Podarillu Serial 2026 July 2nd Episode Preview వీలైనంత త్వరగా విడాకులు తీసుకో అని మహాకి హారిక సలహా ఇస్తుంది. దీంతో చక్రిని విడాకులు ఇవ్వమని, ఇవ్వాల్సిందే అని మహా డిమాండ్ చేస్తుంది.
దీంతో చక్రి కూడా సరేనంటాడు. ఇంకో వైపు కూతురిని గుడ్డిగా నమ్మేస్తాడు శైలు తండ్రి. తన కూతురు బంగారం అని అనుకుంటాడు. కానీ రోడ్డు మీద కేశవతో, శైలు బైక్ మీద వెళ్తుండటం చూసి షాక్ అవుతాడు. చూస్తుంటే శైలు ప్రేమ కథలోనూ కష్టాలు మొదలయ్యేలా ఉన్నాయి.
శైలు మంచి అమ్మాయి. మిస్ చేసుకోకు అని కేశవకు మహా సలహా ఇస్తుంది. కానీ చాలా ఇబ్బంది పెడుతోందండి అని కేశవ అంటాడు. ఏమీ కాదు.. తరువాత సెట్ అవుతుంది అని మహా అంటుంది.లేదంటే నీకే అలవాటు అవుతుంది రా అని చక్రి కామెడీ చేస్తాడు. ఇంతలో కేశవ ఫోన్‌ను తీసుకోవాలని చక్రి చూస్తాడు. ఏం ఛాటింగ్ చేశావో చూస్తాను.. ఇవ్వురా అంటాడు చక్రి. కానీ కేశవ మాత్రం తప్పించుకుని పారిపోతాడు. దీంతో మహా నవ్వేస్తుంది. మాటలు కలపాలని చక్రి చూస్తాడు. ఏంటి.. మాటలు కలిపేద్దామని, నేను క్షమించేస్తానని చూస్తున్నారా.. ఇంతకీ మీరు ఎప్పుడు వెళ్లిపోతోన్నారు? అని మహా అంటుంది. ఇంటి ఓనర్ కూడా ఇలా చేయడు.. వాడైనా నెల రోజుల టైం ఇస్తాడు.. మీరు ఇవ్వరా? అని అంటాడు చక్రి. ఇవ్వను అని మహా అంటే.. రేపు వెళ్లిపోతాలేండి అని చక్రి అంటాడు. ఇంకో వైపు విక్కీ తన అప్ కమింగ్ ప్రాజెక్ట్ గురించి చెబుతాడు. ఓ హెరిటేజ్ ప్రాజెక్ట్ వచ్చిందని, వింటేజ్ హౌస్‌ను మనం పరిశీలించి.. పాత బిల్డింగ్‌లు ఇంకా అలా స్ట్రాంగ్‌గా ఎలా ఉన్నాయో తెలుసుకోవాలని చెబుతాడు. దీంతో బృందావనం గురించి హింట్ ఇస్తుంది మహా. సరే మనమంతా అక్కడకు వెళ్లి ఓ సారి రీసెర్చ్ చేద్దామని, పర్మిషన్స్ తీసుకో అని మహాకి విక్కీ చెబుతాడు.ఈ నాన్న పరువు పోయే పని చేయదు

కాలేజ్ ఉందని ఇంట్లో అబద్దం చెప్పి శైలు బయటకు వెళ్తుంది. ఇక ఇంట్లో పెళ్లి టాపిక్ రావడంతో శైలు కంగారు పడుతుంది. నా కూతురు ఎప్పుడు అంటే అప్పుడే పెళ్లి చేస్తాను అని శైలు నాన్న అంటాడు. చదువుకోవాలి.. తన కాళ్ల మీద తాను నిలబడాలి.. ఉద్యోగం చేయాలి.. అని శైలు నాన్న అంటాడు. అంతలోపు ఎవరో ఒకరిని ప్రేమించాను అని మీ ముందుకు వస్తుంది.. అప్పుడు మీ తిక్క కుదురుతుంది అని వరాలు అంటుంది. నా కూతురు అలా చేయదు.. ఏమ్మా.. అలా చేస్తావా? అని శైలుని వాళ్ల డాడీ అడుగుతాడు. నేను ఎందుకు అలా చేస్తాను నాన్నా.. అని శైలు అంటుంది. చూశావా.. నా కూతురు ఎప్పటికీ ఈ నాన్న పరువు పోయే పని చేయదు అని శైలు ఫాదర్ గర్వంగా ఫీల్ అవుతాడు.
వీడికి నిజాయితీ లేదు కదా

