Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పంటి నొప్పి తగ్గేందుకు అమ్మమ్మలు, నానమ్మలు చెప్పిన ఇంటి చిట్కాలు

పంటి నొప్పి తగ్గేందుకు అమ్మమ్మలు, నానమ్మలు చెప్పిన ఇంటి చిట్కాలు

Telugu Samayam 2 weeks ago

న బాడీలో చిన్నగా ఉండే పన్ను వల్ల కలిగే నొప్పి ప్రపంచంలోనే అతిపెద్ద నరకాన్ని చూపిస్తుంది. ఆ సమయంలో ఎంతటి బలవంతుడైనా, ధైర్యవంతుడైనా పంటి నొప్పి బాధను భరించలేక విలవిలలాడిపోవాల్సిందే.

అయితే ఈ నొప్పి తగ్గడానికి ట్యాబ్లెట్లు వేసుకునే ముందు మన పూర్వీకులు మనకు అందించిన సహజ పద్ధతులను ఒకసారి గుర్తు చేసుకోండి. ఎలాంటి పెయిన్‌ కిల్లర్స్‌ లేకుండా వంటింట్లో ఉండే పదార్థాలతోనే పంటి నొప్పిని తగ్గించుకునే వారు. అదెలాగో ఇప్పుడు చూద్దాం..


ఒక్కసారి పంటినొప్పి మొదలైతే ఆ నరకం ఎలా ఉంటుందో అనుభవించే వారికే తెలుస్తుంది. ప్రాణం పోతున్నంత పనవుతుందంటే అతిశయోక్తి కాదు. ఏమీ తిననివ్వదు, కంటిమీద కునుకు ఉండదు. ఒకవేళ పంటి నొప్పి రాత్రిపూట వస్తే ఆ సమయంలో డాక్టర్‌ దగ్గరకి వెళ్లడం కుదరదు. అలాంటి సమయంలో మన అమ్మమ్మలు, నానమ్మలు చెప్పిన ఇంటి చిట్కాలే కొండంత అండగా నిలుస్తాయి.

మన వంటింట్లో, ఇంటి ఆవరణలో లభించే చిన్న చిన్న పదార్థాలతోనే పంటి నొప్పి నుంచి ఉపశమనం పొందొచ్చని Mayo Clinic అధ్యయనం పేర్కొంది. ఈ నేపథ్యంలో ఎలాంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ లేకుండా పంటి నొప్పిని తగ్గించే ఇంటి చిట్కాల గురించి వివరంగా తెలుసుకుందాం..లవంగం

పంటి నొప్పికి లవంగం రామబాణంలా పనిచేస్తుందని చెబుతారు పెద్దలు. లవంగాల్లో ఉండే యూజినాల్‌ అనే సహజ ఆనస్థెటిక్‌ నొప్పిని మొద్దుబారేలా చేస్తుంది. పంటినొప్పి ఉన్న పంటి కింద లవంగాన్ని ఉంచి నమలాలి. లేదా ఒక దూదిపై రెండు చుక్కల లవంగం ఆయిల్‌ వేసి నొప్పి ఉన్న పంటిపై ఉండాలి. ఇలా చేయడం వల్ల పంటినొప్పి నుంచి ఉపశమనం పొందొచ్చు. ఇదే విషయాన్ని EJPMR అధ్యయనం సైతం పేర్కొంది.


ఉప్పు నీటితో పుక్కిలించాలి

ఇది సహజసిద్ధమైన క్రిమినాశని. పళ్ల సందుల్లో ఇరుక్కున్న ఆహార పదార్థాలు, బ్యాక్టీరిను తొలగించి వాపును తగ్గిస్తుంది. దీనిని ఎలా ఉపయోగించాలంటే.. ఒక గ్లాస్‌ గోరువెచ్చని నీటిలో అర స్పూన్‌ ఉప్పు కలిపి ఆ నీటిని నోట్లో పోసుకుని ఒక నిమిషం పాటు బాగా పుక్కిలించి ఊసేయాలి. ఇలా రోజుకు రెండు సార్లు చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.


