సినిమా ఇండస్ట్రీలో అభిమానులు తమకు నచ్చిన నటీనటులకు ప్రేమతో కొత్త పేర్లు పెట్టడం, బిరుదులు ఇవ్వడం సాధారణంగా చూస్తూనే ఉంటాం. కొన్నిసార్లు ఆ పేర్లే సెలబ్రిటీలకు స్టార్ స్టేటస్‌ను కూడా తెచ్చిపెడతాయి.
గతంలో అక్కినేని అఖిల్ విషయంలో "అయ్యగారే నెంబర్ వన్" అనే డైలాగ్ సోషల్ మీడియాను ఎంతగా ఊపేసిందో అందరికీ తెలిసిందే. అప్పటి నుంచి ఫ్యాన్స్ ఆయన్ను ముద్దుగా 'అయ్యగారు' అని పిలుచుకుంటున్నారు. అయితే తాజాగా తిరుపతి వేదికగా జరిగిన 'లెనిన్' ప్రీ రిలీజ్ వేడుకలో అఖిల్‌కు ఓ అభిమాని సరికొత్త పేరు పెట్టి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆ పేరు వెనుక ఉన్న లోతైన అర్థాన్ని వివరించి అందరి దృష్టిని ఆకర్షించారు.
* మళ్లీ సంక్రాంతి సీజన్‌పై కన్నేసిన రవితేజ.. శ్రీవిష్ణుతో కలిసి నవ్వుల జాతర!
గత కొంతకాలంగా సరైన కమర్షియల్ సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న అఖిల్ అక్కినేని.. దాదాపు మూడేళ్ల విరామం తర్వాత నటిస్తున్న తాజా చిత్రం 'లెనిన్'. మురళి కిషోర్ అబ్బూరి దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్, అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం జూలై 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఆదివారం సాయంత్రం తిరుపతిలోని నెహ్రూ మున్సిపల్ గ్రౌండ్స్‌లో భారీస్థాయిలో ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ వేడుకలోనే అఖిల్ కొత్త పేరు వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది.
అఖిల్ కాదు 'నాగ అఖిల్'
ఖమ్మం జిల్లా భద్రాచలం నుంచి భద్రాద్రి రామయ్య విగ్రహాలతో ఈ ఈవెంట్‌కు హాజరైన నరసింహారావు (అనపరెడ్డిపల్లి శివాలయం చైర్మన్) అనే అభిమాని స్టేజ్ దగ్గర అఖిల్‌కు 'నాగ అఖిల్' అని నామకరణం చేశారు. ఈ పేరు కేవలం సాధారణంగా పెట్టింది కాదని, దీని వెనుక అక్కినేని కుటుంబానికి చెందిన నలుగురు గొప్ప వ్యక్తుల పేర్లు దాగున్నాయని ఆయన వివరించారు.
నాగ: ఈ పదంలో అక్కినేని నాగేశ్వరరావు, అక్కినేని నాగార్జునల పేర్లు ఉన్నాయి.
అఖిల్: ఈ పేరులోని మొదటి అక్షరాల్లో అన్నపూర్ణమ్మ, అమల పేర్ల సెంటిమెంట్ దాగి ఉంది.
ఇలా అక్కినేని వంశంలోని నలుగురు ముఖ్యుల ఆశీస్సులు, ప్రతిబింబం ఈ ఒక్క పేరులోనే కనిపిస్తాయని ఆ అభిమాని చెప్పుకొచ్చారు.* ఎన్టీఆర్ 'గాడ్ ఆఫ్ వార్' కోసం త్రివిక్రమ్ అదిరిపోయే ప్లాన్.. రంగంలోకి బాలీవుడ్ స్టార్!
'లెనిన్' తర్వాత విధ్వంసమే
ఇప్పటివరకు అఖిల్ చేసిన సినిమాలు ఒక ఎత్తైతే, భద్రాద్రి రామయ్య సాక్షిగా 'నాగ అఖిల్' అనే పేరు మార్పు తర్వాత ఆయన కెరీర్ మరో ఎత్తుకు వెళ్తుందని సదరు అభిమాని జోస్యం చెప్పారు. ఈ సినిమా తర్వాత డబుల్ ఇంపాక్ట్‌తో 'నాగ అఖిల్' బాక్సాఫీస్ వద్ద విధ్వంసం సృష్టించడం ఖాయమని ఆయన వ్యాఖ్యానించారు. రాముల వారి విగ్రహాలను చేతిలో పట్టుకుని ఆ అభిమాని చేసిన ఈ ఆసక్తికర వ్యాఖ్యలు, కొత్త పేరుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ సెంటిమెంట్ వర్కవుట్ అయి 'లెనిన్' చిత్రంతో అఖిల్ భారీ విజయాన్ని అందుకోవాలని అక్కినేని అభిమానులు కూడా ఆశిస్తున్నారు.

