Dailyhunt
నారా లోకేష్ పాదయాత్రలో టీడీపీలో చేరిన వైసీపీ నేతలు

నారా లోకేష్ పాదయాత్రలో టీడీపీలో చేరిన వైసీపీ నేతలు

Telugu Samayam 3 weeks ago

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర అమలాపురంలో కొనసాగుతోంది. పేరూరు విడిది కేంద్రం నుంచి యువగళం 211వ రోజు పాదయాత్రను ఆయన ప్రారంభించారు.

అమలాపురం, ముమ్మిడివరం నియోజకవర్గాలలో పాదయాత్ర కొనసాగనుంది. ఇటీవల వైఎస్సార్‌సీపీకి రాజీనామా చేసిన ఏలేశ్వరం, రౌతులపూడి ఎంపీపీలు.. ఎంపీటీసీ, సర్పంచ్‌లు లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరారు. అనంతరం ఆక్వారైతులతో లోకేష్ సమావేశమయ్యారు. జగన్‌ పాలనలో ఆక్వా హాలిడే ప్రకటించే దారుణ పరిస్థితులు ఉన్నాయన్నారు. సీడ్, ఫీడ్, విద్యుత్ ఛార్జీలు భారీగా పెంచి ఆక్వా రైతులను ఆక్వా రైతులను జగన్‌ ప్రభుత్వం కోలుకోలేని దెబ్బతీసిందని.. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఆక్వా రంగాన్ని ఆదుకుంటామన్నారు. ఫీడ్‌, సీడ్‌, విద్యుత్‌ ధరలు తగ్గేలా చర్యలు.. గిట్టుబాటు ధరకు అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు.

 నిత్యావసర సరుకుల ధరలు, గ్యాస్, ఇంటి పన్ను, చెత్త పన్ను అంటూ ప్రభుత్వం సామాన్యుడిపై పెను భారం మోపిందని నారా లోకేష్ అన్నారు. పెరిగిన ఖర్చులతో బతకడం కష్టంగా మారిందన్నారు. టీడీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత భారం తగ్గించాలని లోకేష్‌ను మహిళలు కోరారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఏడాదికి మూడు గ్యాస్ సిలెండర్లు ఉచితంగా అందిస్తామని లోకేష్ తెలిపారు. జగన్ 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచేశారని.. బిల్లు పట్టుకుంటే షాక్ కొడుతుందన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పన్నుల భారం తగ్గిస్తామని నారా లోకేష్ హామీ ఇచ్చారు.నారా లోకేష్ పాదయాత్రలో టీడీపీలో చేరిన వైసీపీ నేతలు
నారా లోకేష్ పాదయాత్రలో టీడీపీలో చేరిన వైసీపీ నేతలు
నారా లోకేష్ పాదయాత్రలో టీడీపీలో చేరిన వైసీపీ నేతలు
నారా లోకేష్ పాదయాత్రలో టీడీపీలో చేరిన వైసీపీ నేతలు
నారా లోకేష్ పాదయాత్రలో టీడీపీలో చేరిన వైసీపీ నేతలు
నారా లోకేష్ పాదయాత్రలో టీడీపీలో చేరిన వైసీపీ నేతలు
నారా లోకేష్ పాదయాత్రలో టీడీపీలో చేరిన వైసీపీ నేతలు
నారా లోకేష్ పాదయాత్రలో టీడీపీలో చేరిన వైసీపీ నేతలు
నారా లోకేష్ పాదయాత్రలో టీడీపీలో చేరిన వైసీపీ నేతలు
నారా లోకేష్ పాదయాత్రలో టీడీపీలో చేరిన వైసీపీ నేతలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Samayam