Dailyhunt
Ola eBike: రూ.79,999కే ఎలక్ట్రిక్ బైక్.. ఓలా ముహూరత్ హవర్స్ సేల్.. పెట్రోల్ బంద్ లైఫ్ ఆన్ ఆఫర్!

Ola eBike: రూ.79,999కే ఎలక్ట్రిక్ బైక్.. ఓలా ముహూరత్ హవర్స్ సేల్.. పెట్రోల్ బంద్ లైఫ్ ఆన్ ఆఫర్!

Telugu Samayam 1 week ago

Ola eBike: పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వేళ భారత్‌లో ఇంధన కొరత ఏర్పడింది. పెట్రోల్ బంకుల వద్ద భారీ క్యూలైన్లు, నో స్టాక్ బోర్డులు కనిపించాయి. ఈ క్రమంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ ప్రాముఖ్యత ప్రజలకు తెలిసొచ్చింది.

చాలా మంది ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా బైక్ కొనుగోలు చేస్తే మంచిదని భావిస్తున్నారు. అయితే, మార్కెట్లో ఉన్న ఎలక్ట్రిక్ బైకుల ధరలు భారీగానే ఉన్నాయి. దీంతో వెనకడుగు వేయాల్సి వస్తుంది. అయితే దేశంలోనిదిగ్గజ ఎలక్ట్రిక్ టూ-వీలర్ల తయారీ కంపెనీ ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటి మరోసారి సరికొత్త ఆఫర్ తీసుకొచ్చింది. ఎండ్‌సియేజ్ (EndICEAge) పేరుతో పెట్రోల్ బంద్ ముహూరత్ సేల్ తీసుకొచ్చింది. తక్కువ ధరకే ఎలక్ట్రిక్ బైక్ అందిస్తోంది. మరి ఆ వివరాలు తెలుసుకుందాం.

సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ఈ కొత్త సేల్ గురించి ఓలా కంపెనీ ఓ పోస్ట్ చేసింది. 'పెట్రోల్ బంద్ లైఫ్ ఆన్. ఎలక్ట్రిక్ వెహికల్‌కి మారి పెద్ద మొత్తంలో ఆదా చేసుకునేందుకు మీకు ఇదే సరైన సమయం. 4.5 కిలోవాట్ హవర్ బ్యాటరీతో వస్తున్న రోడ్‌స్టర్ ఎక్స్ ఎలక్ట్రిక్ బైక్ కేవలే రూ.79,999లకే లభిస్తోంది. అయితే ఈ ఆఫర్ కేవలం ముహూరత్ సమయాల్లోనే అందుబాటులో ఉంటుంది. ఇప్పుడు అన్ని ఓలా స్టోర్లలో, ఆన్‌లైన్‌లోనూ ఈ ఆఫర్ అందుబాటులో ఉంది.' అని తెలిపింది.

ఈ ప్రత్యేక ఆఫర్‌లో భాగంగా పెట్రోల్ బంద్ ముహూరత్ సమయాన్ని ఓలా వెల్లడిస్తుంది. ఏప్రిల్ 1, 2026 రోజున ముహూరత్ సమయం సాయంత్రం 04.59 గంటల నుంచి 06.31 పీఎం వరకు ఉంటుందని, ఆ సమయంలో బుకింగ్ చేసుకున్న వారికి ఓలా రోడ్‌స్టర్ ఎక్స్ 4.5కేడబ్ల్యూహెచ్ బైక్ కేవలం రూ.79,999లకే పొందవచ్చని తెలిపింది. #EndICEAge పేరుతో ప్రత్యేక డిస్కౌంట్ ఆఫర్లను ఓలా కంపెనీ ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు పెట్రోల్ బంద్ ముహూరత్ పేరుతో ఎలక్ట్రిక్ బైక్‌పై ఆఫర్ అందిస్తోంది. చాలా తక్కువ ధరకే ఈ-బైక్ సొంతం చేసుకోవచ్చని తెలిపింది.

మార్చిలో పెరిగిన సేల్స్

గత కొద్ది కాలంలో సేల్స్‌ భారీగా తగ్గిపోయి మార్కెట్ వాటాను కోల్పోతూ వస్తున్న ఓలా ఎలక్ట్రిక్ కంపెనీనిమార్చి నెలలో పుంజుకుంది. ఫిబ్రవరి నెల సేల్స్ తో పోలిస్తే మార్చిలో ఏకంగా 150 శాతం వృద్ధిని కనబరిచినట్లు ప్రకటించింది. ఒక దశలో రోజుకు 1000 యూనిట్లు విక్రయించినట్లు గుర్తు చేసింది. అంతే కాదు 10 లక్షల యూనిట్ల విక్రయ మైలురాయిన చేరిన తొలి ఈవీ కంపెనీగా ఓలా అవతరించినట్లు తెలిపింది.
Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Samayam