Dailyhunt
పశ్చిమ బెంగాల్ వరకు పాకిన కాషాయం.. మోదీమే భారత్ అంటూ సరికొత్త ఇండియా మ్యాప్‌ విడుదల చేసిన బీజేపీ

పశ్చిమ బెంగాల్ వరకు పాకిన కాషాయం.. మోదీమే భారత్ అంటూ సరికొత్త ఇండియా మ్యాప్‌ విడుదల చేసిన బీజేపీ

Telugu Samayam 1 week ago

BJP Saffron Map India Viral: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ముఖ్యంగా ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ..

బీజేపీ బెంగాల్ గడ్డపై అఖండ విజయాన్ని దక్కించుకునే దిశగా దూసుకుపోతోంది. ఈక్రమంలోనే ఈ చారిత్రాత్మక సందర్భాన్ని పురస్కరించుకుని భారతీయ జనతా పార్టీ తన అధికారిక ఎక్స్‌ ఖాతాలో వేదికగా సరికొత్త ఇండియా మ్యాప్‌ను విడుదల చేసింది. అందులో పశ్చిమ బెంగాల్ కూడా కాషాయమయమైందని చెబుతూ చేసిన పోస్్.. ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. ఆపూర్తి వివరాలు మీకోసం.

కాషాయమయమైన భారత దేశ పటం..!

బెంగాల్‌లో కమలం వికసించడాన్ని కేవలం ఒక రాష్ట్ర గెలుపుగా కాకుండా.. దేశవ్యాప్త విస్తరణకు నిదర్శనంగా బీజేపీ అభివర్ణించింది. ఈ మేరకు బీజేపీ, దాని మిత్రపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలను కాషాయ రంగులో చూపిస్తూ ఒక ప్రత్యేక భారత మ్యాప్‌ను ఆ పార్టీ విడుదల చేసింది. "కాషాయం బెంగాల్‌ను తాకింది.. ఇక భారత్ అంతా మోదీమయం" అంటూ రాసుకొచ్చిన ఈ పోస్ట్.. దేశ రాజకీయాల్లో బీజేపీ తిరుగులేని ఆధిపత్యాన్ని చాటిచెబుతోంది.


వికసిత్ భారత్ దిశగా మరో అడుగు..

ఈ అద్భుత విజయంపై బీజేపీ తన అభిప్రాయాన్ని బలంగా వినిపించింది. "దేశ రాజధాని ఢిల్లీ నుంచి బెంగాల్ వరకు.. ఇది కేవలం పార్టీ విస్తరణ మాత్రమే కాదు. ప్రగతి పథంలో సాగేందుకు భారత ప్రజలు ప్రధాని మోదీ నాయకత్వంపై చూపిన అచంచల విశ్వాసానికి ఇది ప్రతీక. ఉత్తరాది నుంచి ఈశాన్యం వరకు మార్పు గాలి వీస్తోంది. ఇప్పుడు ఆ ప్రయాణంలో పశ్చిమ బెంగాల్ అనే అతిపెద్ద అధ్యాయం చేరింది. మనమంతా కలిసి 2047 నాటికి వికసిత్ భారత్‌ను నిర్మించుకుందాం" అని బీజేపీ ఆ పోస్ట్‌లో పేర్కొంది.

మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీని ఓడించడం అసాధ్యమని భావించిన విశ్లేషకులకు ఈ ఫలితాలు షాక్ ఇచ్చాయి. బీజేపీ పంచుకున్న మ్యాప్ ప్రకారం.. ఉత్తర, పశ్చిమ, మధ్య భారత్‌తో పాటు ఇప్పుడు తూర్పు భారత్‌లో కూడా బీజేపీ తన జెండాను పాతగలిగింది. ముఖ్యంగా బెంగాల్ వంటి పెద్ద రాష్ట్రం కమలం ఖాతాలో పడటంతో.. 2029 సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రతిపక్షాలకు బీజేపీ ఒక బలమైన హెచ్చరిక పంపినట్లయింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Samayam