Penny Stocks: భారతీయ స్టాక్ మార్కెట్లో పెన్నీ స్టాక్స్ తరుచూ ఇన్వెస్టర్లకు అపరిమితమైన లాభాలను తెచ్చిపెడుతుంటాయి. ఎకనామిక్ టైమ్స్ తాజాగా ప్రచురించిన రిపోర్ట ప్రకారం గత రెండు నెలల స్వల్ప వ్యవధిలోనే దాదాపు 10 పెన్నీ స్టాక్స్ ఊహించని రీతిలో 119 శాతం వరకు రాబడులను అందించాయి.
అందులో 4 షేర్లు మల్టీబ్యాగర్లుగా మారి ఇన్వెస్టర్ల పెట్టుబడులను రెట్టింపు కంటే ఎక్కువ చేశాయి. గత రెండు నెలల్లో పశ్చిమాసియాలో యుద్ధ ప్రభావం దేశీయ మార్కెట్లపై తీవ్రంగా పడింది. సూచీలు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లోనూ ఈ పెన్నీ స్టాక్స్ రాణించాయి. ఈ స్టాక్స్ సాధించిన ర్యాలీ వివరాలు, పెన్నీ స్టాక్స్‌లో పెట్టుబడి పెట్టేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకుందాం.
గత రెండు నెలల్లో 10 పెన్నీ స్టాక్‌లు 13 శాతం నుంచి 119% వరకు లాభాలను అందించాయి. వీటిలో నాలుగు మల్టీబ్యాగర్లుగా నిలిచాయి. రూ. 1,000 కోట్ల కంటే తక్కువ మార్కెట్ క్యాపిటలైజేషన్ కలిగి ఉండి రూ. 20 కంటే తక్కువ షేర్ ధర, కనీసం 5 లక్షల షేర్ల తాజా ట్రేడింగ్ వాల్యూమ్ ఉన్న మూడు కీలక ప్రమాణాల ఆధారంగా ఈ స్టాక్‌ల జాబితాను ఎకనామిక్ టైమ్స్ రూపొందించింది. బలమైన వృద్ధిని కనబరిచిన, తక్కువ ధర కలిగి ఉండి వేగంగా ట్రేడ్ అవుతున్న మైక్రో-క్యాప్ స్టాక్‌లను హైలైట్ చేసింది. పెన్నీ స్టాక్‌లు వాటి తక్కువ ధర, భారీ రాబడుల సామర్థ్యంతో పెట్టుబడిదారులను ఆకర్షిస్తుంటాయి. కానీ అవి తక్కువ లిక్విడిటీ, అస్థిరత వంటి నష్టభయాలను కూడా కలిగి ఉంటాయి.
- చంద్రిమ మర్కంటైల్స్ (Chandrima Mercantiles) షేరు ధర గత రెండు నెలల కాలంలో 119 శాతం పెరిగింది. లక్ష పెట్టిన వారికి రూ.2.19 లక్షలు అందించింది. ఈ స్టాక్ ధర రూ.13.46 వద్ద ఉంది.
- జీఏసీఎం టెక్నాలజీస్ (GACM Technologies) షేరు గత రెండు నెలల్లో 116 శాతం పెరిగింది. లక్ష పెడితే రూ.2.16 లక్షలు అందించింది. ఈ స్టాక్ ధర కేవలం రూ.1.08 గా ఉంది.
- ఎన్‌హెచ్‌సీ ఫండ్స్ (NHC Foods) షేరు గత రెండు నెలల్లో 103 శాతం లాభాలు అందించింది. ఇన్వెస్టర్ల పెంట్టుబడిని రెండింతలు చేసింది. ఈ స్టాక్ ధర రూ.2.25 వద్ద ఉంది.
- ఏసీఐ ఇన్ఫోకామ్ (ACI Infocom) స్టాక్ గత రెండు నెలల్లో 102 శాతం పెరిగింది. లక్షకు రెండు లక్షలు అందించింది. ఈ స్టాక్ ధర రూ.2.55 వద్ద ఉంది.
- జీవీ ఫిల్మ్స్ (GV Films) స్టాక్ గత రెండు నెలల్లో 34 శాతం పెరిగింది. ఈ స్టాక్ ధర కేవలం 39 పైసలే.
- టవెక్సియా లైఫ్ కేర్ (Tavexia Lifecare) షేరు గత రెండు నెలల్లో 31 శాతం పెరిగింది. ఈ స్టాక్ ధర కేవలం ఒక్క రూపాయి మాత్రమే.
- క్వాడ్రాంట్ టెలివెంచర్స్ (Quadrant Televentures) షేరు గత రెండు నెలల్లో 30 శాతం లాభాలు ఇచ్చింది. ఈ స్టాక్ ధర రూ.0.57 మాత్రమే.
- ఎన్‌బీ ట్రేడ్ అండ్ ఫైనాన్స్ (Enbee Trade And Finance) షేరు ధర గత 2 నెలల కాలంలో 29 శాతం పెరిగింది. ఈ స్టాక్ ధర రూ.0.31 వద్ద ఉంది.
- జెనెక్స్ ల్యాబొరేటరీస్ (Gennex Laboratories) స్టాక్ గత 2 నెలల్లో 20 శాతం పెరిగింది. ఈ స్టాక్ ధర రూ.12.91 వద్ద ఉంది.
- శ్రేష్ఠ ఫిన్‌వెస్ట్ (Srestha Finvest) స్టాక్ గత రెండు నెలల్లో 13 శాతం పెరిగింది. ఈ స్టాక్ ధర రూ.0.27 వద్ద ఉంది.

