Podarillu Serial 2026 May 27th Episode Preview ప్రతాప్ తన ఇంటికి కూతురు, అల్లుడిని తీసుకు వస్తాడు. అయితే కూతురి మీద మాత్రం ప్రేమను నటిస్తారు.
చక్రిని మాత్రం ప్రతీ క్షణం అవమానిస్తూనే ఉంటారు. మహా ఏమో గాల్లో తేలిపోతూ చక్రి గురించి అంతగా పట్టించుకోదు. ఇక పడుకునే టైంలో చక్రిని తన రూంకే రమ్మని, తన రూంలోనే రమ్మని మహా పిలుస్తుంది. దీంతో చక్రి గాల్లో తేలిపోతాడు. మరి ఇంతలోపు ఆది, ప్రతాప్ ఇద్దరూ ఏ నాటకం ఆడతారో.. ఎలాంటి అడ్డుకట్ట వేస్తారో చూడాలి.
మహాలక్ష్మీ ఇంటికి తిరిగి రావడంతో హారిక సంతోషిస్తుంది. మన ఇంటి మహాలక్ష్మీని మళ్లీ మన ఇంటికి తిరిగి తీసుకు వచ్చినందుకు థాంక్స్ మామయ్య గారు అని హారిక అంటుంది. ఇదంతా మన అల్లుడు గారి వల్లే.. ఆయనే కలిసి ఉండపోతే.. మాట్లాడి ఉండకపోతే.. ఇలా నేను మారిపోయి ఉండేవాడ్ని కాదు.. ఈ నిర్ణయం తీసుకుని ఉండేవాడ్ని కాదు.. అని ప్రతాప్ అంటాడు. ఇక అందరూ కలిసి లోపలకు వెళ్తారు. చక్రిని అలా హాల్లోనే వదిలేస్తారు. ఇక డైనింగ్ టేబుల్ వద్ద చక్రిని ఎంతలా అవమానించాలో అంతా అవమానిస్తారు. కానీ మహాని మాత్రం ప్రేమగా చూసుకుంటారు. మహా ముందు మాత్రం ప్రతాప్, లలిత చాలానే నటిస్తారు. చక్రిని మాత్రం సందు దొరికినప్పుడల్లా విమర్శిస్తూనే ఉంటారు. రకరకాల భోజనాలు పెట్టి మహా మీద ఆకాశమంతా ప్రేమను చూపిస్తారు. మామ పందెం కడితే.. అత్త గోడ కడుతుంది.. అని చక్రి లోలోపల అనుకుంటాడు. ఇక అన్ని కూరలు అక్కడ ఉన్నా.. ఒక్కటీ చక్రి అందకుండా దూరంగా పెడతారు. కానీ చక్రి మాత్రం ఫిష్ ఇవ్వమని గట్టిగా అడుగుతాడు. మహా ఉంది కదా? అని ఏం అనకుండా ఇచ్చేస్తాడు ప్రతాప్.అడిగి మరీ వడ్డించుకున్న చక్రి..

నేను మా అమ్మానాన్నల ప్రేమలో పడి ఉక్కిరి బిక్కిరి అవుతున్నాను.. అందుకే మిమ్మల్ని పట్టించుకోవడం లేదు.. ఏమీ అనుకోకండి.. మీకేం కావాలన్నా తీసుకోండి.. తినండి.. అని మహా అంటుంది. ఇంతలో చక్రి.. చికెన్ ఎక్కడ ఉంది అని అడుగుతాడు. అమ్మా చికెన్ అంట వడ్డించు అని మహా అంటుంది. అలా వాళ్లు ఎన్ని రకాలుగా అవమానించినా అవన్నీ కూడా చక్రి పట్టించుకోడు. ప్రతాప్‌ని చూస్తూ మరీ చక్రి తింటూ ఉంటాడు. మరో వైపు కేశవ తన షాపులో పని చేస్తూ ఉంటాడు. అర్జెంట్ అంటూ ఓ కస్టమర్ వస్తాడు. దీంతో తన అసిస్టెంట్ కోసం కేశవ వెతుకుంటాడు.
రీల్స్‌లో బిజీగా..

ఆ అసిస్టెంట్ గాడు ఏమో రీల్స్ అంటూ శైలుతో బిజీగా ఉంటాడు. దీంతో ఆ రీల్స్ ఆపమని..కేశవ అంటాడు. శైలు ఏమో వద్దు అని అంటుంది. శైలుని కూడా తిట్టి పంపిస్తాడు కేశవ. రేయ్ మూసుకుని రా రా అని కేశవ తన అసిస్టెంట్‌ను పిల్చుకుని వెళ్తాడు. మరో వైపు ఇంట్లో చక్రిని అవమానించేందుకు ఆది రెడీ అవుతాడు. కుక్క ఏదో దూరినట్టు ఉంది నాన్న అని చక్రిని చూసి ఆది అంటాడు. అవును.. ఇప్పుడే పై నుంచి దిగి వస్తోంది.. నేను ఎగిరి తంతే.. మళ్లీ రాదు.. సైలెంట్‌గా ఉన్న కుక్కని నేను కొట్టను అని చక్రి అంటాడు. అల్లుడు గారు అని ప్రతాప్ అంటే.. వాడ్ని అల్లుడు గారు అనడం ఏంటి? అని ఆది ఫైర్ అవుతాడు.
ముగ్గురికీ గొడవ..