మరో వైపు కేశవ రెడీ అవుతుంటే కన్నా గాడు ఆటపట్టిస్తుంటాడు. అందరూ హ్యాపీగా ఉన్నారా? నేను మాత్రం ఈ ఇంట్లోంచి ఎప్పుడు వెళ్తానా? ఎప్పుడు వెళ్తావ్ అన్నట్టుగా మహాలక్ష్మీ అడుగుతూనే ఉంది.. ఇదంతా వీడు (కన్నా) ఇచ్చిన ఐడియానే అని ఓ మొట్టికాయ వేస్తాడు చక్రి. త్వరగా పంపించేద్దాం.. వాడి వస్తువులన్నీ మనం వాడుకోవచ్చు.. మనం ప్రశాంతంగా పడుకోవచ్చు అని కేశవ, కన్నా కామెడీ చేస్తుంటారు. ఆపండ్రా.. నేను పోయాక వస్తువుల్ని వంతు వేసుకుంటారా? అని చక్రి అంటాడు. నేను నిజంగానే వెళ్లిపోవాలా? అని చక్రి అంటే.. మహా మంచి మనసు నీకు అర్థం కాలేదారా.. అని పెద్ది అంటాడు. ఇప్పటికైనా కుప్పి గంతులు ఆపు అని కేశవ అంటాడు. మనసులో స్థానం సంపాదించుకునేలా చూడు అని పెద్ది అంటే.. వీడికి నిజాయితీ లేదు కదా అని కేశవ కామెడీ చేస్తాడు.
హారికను చూడగానే ప్రేమగా

మహా ఆఫీసులో ఉండగా దివ్యతో కలిసి నవ్వుతూ ఉంటుంది. ఏంటి నేను వచ్చాకే నవ్వడం ఆపేశారు.. నవ్వుతూ ఆనందంగా పని చేస్తే మంచిదే కదా అని విక్కీ అంటాడు. హాస్టల్ ఫుడ్ పడలేదు.. మళ్లీ తన రిలేటివ్స్ ఇంటికి వెళ్లిందట.. అని దివ్య చెబుతుంది. మనకి కావాల్సిన వాళ్ల దగ్గరకు వెళ్లే మంచిదే కదా అని విక్కీ అంటాడు. ఇంతలో మహాకి హారిక ఫోన్ చేస్తుంది. మనం రెగ్యులర్‌గా కలిసే చోటే ఉన్నాను.. అని హారిక చెబుతంది. దీంతో విక్కీని పర్మిషన్ అడిగి బయల్దేరుతుంది మహా. ఇక హారికను చూడగానే ప్రేమగా హత్తుకుంటుంది మహా. సిరి పాప ఎలా ఉందని మహా అడుగుతుంది.
బయటకు మాత్రం చక్రి భార్యగానే

