Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఓటీటీలోకి అయ్యగారి ఆగమనం... స్ట్రీమింగ్‌కి సిద్ధమైన రూ. 100 కోట్ల బ్లాక్‌బస్టర్ 'లెనిన్'

ఓటీటీలోకి అయ్యగారి ఆగమనం... స్ట్రీమింగ్‌కి సిద్ధమైన రూ. 100 కోట్ల బ్లాక్‌బస్టర్ 'లెనిన్'

Telugu Samayam 2 weeks ago

టాలీవుడ్ యంగ్ హీరో అఖిల్ అక్కినేని ఇటీవల 'లెనిన్‌'తో కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ అందుకున్న సంగతి తెలిసిందే. జూలై 10న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం, తొలి షో నుంచే బ్లాక్‌బస్టర్ టాక్‌ను సొంతం చేసుకుని బాక్సాఫీస్ వద్ద రికార్డుల వర్షం కురిపిస్తూ రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిపోయింది.

'వినరో భాగ్యము విష్ణుకథ' చిత్ర దర్శకుడు మురళి కిషోర్ అబ్బూరు ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. ఈ సినిమాలో అఖిల్ అక్కినేని మునుపెన్నడూ చూడని ఊరమాస్ అవతారంలో కనిపించి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారు.

* పెళ్లి పీటలెక్కబోతోన్న పూజా హెగ్దే.. అరేంజ్డ్ మ్యారేజ్‌కి బుట్టబొమ్మ గ్రీన్‌సిగ్నల్?

ఆయన మేకోవర్, పవర్‌ఫుల్ డెలివరీ, ఊపిరి బిగబట్టే యాక్షన్ సీక్వెన్స్‌లు, గుండెల్ని పిండేసే ఎమోషనల్ సీన్లు థియేటర్లలో ప్రేక్షకులతో ఈలలు వేయించాయి. అఖిల్ నటనకు ప్రేక్షకులు ఫిదా అవ్వడంతో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 100 కోట్ల గ్రాస్ వసూళ్ల మైలురాయిని అధిగమించింది. భాగ్యశ్రీ అందాలు, తమన్ మ్యూజిక్, బీజీఎం, మురళీ కిషోర్ టేకింగ్, కథలో వచ్చి ట్విస్టులు ఈ చిత్రాన్ని మరోస్థాయిలో నిలబెట్టాయి. అఖిల్ కెరీర్‌లోనే తొలి రూ. 100 కోట్ల రికార్డుగా నిలిచిన ఈ సినిమా ఆయన్ని మాస్ హీరోగా సరికొత్త శిఖరాలకు తీసుకెళ్లింది.


తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అగ్రగామి నిర్మాణ సంస్థలైన సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో ఈ చిత్రాన్ని నిర్మించాయి. నిర్మాతలు సూర్యదేవర నాగవంశీ, అక్కినేని నాగార్జున అనుసరించిన పక్కా పబ్లిసిటీ వ్యూహాలు, ప్రమోషన్స్ ఈ సినిమాను బాక్సాఫీస్ రేసులో ముందుంచడంలో కీలక పాత్ర పోషించాయి. కంటెంట్‌తో పాటు మేకింగ్ రిచ్‌నెస్ కూడా సినిమా స్థాయిని పెంచేసింది.

* 'కొరియన్ కనకరాజు' ట్రైలర్ టాక్: డ్యూయల్ రోల్‌లో వరుణ్ తేజ్ రచ్చ.. థియేటర్లో నవ్వుల జాతరే

ఓటీటీలోకి రాక
థియేటర్లలో విజయవంతమైన రన్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఇప్పుడు బుల్లితెర వీక్షకులను అలరించేందుకు ఓటీటీ బాట పట్టింది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకున్న ప్రముఖ ఓటీటీ సంస్థ 'జీ5' అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఆగస్టు 7వ తేదీ నుండి 'లెనిన్' చిత్రం ఎక్స్‌క్లూజివ్‌గా తెలుగులో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు తెలిపింది. "అయ్యగారు ఆగస్టు 7న వస్తున్నారు... మీరు రెడీనా?" అంటూ చేసిన ట్వీట్ సోషల్‌మీడియాలో ట్రెండ్ అవుతోంది. థియేటర్లలో కలెక్షన్ల సునామీ సృష్టించిన ఈ అయ్యగారి మాస్ జాతర, డిజిటల్ స్క్రీన్‌పై ఎలాంటి వ్యూయర్‌షిప్ రికార్డులను తిరగరాస్తుందో చూడాలి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Samayam