కుకు విత్ జాతిరత్నాలు రెండో సీజన్ ముగింపునకు వచ్చింది. ఈ వీకెండ్‌తో ఈ రెండో సీజన్ ముగిసిపోతుంది. తనూజ, రాకేష్, పల్లవి, పవన్, ఆషిక, నిఖిల్ మాత్రమే మిగిలారు.
మరి ఈ టాప్ 6 కుక్స్ నుంచి ఫైనల్‌గా నంబర్ వన్ స్థానానికి ఎవరు వెళ్తారు? టైటిల్ ఎవరు గెలుస్తారు? అన్నది చూడాలి. ఇప్పటికే గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్‌కి సంబంధించిన పనులు పూర్తయినట్టుగా కనిపిస్తోంది. తాజాగా వదిలిన ప్రోమోని చూస్తే ఈ ఫినాలే ఎపిసోడ్‌ను మరింత గ్రాండ్‌గా నిర్వహించబోతోన్నట్టుగా అనిపిస్తోంది. ఈ ప్రోమోలో కుక్స్, జాతిరత్నాలతో పాటుగా జడ్జ్‌లు కూడా ఫుల్ హంగామా చేశారు.
పబ్, పార్టీకి వచ్చినట్టుగా జడ్జ్‌లు అంతా జిగేల్‌మంటూ మెరిసే దుస్తుల్లో వచ్చారు. ప్రతీ ఒక్క కుక్ తామే టైటిల్ కొడతామనే నమ్మకంతో ఉన్నారు. అలీ గారు సూట్ వేశారు అని ప్రదీప్ అంటే.. పార్టీ అంటే ఈ మాత్రం ఉండాలి కదా అని అంటాడు. పార్టీ ఆర్గనైజర్ అని హరి ఎంట్రీ ఇస్తాడు. రీసెంట్‌గా శ్రీదేవీ గారి కూతురి బర్త్ డే పార్టీని కూడా శ్రీలంకలో గ్రాండ్‌గా చేశాను అని హరి అంటాడు. అది బాగా జరిగింది.. నువ్వు ఎందుకు చేశావ్ అని పరువుతీస్తుంది శ్రీదేవీ. దీంతో హరిని చూసి రాకేష్ పగలబడి నవ్వేస్తాడు.
రోహిణి, నిఖిల్ కలిసి ఎంట్రీ ఇచ్చినట్టుగా అనిపిస్తోంది. ఈవెంట్‌కి సింగర్ కావాలంటే చెప్పండి మేం వస్తాం.. మా రెమ్యూనరేషన్ కేవలం ఐదున్నర లక్షలే అని రోహిణి అంటుంది. నాకు రెండు, తనకు మూడున్నర అని నిఖిల్ అంటాడు. లేదు.. లేదు.. నాకు నాలుగు, వాడికి ఒకటిన్నర అని రోహిణి అంటుంది. నాకు ఎప్పుడూ నాలుగే.. వాడే తగ్గుతూ ఉంటాడు అని రోహిణి అనడంతో నిఖిల్ షాక్ అవుతాడు. అవినాష్ ఏమో డీజే టిల్లు స్టైల్లో ఎంట్రీ ఇస్తాడు. డీఎస్పీ వాయిస్ అని అవినాష్ అనడంతోనే రాకేష్ వస్తాడు. నీకు దండం రా బాబు అని అవినాష్ పక్కకి వెళ్లిపోతాడు.
లాస్ట్ సీజన్‌లో తనూజది, నాది బెస్ట్ పెయిర్.. తనకు తెగితే నాకు బ్లెడ్ వచ్చేది.. నాకు తెగితే తనకు బ్లెడ్ వచ్చేది అని ఇమ్ము ఓవర్ చేస్తుంటాడు. మరి ఇప్పుడు మాకు బ్లెడ్ వస్తుందా? అని ప్రదీప్ కౌంటర్ వేస్తాడు. బుట్టబొమ్మలా పల్లవి రెడీ అయితే.. తాగుబోతులా నూకరాజు వస్తాడు. తాగుబోతు వాయిస్ మిమిక్రీ చేస్తాను అన్నట్టుగా రాకేష్ దూరతాడు. మళ్లీ ఈయన వచ్చాడా? అని నూకరాజు పక్కకి వెళ్లిపోతాడు. అలా ఈ ప్రోమో అంతా కూడా ఫుల్ ఫన్‌గా సాగింది. ఇక ప్రోమోనే ఇలా ఉంటే గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ ఏ రేంజ్‌లో ఉంటుందో ఊహించుకోవచ్చు.

