Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పసిడి ప్రియులకు శుభవార్త.. మళ్లీ దిగొచ్చిన బంగారం ధర.. మే 30న తులం గోల్డ్ రేటు ఎంతంటే?

పసిడి ప్రియులకు శుభవార్త.. మళ్లీ దిగొచ్చిన బంగారం ధర.. మే 30న తులం గోల్డ్ రేటు ఎంతంటే?

Telugu Samayam 1 week ago

Gold Price Fall: భారతీయులకు బంగారం అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ముఖ్యంగా మహిళలు.. బంగారు ఆభరణాల్ని ఎక్కువగా కొని ధరించాలని ఆసక్తి చూపిస్తుంటారు.

పండగలు, పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాల వేళ పసిడికి డిమాండ్ మరింత ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలోనే ఎక్కువగా కొనుగోళ్లు జరుగుతుంటాయని చెప్పొచ్చు. ఆడపిల్లల పెళ్లి సమయంలో ఎంతో కొంత బంగారం అత్తింటికి వారితో పంపించడం ఆనవాయితీగా వస్తోంది. ఇలా ప్రతి ఇంట్లో బంగారం ఎంతో కొంత ఉంటుంది. ఇక బంగారం ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. అంతర్జాతీయ అంశాలు ఇక్కడ ధరలపై కీలక ప్రభావం చూపిస్తుంటాయి. ముఖ్యంగా భౌగోళిక రాజకీయ పరిణామాలు, యూఎస్ ఫెడ్ సహా ఇతర కేంద్ర బ్యాంకుల విధానాలు, వడ్డీ రేట్లపై ప్రకటనలు, యూఎస్ డాలర్, ద్రవ్యోల్బణం అంచనాలు ఇలా ఇవన్నీ బంగారం, వెండి ధరలు మారేందుకు కారణంగా నిలుస్తుంటాయి.

గత కొంత కాలంగా చూస్తే అమెరికా- ఇరాన్ యుద్ధం కారణంగా బంగారం ధరలు భారీగా దిగొచ్చిన సంగతి తెలిసిందే. ఇక్కడ క్రూడాయిల్ ధరలు పెరగడం ప్రధాన కారణం. ఇదే సమయంలో డాలర్ కూడా పుంజుకుందని చెప్పొచ్చు. ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు తగ్గుతున్న నేపథ్యంలో గోల్డ్ రేట్లు వరుసగా పడుతున్నాయి. అమెరికా- ఇరాన్ తాజాగా ఒక తాత్కాలిక శాంతి ఒప్పందానికి వచ్చినట్లు తెలుస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా దీనికి సమ్మతి తెలిపినట్లు సమాచారం.

ఈ క్రమంలోనే కిందటి రోజు భారీగా పెరిగిన బంగారం ధరలు ఇవాళ (మే 30న) మళ్లీ తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం ఉదయం 11 గంటల సమయంలో.. దేశీయంగా హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 550 తగ్గగా 10 గ్రాములకు ప్రస్తుతం రూ. 1,43,950 కి దిగొచ్చింది. ముందటి రోజు రూ. 1450 పెరగ్గా.. దానికి ముందు వరుసగా రూ. 2050, రూ. 550, రూ. 50 చొప్పున తగ్గాయి. మరోవైపు 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర రూ. 600 తగ్గడంతో తులం ఇప్పుడు రూ. 1,57,040 వద్ద ఉంది. ఇది మే 26, 27, 28 తేదీల్లో చూస్తే వరుసగా రూ. 490, రూ. 600, రూ. 2230 మేర తగ్గుముఖం పట్టింది.

బంగారం ధరలు ఇవాళ తగ్గినప్పటికీ మరోవైపు వెండి రేటు స్థిరంగానే ఉంది. హైదరాబాద్ నగరంలో కేజీ సిల్వర్ రేటు ప్రస్తుతం రూ. 2.90 లక్షల వద్ద ఉంది. ఇది ముందటి రోజు రూ. 5 వేలు పెరగ్గా.. దానికి ముందు వరుసగా 2 రోజులు రూ. 5 వేల చొప్పున తగ్గుముఖం పట్టింది. ఇక ఇంటర్నేషనల్ మార్కెట్లో స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 4,538 డాలర్ల వద్ద ఉంది. సిల్వర్ రేటు 75.35 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇక డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ ప్రస్తుతం రూ. 94.64 వద్ద ఉంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Samayam