ఐపీఎల్ 2026లో లక్నో సూపర్ జెయింట్స్ - ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ ఒక్కసారిగా హీటు పెంచేసింది. లో స్కోరింగ్ మ్యాచ్‌లో ఒక ఇన్సిడెంట్ మ్యాచ్ మొత్తానికి హై ఓల్టేజ్‌ని తీసుకొచ్చింది.
ఇకానా స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ సెకండ్ ఇన్నింగ్స్‌లో ప్రిన్స్ యాదవ్ - ట్రిస్టన్ స్టబ్స్ మధ్య ఇన్నిడెంట్ ఒక్కసారిగా హీట్ తెప్పించింది. బౌలర్ రెచ్చగొట్టినా సరే స్టబ్స్ ఆఖరి వరకూ క్రీజులో ఉండి మ్యాచ్‌ని గెలిపించేశాడు.
ఇకానా స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టు తొలుత బ్యాటింగ్ చేసి 18.4 ఓవర్లలో కేవలం 141 పరుగులకే ఆలౌట్ అయింది. బ్యాటింగ్ ఆర్డర్ వైఫల్యం కారణంగా లక్నో సూపర్ జెయింట్స్ భారీ స్కోర్ చేయలేకపోయింది. దాంతో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఈజీ టార్గెట్ దక్కింది.
లో స్కోర్ ఛేజింగ్‌లో ఢిల్లీ కూడా ఆరంభంలో తడబడింది. ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన ప్రిన్స్ యాదవ్ దెబ్బకు పాతుమ్ నిస్సాంకతో పాటు కెప్టెన్ అక్షర్ పటేల్ పెవిలియన్ బాట పట్టారు. దాంతో ఢిల్లీ 26 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయింది. ఆ సమయంలో క్రీజులోకి వచ్చిన ట్రిస్టన్ స్టబ్స్ నిలకడగా ఆడుతూ మ్యాచ్‌ని ఢిల్లీ వైపు తిప్పేశాడు.
ప్రిన్స్ యాదవ్ చాలా అగ్రెసివ్‌గా బంతితో పాటు బ్యాటర్ మీదకు వెళ్లాడు. దాంతో ట్రిస్టన్ స్టబ్స్ కూడా ముందుకొచ్చాడు. దాంతో ఇద్దరూ ఎదురెదురుగా రావడంతో మాటలు విసురుకోవాల్సి వచ్చింది. ప్రిన్స్ యాదవ్ ఏదో అనడంతో స్టబ్స్ కూడా చూసుకుందాంలే వెళ్లు అన్నట్టు చెప్పేశాడు. ఈ ఇన్సిడెంట్‌తో మ్యాచ్ కాసేపు హీటెక్కింది. ఈ మ్యాచ్‌లో ప్రిన్స్ యాదవ్ మూడు ఓవర్లు బౌలింగ్ చేసి రెండు వికెట్లు పడగొట్టాడు.
26 పరుగులకే నాలుగు వికెట్లు తీసినప్పటికీ.. మ్యాచ్ గెలవడంలో లక్నో వైఫల్యం చెందింది. సమీర్ రిజ్వి - ట్రిస్టన్ స్టబ్స్ భాగస్వామ్యం లక్నో ఆశలపై నీళ్లు చల్లింది. ఈ ఇద్దరూ ఐదో వికెట్‌కు 119 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 76 బంతులు ఆడిన ఈ ఇద్దరూ వికెట్ కోల్పోకుండా మ్యాచ్‌ని గెలిపించారు. ట్రిస్టన్ స్టబ్స్ 32 బంతుల్లో మూడు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 39 పరుగులు చేయగా.. సమీర్ రిజ్వి 47 బంతుల్లో 70 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.