ఏంట్రా బామ్మర్ది కొడతావా? రా.. రా.. అని ఆదిని రెచ్చగొడతాడు. ఇక ఆది పైపైకి వెళ్తుంటే ప్రతాప్ అడ్డుకుంటాడు. రేయ్ కావాలని రెచ్చగొడుతున్నాడు రా.. ఆగు అని.. లోపల కోపం ఉన్నా.. బయటకు మాత్రం నవ్వుతూనే మాట్లాడతాడు ప్రతాప్. మాటలు జారితే తర్వాత ఇంతకింతా అనుభవిస్తావ్ అని చక్రికి స్వీట్ వార్నింగ్ ఇస్తాడు. నువ్వు ఊ అను నాన్నా.. వీడ్ని ఇక్కడే చంపేస్తా అని ఆది అంటాడు. సరే బాబు వచ్చి కూర్చో మాట్లాడుకుందాం.. కింద కూర్చోండి అని అని ప్రతాప్ అవమానిస్తాడు. మాతో పాటు సమానంగా కూర్చునే హక్కు ఉందా అని ఆది అడుగుతాడు.
కింద కూర్చోపెట్టిన ప్రతాప్..

చక్రిని కింద కూర్చోపెట్టాలని ఆది ప్రయత్నిస్తాడు. కానీ చక్రి మాత్రం ఆదిని కింద పడేస్తాడు. ఇక ప్రతాప్ వచ్చి చక్రిని నేల మీద కూర్చోబెడతాడు. రేయ్ వీడికి ఎంత కాన్ఫిడెన్స్ అంటే.. మీ వాటాని అడిగానా? అని అన్నాడ్రా.. అది గుర్తొచ్చినప్పుడల్లా భగభగమండిపోతోంది రా అని ఆదితో ప్రతాప్ అంటాడు. నాకు మీ ఆస్తి అవసరం లేదు.. ఇంట్లోంచి వెళ్లేటప్పుడు కూడా ఒక్క రూపాయి తీసుకు రమ్మనలేదు.. అంతా ఆది గాడి బొంద మీద పెట్టుకో అని ప్రతాప్‌కి చక్రి కౌంటర్లు వేస్తాడు. దీంతో ఆదికి కోపం వస్తుంది. చక్రిని కాలుతో కొట్టబోతాడు. ఇంతలో మహా వస్తుంది. అంతా సైలెంట్ అయిపోతారు.
మహా నవ్వులు..

చక్రిని ఎందుకు కింద కూర్చోబెట్టారు అని మహా అడుగుతుంది. ప్రతాప్ ఏదో ఒకటి కవర్ చేసేస్తుంటాడు. స్కూల్, మిమిక్రీ అని డైవర్ట్ చేస్తాడు ప్రతాప్. గాడిద, కుక్క, పంది సౌండ్ అని మిమిక్రీ చేస్తూ ఆదిని చూపిస్తాడు. దీంతో మహా పగలబడి నవ్వేస్తుంది. ఇక చక్రి, మహాలు అక్కడి నుంచి వెళ్లిపోతారు. చక్రి చేసిన అవమానం గురించి, అన్న మాటల గురించి ఆది, ప్రతాప్ మాట్లాడుకుంటారు. ఇక మహా తన రూంని చూసి అన్నింటినీ గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఇంతలో హారిక వచ్చి మహాతో మాట్లాడుతుంది. నా గుర్తుల్ని చెరిపేస్తారని అనుకున్నా.. అన్నీ ఇంకా సజీవంగానే ఉంచారు.. థాంక్స్ వదిన అని మహా అంటుంది.
హారిక, మహా ముచ్చట్లు..

పాతికేళ్లు పెంచారు.. వాళ్ల ప్రాణం నువ్వే కదా.. ఓ డ్రైవర్‌తో వెళ్లిపోతే బాధపడతారు కదా.. వాళ్ల కలల ప్రపంచాన్ని నువ్వు చెరిపేశావ్.. పేగు తెంచితేనే విడిపోని బంధం.. మాటలు అంటే విడిపోతుందా?.. ఆ రోజు మామయ్య గారు ఆవేశంలో అన్న మాటల్ని నువ్వు పట్టించుకున్నావ్.. కానీ ఎంత బాధలో అని ఉంటారో అర్థం చేసుకున్నావా? ఇద్దరూ ఈగోలకు పోయి ఇంత వరకు తీసుకు వచ్చారు అని హారిక అంటుంది. అంటే నాన్న ఈగో ఇప్పుడు తగ్గిందా? అని మహా అడుగుతుంది. నాక్కూడా అదే అర్థం కావడం లేదు.. నిన్నటి వరకు నీ పేరు ఎత్తితేనే ఊరుకునేవారు కాదు.. కానీ ఇప్పుడేమో ఇలా అని హారిక అనుమానిస్తుంది.
మాటిచ్చా..

