KVP Interest Rates: జులై- సెప్టెంబర్ త్రైమాసికానికి గానూ పోస్టాఫీస్ పొదుపు పథకం కిసాన్ వికాస్ పత్రా వడ్డీ రేటును కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ప్రకటించింది.
అయితే, ఈసారి వడ్డీ రేటును యథాతథంగా 7.50 శాతం వద్దే కొనసాగిస్తున్నట్లు తెలిపింది. ఈ చిన్న మొత్తాల పొదుపు పథకంలో వడ్డీ అనేది చక్రవడ్డీగా లెక్కిస్తారు. అంటే వడ్డీపైన వడ్డీ జమ అవుతూ వస్తుంది. దీంతో చాలా తక్కువ సమయంలోనే పెద్ద మొత్తంలో కార్పస్ ఏర్పడుతుంది. ఈ వడ్డీ రేటు ప్రకారం ఈ పథకంలో పెట్టే పెట్టుబడి 115 నెలలు అంటే 9 సంవత్సాల 7 నెల్లలోనే రెట్టింపు అవుతుంది. ఈ పథకానికి ఎలాంటి రిస్క్ ఉండదు, కేంద్ర ప్రభుత్వ హామీ సైతం ఉంటుంది. మరి ఈ స్కీమ్ గురించిన వివరాలు తెలుసుకుందాం.
మార్కెట్ ఒడుదొడుకులతో సంబంధం లేకుండా స్థిరమైన, సురక్షితమైన రిటర్న్స్ కోరుకునే వారికి పోస్టాఫీస్ పథకాలు ఎల్లప్పుడూ బెస్ట్ ఛాయిస్. తాజాగా కేంద్ర ప్రభుత్వం జులై- సెప్టెబంబర్ 2026 త్రైమాసికానికి గానూ ప్రముఖ చిన్న మొత్తాల పొదుపు పథకం కిసాన్ వికాస్ పత్ర వడ్డీ రేట్లను ప్రకటించింది. ప్రస్తుతం జులై- సెప్టెంబర్ త్రైమాసికానికి గానూ వడ్డీ రేటున 7.50 శాతంగా నిర్ణయించారు. ఈ వడ్డీ రేటు యాన్యువల్ కాంపౌండింగ్ అవుతుంటుంది. ఇందులో పెట్టో పెట్టుబడి 115 నెలలకు రెట్టింపు అవుతుంది.
కిసాన్ వికాస్ పత్ర పథకంలో కనీస పెట్టుబడి రూ. 1000గా ఉంది. ఆపైన రూ. 100 చొప్పున ఎంతైనా ఇన్వెస్ట్ చేయవచ్చు. గరిష్ఠ పరిమితి అంటూ ఏమీ లేదు. ఇందులో వ్యక్తిగత అకౌంట్ లేదా ముగ్గురి వరకు కలిసి జాయింట్ అకౌంట్ తెరవవచ్చు. మైనర్లు అయితే తల్లిదండ్రులు, సంరక్షకుల ద్వారా అకౌంట్ తెరవాల్సి ఉంటుంది.
కీలక నిబంధనలు
- ఈ స్కీమ్ లాకిన్ పీరియడ్ 2 ఏళ్ల 6 నెలలుగా ఉంటుంది. అంటే ఖాతా తెరిచిన 2.5 ఏళ్ల తర్వాతే ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే ప్రీ-మెచ్యూర్ విత్ డ్రా చేసేందుకు అవకాశం ఉంటుంది.
- ఒక పోస్టాఫీస్ నుంచి దేశంలోని ఏ ఇతర పోస్టాఫీసు శాఖకైనా అకౌంట్ సులభంగా బదిలీ చేసుకోవచ్చు. అలాగే ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి కూడా బదిలీ చేసుకునే అవకాశం ఉంటుంది.
- అయితే, కిసాన్ వికాస్ పత్రలో పెట్టే పెట్టుబడికి పన్ను మినహాయింపు వస్తుందని భానిస్తారు. కానీ, కేవీపీలోని పెట్టుబడికి సెక్షన్ 80సీ కింద ఎలాంటి పన్ను మినహాయింపు ఉండదు. అలాగే మెచ్యూరిటీ సమయంలో వచ్చే వడ్డీ ఆదాయంపై ఆదాయపు పన్ను స్లాబ్ రేటు ప్రకారం ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. అయితే, మెట్యూరిటీ మొత్తాన్ని విత్ డ్రా చేసేటప్పుడు ఎలాంటి టీడీఎస్ కట్ చేయరు.

