Dailyhunt
Raaka: వైల్డ్ లుక్‌లో భయపెడుతోన్న బన్నీ.. అట్లీ- అల్లు అర్జున్ మూవీ టైటిల్ పోస్టర్ అదుర్స్

Raaka: వైల్డ్ లుక్‌లో భయపెడుతోన్న బన్నీ.. అట్లీ- అల్లు అర్జున్ మూవీ టైటిల్ పోస్టర్ అదుర్స్

Telugu Samayam 1 month ago

ఇండియన్ సినీ ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్లకు ఉండే క్రేజే వేరు. ఈ కోవలోనే అట్లీ - అల్లు అర్జున్ కాంబోలో తెరకెక్కుతోన్న మూవీపై భారీ అంచనాలున్నాయి.

తాజాగా ఈ చిత్రానికి 'రాకా' (Raaka) అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను ఖరారు చేశారు. బుధవారం బన్నీ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్‌తో పాటు వినూత్నంగా ఉన్న ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ అభిమానులకు గూస్‌బంప్స్ తెప్పిస్తోంది. అల్లు అర్జున్ మునుపెన్నడూ చూడని అత్యంత భయంకరమైన, వినూత్నమైన రగ్గడ్ లుక్‌లో కనిపిస్తున్నారు. తోడేలు కాళ్లలాంటి చేతులు, పొడవైన గోర్లతో ఉన్న ఈ క్రియేచర్-స్టైల్ లుక్ సినిమాపై భారీ ఆసక్తిని రేకెత్తిస్తోంది. పోస్టర్‌లో బన్నీ కళ్ళు చూపిస్తున్న ఇంటెన్సిటీ, ఫేస్ మీద ఉన్న మేకప్ ఆయన కెరీర్‌లోనే అత్యంత వైవిధ్యమైన ప్రయోగమని స్పష్టమవుతోంది. ఇది ఒక సైన్స్ ఫిక్షన్ లేదా ఫాంటసీ థ్రిల్లర్ అని తెలుస్తోంది.

* 'నీ రామ్‌ని దూరం చేశాను.. క్షమించు'.. మృణాల్ ఠాకూర్‌కి సారీ చెప్పిన సుమంత్!


సుమారు ₹800 కోట్ల భారీ బడ్జెట్‌తో సన్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ మూడు విభిన్న పాత్రలు పోషించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మెయిన్ హీరోయిన్‌గా బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె పేరును ఇప్పటికే అధికారికంగా ప్రకటించగా ఆమెతో పాటు రష్మిక, జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్, భాగ్యశ్రీ బోర్సే వంటి స్టార్ హీరోయిన్లు కూడా ఈ చిత్రంలో భాగం కానున్నట్లు సమాచారం. ఈ చిత్రం హాలీవుడ్ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్, డీ-ఏజింగ్ టెక్నాలజీతో రూపొందుతోంది. పునర్జన్మల కాన్సెప్ట్‌తో ఒక డార్క్ మిస్టరీ డ్రామాగా అట్లీ ఈ కథను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

* 'లిటిల్ హార్ట్స్' డైరెక్టర్‌తో అడివి శేష్ 'ప్యూర్ లవ్ స్టోరీ'.. నిర్మాతలుగా మారుతున్న ఆ ఇద్దరు నటులు!

పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ రేంజ్ పాన్ ఇండియా నుండి గ్లోబల్ స్థాయికి పెరిగింది. ఇప్పుడు అట్లీ వంటి సెన్సేషనల్ డైరెక్టర్‌తో జతకట్టడం ఈ సినిమాపై అంచనాలను ఆకాశానికి తీసుకెళ్లింది. టైటిల్ విషయంలో 'లెగసీ', 'వైల్డ్ ఫైర్' వంటి పేర్లు వినిపించినప్పటికీ ఫైనల్‌గా 'రాకా' అనే టైటిల్‌తో మేకర్స్ అందరినీ ఆశ్చర్యపరిచారు. వచ్చే ఏడాది సమ్మర్ నాటికి ఈ సినిమా ప్రేక్షకులను అలరించే అవకాశం ఉంది. ఈ భారీ కాంబినేషన్ బాక్సాఫీస్ వద్ద ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Samayam