వెల్లుల్లి

వెల్లుల్లిలో అల్లిసిన్‌ అనే శక్తివంతమైన యాంటీ బ్యాక్టీరియల్‌ సమ్మేళనం ఉంటుంది. ఇది పంటి నొప్పిని కలిగించే బ్యాక్టీరియాను చంపడమే కాకుండా నొప్పిని కూడా తగ్గిస్తుంది. దీనిని ఎలా వాడాలంటే ఒక వెల్లుల్లి పాయను తీసుకుని బాగా దంచి దానికి కొద్దిగా ఉప్పు కలిపి పేస్ట్‌లా చేయాలి. ఈ పేస్ట్‌ను నొప్పి ఉన్న పంటిపై రాయాలి. లేదా వెల్లుల్లి పాయను నెమ్మదిగా నమలవచ్చు.


ఐస్‌ ప్యాక్‌ లేదా కోల్డ్‌ కంప్రెస్‌

పంటి నొప్పి వల్ల దవడ వాచిపోయినా లేదా బాగా నొప్పి ఉన్నా ఐస్‌ ప్యాక్‌ బాగా పనిచేస్తుంది. చల్లదనం రక్తనాళాలను సంకోచింపజేసి నొప్పి తగ్గిస్తుంది. దీనిని ఎలా వాడాలంటే ఒక బట్టలో కొన్ని ఐస్‌ ముక్కలు ఉంచి దానిని నొప్పి ఉన్న దవడపై సుమారు 15 నిమిషాల పాటు ఉంచాలి. రోజులో అప్పుడప్పుడు ఇలా చేయడం వల్ల కొంత ఉపశమనం లభిస్తుంది.


జామ ఆకులు

పంటి నొప్పిని, చిగుళ్ల సమస్యలను తగ్గించడానికి మరొక శక్తివంతమైన సహజ ఔషధం జామ ఆకులు. మనకు చాలా సులభంగా దొరికే జామ ఆకుల్లో అనేక ఆయుర్వేద గుణాలు ఉన్నాయి. జామ ఆకుల్లో వాపును తగ్గించే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, బ్యాక్టీరియాను చంపే యాంటీ మైక్రోబియల్‌, నొప్పిని తగ్గించే అనాల్జెసిక్‌ గుణాలు పుష్కలంగా ఉంటాయి.

వీటిని ఎలా వాడాలంటే రెండు లేదా మూడు లేత జామ ఆకులను తీసుకుని వాటిని నీటితో శుభ్రంగా కడగాలి. వాటిని నోట్లో వేసుకుని బాగా నమలడం వల్ల ఆ రసం పంటికి, చిగుళ్లకు తగిలి నొప్పి, వాపు తగ్గుతాయి. ఒకవేళ జామ ఆకులు నమలడం కష్టంగా అనిపిస్తే 5 లేత జామ ఆకులను తీసుకుని ఒక గ్లాస్‌ నీటిలో వేసి బాగా మరిగించాలి.

ఆ నీళ్లు కొద్దిగా రంగు మారిన తర్వాత ఆ నీటిని వడకట్టి గోరువెచ్చగా అయిన తర్వాత అందుకో కొద్దిగా ఉప్పు కలిపి నోట్లో పోసుకుని బాగా పుక్కిలించి ఊసేయాలి. ఇలా చేయడం వల్ల కూడా పంటి నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. అయితే ఇవన్నీ చేసినా కూడా పంటి నొప్పి ఉంటే వెంటనే డాక్టర్‌ని సంప్రదించండి.

ముఖ్యగమనిక : ఈ కథనంలోని సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. కొందరు నిపుణులు, కొన్ని అధ్యయనాలు పేర్కొన్న అంశాల ఆధారంగా తెలియజేశాము. వీటిని పాటించే ముందు నిపుణుల సలహా తీసుకోండి. అలాగే వీటిని పాటించడం, పాటించకపోవడం పూర్తిగా మీ వ్యక్తిగత విషయం. సమయం తెలుగు వీటిని ధృవీకరించడం లేదు.


Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Samayam