చిత్రసీమలో విభిన్న కంటెంట్‌తో రూపొందే సినిమాలకు ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుంది. ముఖ్యంగా హారర్, మిస్టరీ, యాక్షన్ శైలులను కలిపి తీసే చిత్రాలను ఇష్టపడే ప్రేక్షకులు భారీ సంఖ్యలోనే ఉంటారు.
అలా థియేటర్లలో సంచలనం సృష్టించి, సినీ ప్రియుల ప్రశంసలు అందుకున్న తాజా చిత్రం 'పోలీస్ కంప్లైంట్'. బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని నమోదు చేసుకున్న ఈ మూవీ ఇప్పుడు ఓటీటీ ప్రియులను అలరించేందుకు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పైకి అడుగుపెట్టింది.
* 18 ఏళ్లకే సినీ ఆఫర్.. అమ్మానాన్నల ధైర్యమే నన్ను ఇక్కడిదాకా తెచ్చింది: ప్రీతి ముకుందన్
ఈ ఏడాది జూన్ నెలలో తెలుగుతో పాటు కన్నడ భాషల్లో దాదాపు 300కు పైగా థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా, మొదటి రోజు నుంచే మంచి పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకుంది. సరికొత్త ప్లాట్‌తో తెరకెక్కిన ఈ హారర్ యాక్షన్ థ్రిల్లర్, బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించడమే కాకుండా ప్రముఖ రివ్యూ సైట్లలోనూ, ఐఎండీబీ వేదికగానూ అద్భుతమైన రేటింగ్‌లను సాధించింది. థియేటర్లలో అద్భుతమైన రెస్పాన్స్ పొందిన చిత్రం నేటి నుంచి (జూలై 31) నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన 'అమెజాన్ ప్రైమ్ వీడియో' వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది.
* 'లెనిన్' జోష్‌లోనే అఖిల్ షాకింగ్ డెసిషన్.. 'గీత గోవిందం' ఫేమ్ పరశురామ్‌తో నెక్స్ట్ మూవీ?
ఈ సినిమాలో కథానాయికగా వరలక్ష్మి శరత్‌కుమార్ నటన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇప్పటివరకు తీవ్రమైన, సీరియస్ పాత్రల్లో అలరించిన ఆమె, తన సినీ ప్రయాణంలోనే మొదటిసారిగా ఈ చిత్రంలో వినోదాత్మక కోణాన్ని ఆవిష్కరించి వీక్షకులను ఆకట్టుకున్నారు. కథకు ఎంతో కీలకమైన మరో ముఖ్య పాత్రలో నటుడు నవీన్ చంద్ర తనదైన శైలిలో అద్భుతమైన అభినయంతో ఆకట్టుకోగా, కృష్ణసాయి, రాగిణి ద్వివేది తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. ఎంఎస్‌కే ప్రమిద శ్రీ ఫిలిమ్స్ పతాకంపై బాలకృష్ణ మహారాణా ఈ చిత్రాన్ని నిర్మించగా, సంజీవ్ మేగోటి తన దర్శకత్వ ప్రతిభతో ఆకట్టుకున్నారు.
మానవ జీవితంలో ఎదురయ్యే "కర్మ ఫలం" లేదా "చైన్ రియాక్షన్ ఆఫ్ కర్మ" అనే ఆసక్తికరమైన భావన ఆధారంగా ఈ కథను దెయ్యాలు, మూఢనమ్మకాలు, ఉత్కంఠ రేపే అంశాలతో దర్శకుడు మలిచిన తీరు విమర్శకుల మెప్పు పొందింది. ప్రతీ సన్నివేశంలోనూ సస్పెన్స్, యాక్షన్ సమ్మేళనం ప్రేక్షకులకు గూస్‌బంప్స్ తెప్పించేలా ఉంటుంది. వీటితో పాటు, సూపర్ స్టార్ కృష్ణ గారికి నివాళిగా నటుడు కృష్ణసాయిపై చిత్రీకరించిన ప్రత్యేక గీతం అభిమానులను విశేషంగా అలరించింది. సాధారణంగా థియేటర్లలో విశేష ఆదరణ పొందే హారర్ మిస్టరీ చిత్రాలు ఓటీటీలోకి వచ్చాక మరింత మంది డిజిటల్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. అదే బాటలో ఇప్పుడు 'పోలీస్ కంప్లైంట్' కూడా అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు, కన్నడ భాషల్లో అందుబాటులోకి రావడంతో ఇంట్లోనే ఉండి ఈ సస్పెన్స్ థ్రిల్లర్‌ను ఆస్వాదించడానికి వినోద ప్రియులు ఆసక్తి చూపుతున్నారు. థియేటర్ అనుభూతిని మిస్ అయిన వారికి ఇది ఖచ్చితంగా ఒక మంచి డిజిటల్ అనుభవంగా నిలవనుంది.

