా మంది ఇష్టపడుతుంటారు.
మీరు కూడా మిడ్ క్యాప్ స్కీమ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? అయితే ఈ ఏప్రిల్ 2026లో ఇన్వెస్ట్ చేసేందుకు బెస్ట్ మిడ్ క్యాప్ ఫండ్స్ జాబితాను ఈటీ మ్యూచువల్ ఫండ్స్ లిస్ట్ చేసింది.అయితే, ఈ స్కీమ్స్‌లో ఇన్వెస్ట్ చేసే వారు ప్రతి నెలా తమ ఫండ్స్‌ను సమీక్షిస్తూ వాటి రాబడులు, పనితీరును గమనిస్తూ ఉండాలి. మంచి రాబడులు అందించిన మిడ్ క్యాప్ స్కీమ్స్‌లో ఇన్వెస్కో ఇండియా మిడ్ క్యాప్ ఫండ్ (Invesco India Midcap Fund) ముందు వరుసలో ఉంది. గడిచిన 11 నెలల కాలంలో మంచి రాబడులు అందించి ఫస్ట్ క్వార్టైల్ లోకి వచ్చింది. ఇంతకు ముందు ఇది సెకండ్ క్వార్టైల్ లో ఉండేది. ఆ తర్వాత యాక్సిస్ మిడ్ క్యాప్ ఫండ్ (Axis Midcap Fund) గత పదకొండు నెలల్లో నాలుగో క్వార్టైల్ నుంచి మూడో క్వార్టైల్ కి వచ్చింది.
టాటా మిడ్ క్యాప్ ఫండ్ (Tata Mid cap Fund) గడిచిన 9 నెలలుగా రెండో క్వార్టైల్‌లో కొనసాగుతోంది. అంతకు ముందు మూడో క్వార్టైల్ లో ఉండేది. పీజీఐఎం ఇండియా మిడ్ క్యాప్ ఫండ్ (PGIM India Midcap Fund) గత 24 నెలలుగా నాలుగో క్వార్టైల్ లో కొనసాగుతోంది. ఆ తర్వాత కోటక్ మిడ్ క్యాప్ ఫండ్ (Kotak Midcap Fund) గత ఏడు నెలలుగా రెండో క్వార్టైల్ లో కొనసాగుతోంది.
- ఫస్ట్ క్వార్టైల్ అంటే అత్యుత్తమ పనితీరు కనబరిచిన మొదటి 25 శాతం ఫండ్స్
- రెండో క్వార్టైల్ అంటే 26 శాతం నుంచి 50 శాతం మధ్య ఉన్న ఫండ్స్
- మూడో క్వార్టైల్ అంటే 51 శాతం నుంచి 75 శాతం మధ్యలో ఉన్న ఫండ్స్ (సగటు రాబడి కంటే తక్కువ)
- నాలుగో క్వార్టైల్ అంటే చివరి 25 శాతం ఫండ్స్ (అత్యల్ప రిటర్న్స్ ఇచ్చినవి)
బెస్ట్ మిడ్ క్యాప్ ఫండ్స్ ఇవే
- యాక్సిస్ మిడ్ క్యాప్ ఫండ్
- పీజీఐఎం ఇండియా మిడ్ క్యాప్ ఫండ్
- ఇన్వెస్కో ఇండియా మిడ్ క్యాప్ ఫండ్
- కోటక్ మిడ్ క్యాప్ ఫండ్
- టాటా మిడ్ క్యాప్ ఫండ్

