తెలంగాణ రాజకీయాలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోసారి స్పందించారు. అమరావతిలోని అమరజీవి పొట్టి శ్రీరాములు 58 అడుగుల కాంస్య విగ్రహాన్ని సందర్శించిన పవన్ కళ్యాణ్..
పొట్టి శ్రీరాములుకు నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఇంకా ప్రాంతీయ నినాదం ఉనికిలో ఉందన్న పవన్ కళ్యాణ్.. ఏపీలో మాత్రం ఆంధ్ర అనే ఉనికి లేదన్నారు. హైదరాబాద్‌లో తన సమావేశానికి అనుమతి ఇచ్చి ఉంటే సాదాసీదాగా సాగిపోయేదని.. ఈ వివాదం తలెత్తేది కాదని అభిప్రాయపడ్డారు. తెలంగాణ ప్రజల గురించి తానెప్పుడూ చెడుగా మాట్లాడలేదని.. తెలంగాణ ప్రాంతం ఎప్పటికీ ఆ ప్రాంత భూమిపుత్రులదేనని స్పష్టం చేశారు. అయితే తెలంగాణ భూమిపుత్రులే పోటీ చేస్తామంటే అభ్యంతరాలు ఎందుకని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు.
కేటీఆర్ వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ రియాక్షన్
తెలంగాణలోని నా ఇంటికి వెళ్లకూడదా.. పవన్ కళ్యాణ్

