పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు క్రమంగా తగ్గుతున్న సంగతి తెలిసిందే. మిత్ర దేశాల అభ్యర్థనల నేపథ్యంలో ప్రపంచ ప్రయోజనాల కోసం ఇరాన్‌పై దాడులు నిలిపివేసినట్లు యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.
దీంతో సోమవారం రోజు ముడి చమురు ధరలు భారీ స్థాయిలో పతనం అయ్యాయి. శాశ్వత శాంతి ఒప్పందం కూడా చర్చలు కూడా ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. దీంతో ఒక్కరోజే 5 శాతానికిపైగా పడిపోయాయి. ఇక కిందటి రోజు తగ్గినా ఇవాళ స్థిరంగానే ఉంది. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు భారీగా పడిపోయినప్పటికీ దేశీయంగా మాత్రం బంగారం, వెండి ధరలు మారలేదు. ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా పసిడి, వెండి ధరలు ఫ్లాట్‌గానే కొనసాగుతున్నాయి.
అంతకుముందు కొంత కాలంగా క్రూడాయిల్ ధరలు పెరిగితే బంగారం ధరలు వెంటనే తగ్గడం, అదే క్రూడ్ ధరలు తగ్గితే గోల్డ్, సిల్వర్ రేట్లు పెరగడం చూశాం. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. క్రూడాయిల్ ధరలతో సంబంధం లేకుండా అక్కడ ధరలు పెరిగినా బంగారం ధరలు మాత్రం పెరగకపోవడం గమనార్హం. ప్రస్తుతం దేశీయంగా హైదరాబాద్ మార్కెట్లో, అదే విధంగా అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్, సిల్వర్ రేట్లు ఎలా ఉన్నాయో చూద్దాం.
ఇంటర్నేషనల్ మార్కెట్లో స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు అదే 4050 డాలర్ల స్థాయిలో ఉంది. సిల్వర్ రేటు చూస్తే 58.67 డాలర్ల వద్ద కొనసాగుతోంది. ఇక డాలరుతో రూపాయి విలువ ప్రస్తుతం రూ. 95.40 వద్ద ఉంది. ఇంటర్నేషనల్ మార్కెట్లో ధరలు మారని కారణంగా దేశీయంగానూ స్థిరంగానే ఉన్నాయి.
దేశీయంగా ప్రస్తుతం 22 క్యారెట్ల బంగారు ఆభరణాల ధర హైదరాబాద్ మార్కెట్లో తులానికి రూ. 1,32,200 వద్ద ఉంది. ఆగస్ట్ 1న ఇది రూ. 350 తగ్గింది. ఇక 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర ఆగస్ట్ 4న ఉదయం 7.30 గంటలకు చూస్తే 10 గ్రాములు రూ. 1,44,220 పలుకుతోంది. గోల్డ్ రేట్ల బాటలోనే వెండి ధరలు కూడా మారలేదు. ప్రస్తుతం కేజీ సిల్వర్ రేటు హైదరాబాద్ మార్కెట్లో రూ. 2.35 లక్షల వద్దే ఉంది. అయితే బంగారు ఆభరణాల ధర జువెల్లరీల్ని మారుతుండొచ్చు. స్థానిక పన్ను రేట్లు, షిప్పింగ్ ఛార్జీల్ని బట్టి ధరల్లో హెచ్చుతగ్గులు ఉంటాయి. ఇంకా గోల్డ్ జువెల్లరీ కొనుగోలు చేసే వారు మేకింగ్ ఛార్జీలు, జీఎస్టీ గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. జీఎస్టీ అనేది బిల్లుపై 3 శాతంగా ఉంటుంది. మేకింగ్ ఛార్జీలు షాపుల్ని బట్టి మారుతుంటాయి. దీనిపైనే 5 శాతం జీఎస్టీ వర్తిస్తుంది.