నువ్వు వెళ్లిపోయాక.. నేను కూడా వెళ్లిపోదామని బ్యాగ్ సర్దుకున్నాను.. కానీ మామయ్య గారు మళ్లీ హింస జోలికి వెళ్లమని మాటిచ్చాడు.. ఇంకెంత కాలం నువ్వు ఆ ఇంట్లో ఉంటావ్.. ఈ గ్యాప్‌లో చక్రిని భర్తగా ఊహించుకుంటున్నావా? అని హారిక అడుగుతుంది. ఛీ ఛీ అలాంటిదేమీ లేదు.. ముందు నుంచీ నేను ఒకే స్ట్రాంగ్ ఫీలింగ్‌తో ఉన్నాను అని అంటుంది మహా. మరి ఏ బంధం నిన్ను కట్టి పడేస్తోంది అని హారిక అడుగుతుంది. వారి మంచితనం, అభిమానం కట్టి పడేస్తోంది.. అని మహా అంటుంది. అవన్నీ ఎవ్వరికీ కనిపించవు.. బయటకు మాత్రం చక్రి భార్యగానే కనిపిస్తావ్.. నీ జీవితానికి అదొక మచ్చలా ఉంటుంది అని హారిక అంటుంది.
చక్రి నిన్ను భార్యగా అనుకోవచ్చు

నీ కలల గురించి, గోల్స్ గురించి పట్టించుకోవా? అని హారిక అడుగుతుంది. నేను జాబ్ చేస్తున్నాను అని మహా చెబుతుంది. అవునా.. మంచిది.. వాళ్ల మీద ఆధార పడకుండా ఉంటున్నావ్.. అని హారిక సంతోషిస్తుంది. నన్ను ఆ ఇంటి కోడలిగా కాకుండా.. ఆడపిల్లలా చూస్తున్నారు అని మహా అంటే.. చక్రి కూడా అంత వరకే చూస్తున్నాడని నువ్వు ఎలా చెప్పగలవు అని హారిక ఓ అనుమానాన్ని పుట్టిస్తుంది. నువ్వు చక్రిని భర్తలా ఊహించుకోకపోవచ్చు.. కానీ చక్రి నిన్ను భార్యగా అనుకోవచ్చు కదా అని హారిక అనడంతోనే.. తాగొచ్చి మాట్లాడిన చక్రి మాటల్ని మహా గుర్తు చేసుకుంటుంది.
లీగల్‌గా విడిపోవాలి..

వాళ్లకి నువ్వు కనెక్ట్ అవుతున్నావ్.. అండ, రక్షణ కావాలంటే అక్కడ ఉండొచ్చు.. కావాలంటే నువ్వు వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో ఉండొచ్చు కదా.. నువ్వు ఆ ఇంట్లో ఉండటానికి ఇంకేదైనా కారణం ఉందా? అని హారిక అడుగుతుంది. అలా బయటకు వెళ్లి.. మళ్లీ వచ్చా.. ఆ ఇంట్లో శాపం ఉందని అంతా అంటున్నారు.. వారిని మళ్లీ విమర్శిస్తున్నారు.. అందుకే పెద్దికి పెళ్లి చేసి.. బయటకు రావాలని అనుకుంటున్నాను అని మహా చెబుతుంది. చక్రి మనసులో ఎలాంటి ఉద్దేశం రాకముందే.. విడాకులు ఇవ్వాలి.. లేనిపోని ఆశలు పెంచుకోక ముందే లీగల్‌గా విడిపోవాలి.. అని హారిక సలహా ఇస్తుంది.
ఈ ఓవర్ యాక్షనే తగ్గించుకో..

మహా కోసం రోడ్డు మీద చక్రి వెయిట్ చేస్తుంటాడు. కానీ హారిక మాటలతో మహా ఏదో లోకంలో ఉండిపోయి అలా నడుస్తూ ఉంటుంది. ఇక చక్రి మాట్లాడేందుకు ప్రయత్నిస్తాడు. ముందు మీరు రూం చూసుకున్నారా? ఇంట్లోంచి ఎప్పుడు వెళ్లిపోతోన్నారు.. అని అడుగుతుంది. బ్యాచిలర్ అంటే రూం ఇవ్వడం లేదండి అని చక్రి అంటాడు. ఎందుకు ఇస్తారు.. తాగొచ్చి.. పిచ్చి పిచ్చిగా చేస్తారు కదా.. అందుకే ఇవ్వరు.. అని మహా అంటుంది. మీతో సపరేట్‌గా మాట్లాడాలి.. అని మహా అంటే.. సినిమాకి వెళ్లి అక్కడ మాట్లాడుకుందామా? అని చక్రి అంటాడు. ఈ ఓవర్ యాక్షనే తగ్గించుకో.. పక్కనే కెఫే ఉంది.. రండి అని మహా అంటుంది.
పాత సినిమాకి వెళ్తారా?

