Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
OG 2: 'ఓజీ 2' అప్‌డేట్‌పై సస్పెన్స్.. పవన్ కళ్యాణ్ బర్త్‌డేకి ఫ్యాన్స్‌కు నిరాశ తప్పదా?

OG 2: 'ఓజీ 2' అప్‌డేట్‌పై సస్పెన్స్.. పవన్ కళ్యాణ్ బర్త్‌డేకి ఫ్యాన్స్‌కు నిరాశ తప్పదా?

Telugu Samayam 2 weeks ago

వర్ స్టార్ పవన్ కళ్యాణ్, యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ సుజీత్ కాంబినేషన్‌లో వచ్చిన గ్యాంగ్‌స్టర్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'ఓజీ' బాక్సాఫీస్ వద్ద ఎంతటి ప్రభంజనం సృష్టించిందో తెలిసిందే.

'ఓజస్ గంభీరా'గా పవన్ చూపించిన స్టైలిష్ యాక్టింగ్, ముంబై మాఫియా నేపథ్యం, తమన్ సమకూర్చిన అదిరిపోయే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇతర చిత్రాల నుంచి గట్టి పోటీ ఎదురైనప్పటికీ బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం తన దూకుడును కొనసాగించింది. కేవలం 11 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 308 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టి పవన్ కెరీర్లోనే రూ.300 కోట్ల క్లబ్‌లో చేరిన తొలి చిత్రంగా రికార్డులు క్రియేట్ చేసింది.

ఫస్ట్ పార్ట్ అపూర్వ విజయం 'ఓజీ 2' పై భారీ హైప్‌ను క్రియేట్ చేసింది. అధికారికంగా సీక్వెల్ ప్రకటన రావడంతో అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. దర్శకుడు సుజీత్ ఇప్పటికే రెండో భాగానికి సంబంధించిన పూర్తి స్థాయి స్క్రిప్ట్‌ను సిద్ధం చేసినట్లు సమాచారం. అయితే ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లడానికి ఊహించిన దానికంటే ఎక్కువ సమయం పట్టేలా ఉంది. సుజీత్ ముందుగా నానితో ప్లాన్ చేసిన 'బ్లడీ రోమియో' చిత్రాన్ని పూర్తి చేయాల్సి ఉండటం, పవన్ కళ్యాణ్ కూడా వరుస చిత్రాల కంటే నాణ్యతకే ప్రాధాన్యత ఇస్తూ ఇతర ప్రాజెక్ట్‌లను పక్కన పెట్టడం దీనికి ప్రధాన కారణాలుగా తెలుస్తోంది. పైగా ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి కూడా అనుకూలంగా లేదు.


బర్త్‌డే అప్‌డేట్‌పై సందిగ్ధత

సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా 'ఓజీ 2' నుంచి ఏదైనా అదిరిపోయే అప్‌డేట్ వస్తుందని ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూస్తున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సైతం బర్త్‌డే స్పెషల్ ఉంటుందని సంకేతాలు ఇచ్చినప్పటికీ, తాజా సమాచారం ప్రకారం పెద్దగా కంటెంట్ ఏమీ ఉండే అవకాశం లేదని తెలుస్తోంది. ప్రస్తుతం సినిమా నిర్మాణ పనులు ప్రారంభం కాకపోవడంతో కేవలం ఒక పోస్టర్ లేదా చిన్నపాటి కాన్సెప్ట్ గ్లింప్స్‌తోనే సరిపెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో సోషల్ మీడియాలో బిగ్ సర్‌ప్రైజ్ ఆశిస్తున్న అభిమానులకు ఇది కాస్త నిరాశ కలిగించే వార్తే.

సినిమా ఆలస్యం కావడానికి పవన్ కళ్యాణ్ రాజకీయ బాధ్యతలతో పాటు ఆయన ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి కూడా ప్రధాన కారణం. గతంలో ముంబైలో జరిగిన కుడి భుజం శస్త్రచికిత్స అనంతరం, విశ్రాంతి లేకుండా వరుసగా అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడంతో ఆయనకు సమస్య తీవ్రమైంది. వాపు, జ్వరం రావడంతో వైద్యుల సూచన మేరకు ఆయన కేరళలోని త్రిస్సూర్ సమీపంలో గల ప్రసిద్ధ ఆయుర్వేద కేంద్రంలో ప్రత్యేక ప్రకృతి వైద్యం తీసుకుంటున్నారు. దాదాపు రెండు నుంచి మూడు వారాల పాటు అక్కడే ఉండి చికిత్స పూర్తి చేసుకున్న తర్వాతే ఆయన పూర్తిస్థాయిలో ప్రజా కార్యకలాపాల్లోకి రానున్నారు. ఈ పరిస్థితులన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే, పవన్ పూర్తిగా కోలుకుని రాజకీయ బాధ్యతలను సమన్వయం చేసుకుంటూ 'ఓజీ 2' సెట్స్ పైకి రావడానికి ఇంకా చాలా సమయం పడుతుంది. షూటింగ్ ఆలస్యమై సినిమా ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వచ్చినా వెండితెరపై 'ఓజస్ గంభీరా' సృష్టించే విధ్వంసం మాత్రం పక్కా అని సినీ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Samayam