ఇదంతా చక్రి వల్లే.. నా ఇంటికి నేను రావడం చాలా బాగుంది వదిన.. జీవితాంతం ఇలానే ఉంటే బాగుంటుంది.. అని మహా అంటుంది. అసలు మీకు జరిగింది ఉత్తుత్తి పెళ్లి అని చెబితే.. జీవితాంతం ఇలానే ఉండొచ్చు అని హారిక సలహా ఇస్తుంది. ఆ నిజం చెప్పలేను.. నాకంటూ కొన్ని బాధ్యతలున్నాయి.. జరిగింది మర్చిపోలేను.. నేనంటూ ఓ స్థాయికి వచ్చాకే ఆ నిజం చెబుతా..పెద్దికి పెళ్లి చేసే వరకు.. చక్రి వాళ్ల ఇంట్లోనే ఉంటాను అని మాటిచ్చాను.. చేసిన ఛాలెంజ్, ఇచ్చిన మాటను మర్చిపోలేను అని హారికతో మహాలక్ష్మీ అంటుంది.
కేశవకి ఫోన్..

కేశవకి ఫోన్ చేసి జరిగిందంతా చెబుతాడు చక్రి. అందరూ ఒకిరిని మించి ఇంకొకరు నటిస్తున్నారు.. అల్లుడిగా అడుగు పెట్టినప్పటి నుంచీ ప్రతీదీ సమస్యే రా.. కొత్త జంట అని హారతిచ్చి.. అల్లుడ్ని వదిలేసి వెళ్లిపోయారు.. కూతురు వచ్చిందని పంచభక్ష పరమన్నాలు వండారు.. నాకు మాత్రం ముష్టోడికి పెట్టినట్టు పెట్టారు.. కానీ మహాని మాత్రం బాగా చూసుకున్నారు.. నాకు మాత్రం ఏదో తేడా కొడుతోంది.. ఆయన పెద్ద ప్లాన్ వేసినట్టుగా ఉన్నాడ్రా.. అమ్మాయి ముందు నటిస్తున్నాడు.. ఆమె వెళ్తే అపరిచితుడిలా మారిపోతోన్నాడు.. మామ యముడు, ఆదిగాడు రాక్షసుడు, ఈ ఇల్లు నరకంలా అనిపిస్తోంది రా అని చక్రి చెబుతాడు.
వీడియో కాల్‌లో మహా..

ఇంతలో మహా కూడా వస్తుంది. కేశవతో మహా మాట్లాడుతుంది. ఆ తరువాత అందరితో వీడియో కాల్‌లో మాట్లాడుతుంది. వదిన ఫోన్ చేసిందా? అని కన్నా ఎగిరి గంతులు వేస్తాడు. గంటలు లెక్కిస్తున్నా.. ఇంకా 188 గంటలు ఉన్నాయ్.. అప్పుడే మీరు ఇంటికి వస్తారు అని కన్నా అంటాడు. పెద్ది, కేశవ ఇలా అందరితో మాట్లాడుతుంది మహా. దిగులు పడకండి తొందర్లోనే వస్తాను అని అంటుంది. ఇక నా సుపుత్రుడు ఏడి మహా అడిగితే.. మందు తాగి చిందులు వేస్తున్న నారాయణను కన్నా చూపిస్తాడు. ఏం చేస్తున్నారు అని అంటే.. బాధ పడుతున్నాను అని నారాయణ అంటాడు.
అందరితో కలిసి సరదాగా..

ఏంటి మందేస్తూ, చిందేస్తూ బాధపడుతున్నారా? అని మహా కౌంటర్ వేస్తుంది. ఇలా ఎక్కువ బాధ ఉన్నప్పుడు ఇలా చిందేస్తే సగం బాధపోతుందని నా ఫ్రెండ్ చెప్పాడు అని మహాతో నారాయణ అంటాడు. మిగతా సగం మందేస్తే పోతుందని చెప్పాలే? అని మహా కౌంటర్ వేస్తుంది. అరె కరెక్ట్ గా చెప్పావ్..నీకు ఎలా తెలుసు అని నారాయణ అంటాడు. నువ్వు లేవనే తాగుతున్నా.. నువ్వు త్వరగా రా అమ్మ.. నువ్వు లేకపోతే సందడే లేదు.. అని నారాయణ నవ్వుతూ మహాతో అలా మాట్లాడుతూనే ఉంటాడు. ఇక అందరూ కలిసి వీడియో కాల్‌లో నవ్వుతూ మాట్లాడుకుంటారు. రండి.. నా గదిలోనే పడుకుందాం అని చక్రిని మహా పిలుస్తుంది. దీంతో చక్రి గాల్లో తేలిపోతాడు. 'గుండెనిండా గుడిగంటలు' టుడే ఎపిసోడ్: భర్తల మీద భార్యల ఆగ్రహం.. మూడు జంటల్లోనూ మంటలే.. ఛీ కొట్టిన మీనా, రోహిణి, శ్రుతి

