Pakistan Senator Mocks UAE Debt: పాకిస్థాన్ రాజకీయ నాయకుల నోటి దురుసే వారి దేశ దౌత్య సంబంధాలను నాశనం చేస్తున్నాయనే నిజానికి నిదర్శనంగా ఓ ఘటన చోటు చేసుకుంది.
ముఖ్యంగా గత ఏడేళ్లుగా పాకిస్థాన్‌ను ఆర్థికంగా ఆదుకుంటూ వస్తున్న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)పై పాక్ సెనేటర్ ముషాహిద్ హుస్సేన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమకు రావాల్సిన 3 బిలియన్ డాలర్ల (భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ. 27 వేల కోట్లు) అప్పును తిరిగి చెల్లించాలని యూఏఈ కోరడంపై ఆయన అత్యంత వ్యంగ్యంగా స్పందించారు. పాపం.. వాళ్లే అప్పుల్లో ఉన్నారనంటూనే విమర్శలు చేశారు. ఆపూర్తి వివరాలు మీకోసం.
"బేచారా.. మజ్బూర్" అంటూ యూఏఈపై ఎద్దేవా
భారత్‌తో స్నేహంపై హెచ్చరిక
పాక్ సెనేటర్ ఇలా మాట్లుడుతున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో ఆదేశ ఆర్థిక పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. గత ఏడేళ్లుగా యూఏఈ తన అప్పును వాయిదా వేస్తూ వస్తోంది. అయితే ఈసారి మాత్రం అప్పు తీర్చాల్సిందే అని యూఏఈ ఖరాకండిగా చెప్పడంతో పాకిస్థాన్‌కు చుక్కలు కనిపిస్తున్నాయి. చెల్లించాల్సిన 3 బిలియన్ డాలర్లు పాకిస్థాన్ వద్ద ఉన్న మొత్తం విదేశీ మారక నిల్వలలో (16.4 బిలియన్ డాలర్లు) దాదాపు 18 శాతం కావడం గమనార్హం. పెరుగుతున్న చమురు ధరల వల్ల పాక్ ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే కుదేలైంది. ఇప్పుడు యూఏఈకి అప్పు కట్టాల్సి రావడం మరింత కష్టంగా మారినప్పటికీ.. పాక్ మాత్రం ఈరకమైన వ్యాఖ్యలు చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

