Stock Market Updates: చాలా మంది స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతుంటారు. ఇక్కడ రిస్క్ ఉంటుందన్న సంగతి తెలిసిందే. అయితే స్టాక్ మార్కెట్లలో స్వల్ప కాలంలో కంటే దీర్ఘకాలంలోనే అధిక రాబడి వస్తుంటుంది.
గత కొన్నేళ్లలో ఎన్నో స్టాక్స్ మల్టీబ్యాగర్ రిటర్న్స్ అందించినవి ఉన్నాయి. ఇప్పుడు ఇలాగే లాంగ్ రన్‌లో ఇన్వెస్టర్లకు అద్భుత స్థాయిలో రిటర్న్స్ అందించిన ఒక స్టాక్ గురించి తెలుసుకుందాం. అదే వన్ పాయింట్ వన్ సొల్యూషన్స్ లిమిటెడ్. ఇది గత కొంత కాలంగా మంచి రాబడి అందించింది. 2021 నుంచి ఇంకా ఎక్కువ రాబడే అందించింది. స్టాక్ మార్కెట్లో కొన్నేళ్లలో బిగ్గెస్ట్ వెల్త్ క్రియేటర్లలో ఒకటిగా ఇది నిలిచింది. 2021 మార్చిలో బుల్ రన్ ప్రారంభించింది. 2024 జులై వరకు ఇది కొనసాగింది. ఈ క్రమంలోనే ఏకంగా 3,946 శాతం రిటర్న్స్ అందించింది.
ఈ సమయంలోనే వన్ పాయింట్ వన్ సొల్యూషన్స్ షేర్ ధర రూ. 77.50 వద్ద ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయిని నమోదు చేసింది. ఇది కేవలం ఇన్వెస్టర్లకు లాభాల్ని అందించడమే కాదు.. మార్కెట్ విలువను కూడా గణనీయంగా పెంచుకుంది. గురువారం స్టాక్ మార్కెట్ క్లోజింగ్‌లో చూస్తే మార్కెట్ విలువ రూ. 1200 కోట్లకు చేరుకుంది.
ఈ స్టాక్ విషయానికి వస్తే 2017లో లిస్టింగ్ కాగా.. అప్పటి నుంచి కాస్త ఒత్తిడికి లోనైంది. ఎక్కువగా నష్టాల్నే మిగిల్చింది. అయితే 2021 నుంచి మాత్రం వెనుదిరిగి చూసుకోలేదు. తర్వాత మార్కెట్లో అనిశ్చితి నెలకొన్నా కూడా స్టాక్ రాణించింది. ఐదేళ్ల కిందట ఈ స్టాక్ ధర రూ. 1.75 గా ఉండగా.. అక్కడి నుంచి రికార్డు స్థాయిలో 2508 శాతం మేర పెరిగి రూ. 45.64 ప్రస్తుత స్థాయికి చేరుకుంది. ఈ క్రమంలో ఐదేళ్ల కిందట రూ. 1 లక్ష ఇన్వెస్ట్ చేసిన వారికి ఇప్పుడు రూ. 26.07 లక్షలు వచ్చాయి.
ప్రధానంగా ఇక్కడ రిటైల్ ఇన్వెస్టర్ల పంట పండింది. డిసెంబర్ త్రైమాసికం నాటికి చూస్తే బీఎస్ఈ డేటా ప్రకారం.. కంపెనీలో వీరి వాటానే 37.8 శాతంగా ఉంది. 60,730 మందికిపైగా ఇన్వెస్టర్లకు ఇందులో 16.42 శాతం వాటా ఉంది. ఈ స్టాక్ 52 వారాల గరిష్ఠ ధర ప్రస్తుతం రూ. 69.99 గా ఉండగా.. కనిష్ఠ ధర రూ. 40.58 గా ఉంది. గత 5 రోజుల్లో ఈ స్టాక్ 4 శాతం పెరగ్గా.. నెలలో మాత్రం 2 శాతం పడిపోయింది. 6 నెలల్లో 5 శాతం పతనమైంది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు చూస్తే 15 శాతం తగ్గింది.
గమనిక: స్టాక్ మార్కెట్ పెట్టుబడులు రిస్క్‌తో కూడుకున్నవి. పైన ఇచ్చింది సమాచారం మాత్రమే.. పెట్టుబడికి సిఫార్సు కాదు. ఇందులో ఇన్వెస్ట్ చేసే ముందు ఆర్థిక నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

