Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Nuvvu Leka Nenu Lenu Serial Today 02 September Episode: చివరిసారిగా వార్నింగ్ ఇచ్చిన రాధ.. పిచ్చకొట్టుడు కొట్టిన దమయంతి తట్టాబుట్టా సర్దుకుని పారిపోనున్న సుందరి

Nuvvu Leka Nenu Lenu Serial Today 02 September Episode: చివరిసారిగా వార్నింగ్ ఇచ్చిన రాధ.. పిచ్చకొట్టుడు కొట్టిన దమయంతి తట్టాబుట్టా సర్దుకుని పారిపోనున్న సుందరి

Telugu Samayam 1 week ago

ఎంత మోసం చేశారు.. నన్నే ఇంతలా బురిడీ కొట్టిస్తారా? అని రాధ, విక్రమ్ నాటకం గురించి తెలుసుకున్న సుందరి తనలో తాను అనుకుంటూ ఉంటుంది. మేం చేసింది మోసం కాదు..

నువ్వు చేసేది మోసం.. దేవుడు లాంటి రామచంద్ర గారిని మోసం చేస్తున్నావు.. ఆయన్ను మోసం చేయడం తప్పు.. నీ విషయం విక్రమ్‌ గారికి తెలుసు.. కానీ నిన్ను ఆడిస్తున్న దమయంతి గారే అది చెప్తారని అవకాశం ఇచ్చారు.. కానీ ఆమె చెప్పడం లేదు.. నిన్ను కూడా విక్రమ్ వదిలి పెట్టడు అని సుందరితో రాధ అంటుంది.

ఇంకో వైపు దమయంతి ఆలోచనల్లో పడుతుంది. అటు రాధ, ఇటు సుందరి.. మధ్యలో రంగమార్తాండ, పాపాయమ్మ నసని దమయంతి భరించలేకపోతుంటుంది. ఇంతలో పాపాయమ్మ వచ్చి మరింతగా చిరాకు పెడుతుంది. దీంతో అందరినీ కలిపి ఉతికేస్తుంది దమయంతి. చెంప దెబ్బల రియాక్షన్ బాగుందని అన్నారు.. అందుకని ఇంతలా కొడతారా? అని రంగమార్తాండ అంటాడు. ఇది రియాల్టీ షో కాదురా అని గన్ తీసి బెదిరిస్తుంది దమయంతి. అయినా సరే వాళ్లు నమ్మరు. దీంతో బెల్ట్ తీసుకుని ఎడాపెడా వాయించేస్తుంది.

నేను వెళ్తానని ఎలా అనుకున్నావ్.. నిన్ను కూడా చంపేస్తా.. నా దారికి అడ్డు వచ్చిన వాళ్లందరినీ చంపేస్తా అని కత్తి తీసి బెదిరిస్తుంది సుందరి. ఆ కత్తిని లాక్కుని సుందరికి వార్నింగ్ ఇస్తుంది. నిన్ను చంపడం నా ఉద్దేశం కాదు.. కానీ నా కుటుంబానికి హాని చేస్తే మాత్రం నిన్ను చంపేస్తా అని రాధ అంటుంది. నువ్వు కూడా దొంగ భార్యవే కదా.. నాలానే నువ్వు కూడా నటిస్తున్నావ్ కదా అని అంటుంది సుందరి. నేను మంచి కోసం చేస్తున్నా.. నువ్వు స్వార్థం కోసం చేస్తున్నావ్ అయినా.. నా మెడలో నల్ల పూసలు పడ్డ తర్వాత విక్రమ్‌ని భర్తలానే భావిస్తున్నా..

ఆయనకి కూడా నా మీద ప్రేమ ఉంది.. అది బయట పెడితే.. మా అగ్రిమెంట్ పెళ్లి కాస్తా నిజమైన పెళ్లిలా మారుతుంది. కానీ నిజం బయట పెడితే నీది మోసం అవుతుంది.. నీకు ఇదే చివరి వార్నింగ్ .. తెల్లారి సరికల్లా తట్టాబుట్టా సర్దుకుని వెళ్లిపో అని అంటుంది రాధ. దీంతో సుందరి భయ పడిపోతుంది. రియాల్టీ షో అని భ్రమలో ఉన్న కుటుంబానికి జరిగిందంతా చెబుతుంది సుందరి. దీంతో పాపాయమ్మ, రంగమార్తాండ షాక్ అవుతారు. మరి ఏం చేద్దామని వాళ్లు అడిగితే.. రాత్రికి రాత్రి.. ఏది దొరికితే అది పట్టుకుని పోదాం అని అంటుంది సుందరి.

బావా.. బావా.. అని రాధ పిలుస్తుంది. కానీ చిట్టి పిలుస్తున్నట్టుగా విక్రమ్‌కి వినిపిస్తుంది. దీంతో ఇల్లంతా వెతుకుతాడు విక్రమ్. పిలిచింది నువ్వా? మరి నాకేంటి చిట్టి పిలిచినట్టు అనిపించిందని విక్రమ్ అంటాడు. అయితే నన్నే చిట్టి అనుకో.. అని రాధ అంటుంది. అలా అనుకోలేను.. రాధను ఎవ్వరూ రీ ప్లేస్ చేయలేరు అని విక్రమ్ అంటాడు. ఎక్కడ ఉందో తెలియని చిట్టిని నేను రీప్లేస్ చేస్తా.. మీ కనెక్షన్‌ని నా వైపు తిప్పుకోవాలి అని రాధ అనుకుంటుంది. అంతటితో ఎపిసోడ్ పూర్తవుతుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Samayam