కనీసం ఛాటింగ్ కూడా చేయడం రాదా? అని కేశవను తిడుతుంది శైలు. నడవడం, బైక్ రిపేరింగ్ అన్నీ నేర్చుకున్నావ్.. ఇది రాదా.. అని అంటుంది శైలు. అవసరం పడలేదు అని కేశవ అంటే.. నేను అలిగాను అని అంటుంది శైలు. సరే అలుగు అని అంటాడు కేశవ. అలా లైట్ తీసుకుంటున్నావ్ ఏంటి? నన్ను బుజ్జగించు.. బతిమిలాడు అని శైలు అంటుంది. అవన్నీ నాకు రావు అని కేశవ అంటాడు. దీంతో శైలుకి మరింత కోపం వస్తుంది. సరే నన్ను పాత సినిమాకి తీసుకు వెళ్లు అని శైలు అంటుంది. నీకు బుద్ది ఉందా?ఎవరైనా పాత సినిమాకి వెళ్తారా? అని కేశవ నవ్వుతాడు. రేయ్ బండసన్నాసి.. నీకు ఇది కూడా తెలీదా.. ముందు నేను చెప్పినట్టు తీసుకెళ్లి అని శైలు అంటుంది.
అబ్బాయిల వంక కూడా కన్నెత్తి చూడదు..

ఎందుకు రా మీ అమ్మాయికి ఇంత త్వరగా పెళ్లి చేస్తున్నావ్.. నాకేం నచ్చడం లేదు రా ఇలా చేయడం అని అంటాడు శైలు ఫాదర్. నాకు మాత్రం ఇష్టమారా? కానీ.. ఇంకా లేట్ చేస్తే ఎవరినైనా తెచ్చి ఇతడే నీ అల్లుడు అని అంటుందేమో అని భయంగా ఉంది రా అని అవతలి వ్యక్తి అంటాడు. చదువుకోమని కాలేజ్‌కి పంపిస్తే.. ప్రేమ పాఠాలు నేర్చుకుని వస్తున్నార్రా.. నిన్నే మా ఇంటి పక్కన అమ్మాయి లేచిపోయింది.. నాకు అలాంటి పరిస్థితి వస్తుందేమో అని భయపడి పెళ్లి చేస్తున్నాను రా అని అంటాడు. నా కూతురు మాత్రం అలా చేయదు.. నా కూతరు బంగారం.. అబ్బాయిల వంక కూడా కన్నెత్తి చూడదు.. అనడంతో.. బైక్ మీద కేశవని గట్టిగా హత్తుకుని వెళ్తున్న శైలు కనిపిస్తుంది.
పేరెంట్స్‌కి చెప్తే ఎలా ఉంటుందిరా..

చూశారా.. వాళ్లు ఎలా పట్టుకుని వెళ్తున్నారో.. ఇలా మీ అమ్మాయి తిరుగుతోందని ఎవరైనా తెలిసిన వాళ్లు పేరెంట్స్‌కి చెప్తే ఎలా ఉంటుందిరా.. ఆ తల్లిదండ్రులు ఎంతగా ఫీల్ అవుతారు.. ఎంత షేమ్‌గా అనుకుంటారు.. తల్లిదండ్రుల గురించి పిల్లలు అస్సలు ఆలోచించరా? అని అనడంతో.. నాకు కొంచెం పని ఉందిరా.. మళ్లీ వస్తాను అని శైలు ఫాదర్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇంకో వైపు కాఫీ షాపులో చక్రి, మహా కూర్చుంటారు. పిలిచి ఏం మాట్లాడటం లేదేంటి అని చక్రి.. పిలిచాను కానీ.. ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు అని మహా ఇలా ఇద్దరూ తమలో తాము మాట్లాడుకుంటూ ఉంటారు.

