తాగిన మత్తులో విక్రమ్ ఉండగా.. అతడ్ని రూంలోకి తీసుకు వచ్చి, బెడ్డుపై పడుకోబెట్టే టైంలో అకస్మాత్తుగా బుగ్గ మీద ముద్దు పెట్టేస్తుంది రాధ. ఆ ముద్దుతో రాధ గాల్లో తేలిపోతుంది.
ఇంకో వైపు లవంగం తాను కనిపెట్టిన నిజాన్ని దమయంతికి చెబుతాడు. దీంతో దమయంతి లాగి పెట్టి కొడుతుంది. ఇలాంటిది కని పెడితే.. ముందు నాకు చెప్పకుండా ఇంట్లో వాళ్లందరికీ చెప్తావా? అని ఫైర్ అవుతుంది. ఇంకోసారి చిట్టి గురించి ఆలోచించినా? దొంగ చిట్టి గురించి ఆరాలు తీసినా.. నీకు అదే చివరి రోజు అవుతుందని లవంగంకి వార్నింగ్ ఇస్తుంది దమయంతి. దొంగ చిట్టి అని తెలిసినా ఎందుకు సైలెంట్‌గా ఉన్నారు అని లవంగం అనుకుంటాడు. అయినా మనకు ఎందుకు లే అని లవంగం లైట్ తీసుకుంటాడు.
ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత విక్రమ్ తన బుగ్గ మీదున్న కిస్ సింబల్‌ను చూసి షాక్ అవుతాడు. ఇది కచ్చితంగా రాధ పనే అని విక్రమ్ అనుకుంటాడు. రాధ అని గట్టిగా పిలిచేస్తాడు విక్రమ్. ఈ ముద్దు ఏంటి.. నువ్వే పెట్టావ్ కదా అని అంటాడు. నేను కూడా మత్తులో మీరు పెట్టుకుని ఉంటారు.. లేదంటే.. మీ చిట్టి పెట్టి ఉంటుంది అని అంటుంది. చిట్టి పెట్టిందా? అని సంబరపడిపోతాడు విక్రమ్. ఇదంతా కాదు.. నువ్వు ఎందుకు పెట్టావో చెప్పు అని విక్రమ్ అంటాడు. రాత్రి ఏం జరిగిందో మీకు గుర్తు లేదా.. ఒకసారి గుర్తు తెచ్చుకోండని విక్రమ్‌కి చెబుతుంది రాధ.
దీంతో విక్రమ్‌కి రాత్రి జరిగిన ఘటన గుర్తుకు వస్తుంది. యాక్సిడెంట్‌లో అలా ముద్దు పెట్టేసిన విషయం గుర్తుకు వస్తుంది. సరే ఇదే లాస్ట్ వార్నింగ్ అని విక్రమ్ అంటే.. అది నా డైలాగ్ అని వార్నింగ్ ఇస్తుంది రాధ. ఇంకో వైపు గుర్రు పెట్టి నిద్రపోతోన్న సుందరిపై నీళ్లు చల్లి లేపుతుంది దమయంతి. నీ ఓవర్ యాక్షన్ వల్లే.. లవంగం కనిపెట్టాడు.. జాగ్రత్తగా ఉండు.. అని దమయంతి వార్నింగ్ ఇస్తుంది. నేను దొరికిపోతే మీరే కాపాడతారు కదా అని సుందరి అంటుంది. నేను ఎందుకు కాపాడతాను.. నిన్ను జైల్లో వేయిస్తా .. అని దమయంతి అంటుంది.
ఇంకో వైపు విక్రమ్‌తో రాధ తన ఫీలింగ్స్‌ను చిట్టి పేరు అడ్డం పెట్టుకుని బయట పెట్టేస్తుంది. నువ్వు నిజంగానే చిట్టిని ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తే ఇలా చేతిలో చేయి వేసుకుని చూస్తూ ఉండాలనిపించాలి.. ఎప్పుడూ ఇలానే పక్కనే ఉండాలనిపించాలి.. ఇవన్నీ నీకు అనిపిస్తున్నాయా? అని రాధ అడుగుతుంది. ఇవన్నీ చేయాలని చెబుతున్నావా? నీకు ఉన్నాయని చెబుతున్నావా? అని విక్రమ్ కౌంటర్ వేస్తాడు. అయినా నాకు చిట్టి మీద ఇలాంటి ఫీలింగ్స్ లేవని చెబితే ఆట పట్టిస్తుంది.. ఉన్నాయ్.. అన్నీ ఉన్నాయ్ అని విక్రమ్ అంటాడు.
నువ్వు అబద్దం చెబుతున్నావ్.. నేను నిజం చెబుతున్నాను.. అని రాధ అంటుంది. అబద్దం అని ఎలా కనిపెట్టింది అని విక్రమ్ అనుకుంటాడు. నేను చెప్పింది నిజం అయితే.. వర్షం పడుతుంది.. అని మనసులో ప్రార్థిస్తుంది రాధ. అంతటితో ఎపిసోడ్ పూర్తవుతుంది.

