Dailyhunt
నవదీప్ భార్యనంటూ స్టేజ్ మీద రచ్చ.. వామ్మో ఇదేం ట్విస్ట్ రా బాబు

నవదీప్ భార్యనంటూ స్టేజ్ మీద రచ్చ.. వామ్మో ఇదేం ట్విస్ట్ రా బాబు

Telugu Samayam 6 days ago

బుల్లితెరపై సీరియల్స్ తరువాత ఎంటర్టైన్మెంట్ షోలకి మంచి డిమాండ్ ఉంటుంది. స్టార్ మా, ఈటీవీ, జీ తెలుగు ఇలా అన్ని ఛానెల్స్‌లో ఎంటర్టైన్మెంట్ షోలున్నాయి.

కామెడీ, డ్యాన్స్, సింగింగ్ ఇలా చాలా షోలున్నాయి. కానీ జెమినీలో మాత్రం అలాంటి షోలని ఈ మధ్య ఎక్కువగా తీసుకు రావడం లేదు. ఇక బుల్లితెరపై జబర్దస్త్ షోకి పోటీగా ఎన్ని షోలు వచ్చినా స్టాండర్డ్‌గా నిలబడటం లేదు. అలా స్టార్ మా నుంచి, జీ తెలుగు నుంచి కొన్ని కామెడీ షోలు వచ్చాయి. కానీ అవి ఎక్కువ రోజులు నిలబడలేదు. అయితే ఇప్పుడు జెమిని ఛానెల్ నుంచి మాస్ జాతర అనే కొత్త షోని దించారు.

ఈ మాస్ జాతర షోలో అమర్ దీప్, దీపిక, సుప్రిత ఇలా మంది బుల్లితెర తారలున్నారు. ఇక జడ్జ్‌లుగా జానీ మాస్టర్, నవదీప్, బిందు మాధవిలను తీసుకు వచ్చారు. వీరంతా కలిసి షోని ముందుకు తీసుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే స్టేజ్ మీద పర్ఫామ్ చేసే ఆర్టిస్టుల విషయంలో మాత్రం వ్యవహారం తేడా కొట్టేసినట్టుగా కనిపిస్తుంది. సోషల్ మీడియాలోని రీల్స్ బ్యాచ్‌ని తీసుకు వచ్చినట్టుగా అనిపిస్తుంది. దీంతో కామెడీ స్కిట్లు ఎక్కువగా వర్కౌట్ అవ్వడం లేదని అర్థం అవుతోంది. అయినా సరే నెమ్మదిగా షోని పట్టాలెక్కించే ప్రయత్నం చేస్తున్నారు.

అటు వైపు జబర్దస్త్ లాంటి బ్రాండెడ్ షో సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది. పైగా జబర్దస్త్ ఆర్టిస్టులందరికీ మంచి ఇమేజ్ క్రియేట్ అయింది. ఇక మాస్ జాతర ఆర్టిస్టులకి ఇంకా సరైన గుర్తింపు రావడం లేదు. దానికి చాలానే టైం పట్టేలా ఉంది. అయితే తాజాగా వదిలిన ప్రోమోని చూస్తుంటే నవదీప్‌ని బాగానే వాడుకడున్నట్టుగా కనిపిస్తోంది. నవదీప్‌ని కూడా స్కిట్లో ఇన్వాల్వ్ చేయించినట్టు అనిపిస్తోంది. నవదీప్ భార్య అంటూ ఓ ఆర్టిస్ట్ నానా హంగామా చేసింది స్టేజ్ మీద.


హేయ్ నవదీపు.. ఇంట్లా పిల్లాడికి డైపర్లు మార్చాలి.. ఇంట్ల వంట చేయాలి.. అవన్నీ మానుకుని ఇక్కడేం చేస్తున్నావ్ అని ఓ ఆర్టిస్ట్ అంటుంది. దీంతో నవదీప్ ఖంగుతింటాడు. ఎవరమ్మా నువ్వు, ఎవరికి పెళ్లానివి అని నవదీప్ అంటాడు. నీకే అని ఆర్టిస్ట్ అనడంతో నవదీప్ షాక్ అవుతాడు. పిల్లాడికి అచ్చం నీ పోలికలే ఉన్నాయ్ కదా?
అని అనడంతో నవదీప్ మరింత ఆశ్చర్యపోతాడు. అలా నవదీప్‌ని స్కిట్ కోసం బాగానే వాడుకున్నట్టుగా కనిపిస్తోంది. మరి ఈ స్కిట్‌లో భాగంగా నవదీప్ భార్య అంటూ స్టేజ్ మీద చేసిన హంగామా పూర్తి ఎపిసోడ్‌లో ఎలా ఉంటుందో చూడాలి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Samayam