Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నా రెండో పెళ్లి చానాళ్ల క్రితమే అయ్యింది.. మా అమ్మాయికి పెళ్లి వయసు వచ్చింది: సురేఖా వాణి క్లారిటీ

నా రెండో పెళ్లి చానాళ్ల క్రితమే అయ్యింది.. మా అమ్మాయికి పెళ్లి వయసు వచ్చింది: సురేఖా వాణి క్లారిటీ

Telugu Samayam 2 weeks ago

టి సురేఖా వాణి గురించి పరిచయాలు అవసరం లేదు. సౌత్ ఇండస్ట్రీలో బిజీ క్యారక్టర్ ఆర్టిస్టులలో ఆమె ఒకరు. ఎన్నో సినిమాల్లో అక్కగా, వదినగా, తల్లిగా నటించి ప్రేక్షకులను అలరించారు.

తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సురేఖ.. రెగ్యులర్ గా తన కుమార్తె సుప్రీత నాయుడుతో కలిసి దిగిన ఫోటోలు, వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ నెట్టింట సందడి చేస్తుంటారు. సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్ పై సురేఖ తాజాగా స్పందించారు.

'నీరమ్' అనే సినిమా ప్రెస్ మీట్‌లో సురేఖా వాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ట్రోల్స్ పై రియాక్ట్ అయ్యారు. ''సోషల్ మీడియాలో వచ్చే రియాక్షన్స్ పై గతంలోనే నేనొకసారి చెప్పాను. ట్రోల్స్ ను మొదట్లో పట్టించుకునేవాళ్లం కానీ, తర్వాత పట్టించుకోవడం మానేశాం. మనదేంటి?, నేనేంటి?, నాకేంటి? అంతే. చుట్టుపక్కల ఉన్నవాళ్లు ఏమనుకుంటున్నారు అనేది నాకు అనవసరం. నేను ఏం చేస్తున్నానో అదే నాకు ముఖ్యం. ఈ పోస్ట్ పెట్టాలంటే ఆ పోస్ట్ పెడతా. ఎలా ఫోటో దిగాలంటే అలా దిగుతా. అది నా ఇష్టం. వాళ్లు వీళ్లు ఏమనుకుంటారో అని ఆలోచిస్తే కష్టం'' అని సురేఖ అన్నారు.

సురేఖావాణి రెండో పెళ్లి వార్తలు ఎప్పటినుంచో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కూతురు సుప్రీత ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన తల్లికి రెండో పెళ్లి చేశాకే తాను వివాహం చేసుకుంటానని అన్నారు. అంతేకాదు తన తండ్రి స్థానంలో ఇంకొకరు ఉన్నారని చెప్పడంతో, నిజంగానే సురేఖ మళ్లీ పెళ్లి చేసుకుంటారేమో అని అందరూ భావించారు. తన రెండో పెళ్లి రూమర్స్ పై ఇప్పుడు 'నీరమ్' మూవీ ప్రెస్ మీట్‌లో సురేఖా వాణి క్లారిటీ ఇచ్చారు.

''నాకు మళ్లీ పెళ్లి చేసుకోవాలనే ఆలోచనైతే లేదు. ఆ ఆలోచన ఉండి ఉంటే ఇన్ని రోజులు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ప్రస్తుతానికైతే ఆ ఆలోచన లేదు. ఇక మీదట కూడా ఉండదనే అనుకుంటున్నా. మా అమ్మాయికి పెళ్లి చేసే వయసు వచ్చింది. ఇప్పుడు నేనేం పెళ్లి చేసుకుంటాను. అయినా మీడియా వాళ్లు నా పెళ్లి ఎప్పుడో చేసేశారు. చాన్నాళ్ల క్రితమే ఆర్టికల్స్ కూడా రాసేశారు'' అని సురేఖ వాణి నవ్వుతూ అన్నారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

సురేఖ వాణి ఈ మధ్య కాలంలో సినిమాలతో కంటే సోషల్ మీడియాలోనే ఎక్కువగా కనిపిస్తున్నారు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ సినిమా అవకాశాలకు ఎందుకు దూరమయ్యారు? అని ఓ జర్నలిస్ట్ అడగ్గా.. ఆవిడకు ఎందుకు క్యారెక్టర్స్ ఇవ్వట్లేదని దర్శక నిర్మాతలను అడగాలని సురేఖ విజ్ఞప్తి చేశారు. తన కూతురు దగ్గరకు వచ్చే ప్రతీ స్టోరీని తానూ వింటానని, కానీ అందులో నటించాలా వద్దా అనేది పూర్తిగా సుప్రీత నిర్ణయమేనని సురేఖ వాణి చెప్పుకొచ్చారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Samayam