Dailyhunt
'రాకా'లో అల్లు అర్జున్ లుక్ కాపీనా?.. 'కాష్మోరా' రాజ్‌నాయక్‌తో పోలుస్తూ నెటిజన్ల ట్రోలింగ్!

'రాకా'లో అల్లు అర్జున్ లుక్ కాపీనా?.. 'కాష్మోరా' రాజ్‌నాయక్‌తో పోలుస్తూ నెటిజన్ల ట్రోలింగ్!

Telugu Samayam 6 days ago

తెలుగు సినిమా బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన 'పుష్ప 2' తర్వాత, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో రాబోతున్న ప్రాజెక్ట్‌పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి.

బుధవారం (ఏప్రిల్ 8) బన్నీ పుట్టినరోజును పురస్కరించుకుని ఈ సినిమా టైటిల్ 'రాకా' (Raaka) అని ప్రకటిస్తూ మేకర్స్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. అయితే, ఈ లుక్ ఇప్పుడు నెట్టింట పెద్ద చర్చకు దారితీసింది. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో అల్లు అర్జున్ మునుపెన్నడూ చూడని విభిన్నమైన, భయంకరమైన అవతార్‌లో కనిపిస్తున్నారు. బన్నీ గుండుతో కళ్లకు దట్టమైన కాటుకతో, ఇంటెన్సివ్ లుక్‌తో గూస్‌బంప్స్ తెప్పిస్తున్నారు. చేతులు తోడేలు కాళ్లలా ఉండి, పెద్ద గోర్లు కలిగి ఉండటం సినిమాలోని ఫాంటసీ లేదా సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్స్‌ను సూచిస్తోంది. ఆయన నుదుటిపై ఉన్న వికింగ్ తరహా టాటూలు, ముఖంపై రగ్గడ్ స్కిన్ టెక్స్చర్ చూస్తుంటే, అట్లీ ఈ సినిమా కోసం ఏదో అద్భుతమైన ప్రపంచాన్ని సృష్టిస్తున్నారని అర్థమవుతోంది.

* వైల్డ్ లుక్‌లో భయపెడుతోన్న బన్నీ.. అట్లీ- అల్లు అర్జున్ మూవీ టైటిల్ ఇదే

'రాకా' పోస్టర్ వచ్చిన కొద్దిసేపటికే సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది. ఈ లుక్ 2016లో విడుదలైన కార్తీ 'కాష్మోరా' చిత్రంలోని రాజ్‌నాయక్ పాత్రను తలపిస్తోందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. రాజ్‌నాయక్ పాత్రలో కార్తీ కూడా గుండుతో, గుబురు గడ్డంతో, నెగటివ్ షేడ్స్ ఉన్న క్రూరమైన యోధుడిగా కనిపిస్తారు. దీంతో అట్లీ మళ్ళీ తన పాత అలవాటు (కాపీ) కొనసాగిస్తున్నారా? అని కొందరు ప్రశ్నిస్తుంటే, "కార్తీ లుక్ ఒరిజినల్ అయితే, బన్నీది డూప్లికేట్ లా ఉంది" అని మరికొందరు విమర్శిస్తున్నారు. అయితే, బన్నీ అభిమానులు మాత్రం ఇది కేవలం పోస్టర్ మాత్రమేనని, సినిమాలో ఆయన విశ్వరూపం మరో రేంజ్‌లో ఉంటుందని కౌంటర్ ఇస్తున్నారు.


* ఆ టైమ్‌లో పాలిటిక్స్‌లోకి వచ్చుంటే చిరంజీవి కచ్చితంగా సీఎం అయ్యేవారు - శివాజీ అనాలసిస్

సన్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని సుమారు ₹800 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తోంది. మెయిన్ హీరోయిన్‌గా దీపికా పదుకొణె నటిస్తుండగా.. రష్మిక, జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్ కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. పునర్జన్మల కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ డార్క్ మిస్టరీ డ్రామా కోసం హాలీవుడ్ స్థాయి వీఎఫ్ఎక్స్, డీ-ఏజింగ్ టెక్నాలజీని వాడుతున్నారు. వచ్చే ఏడాది వేసవిలో ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మొత్తానికి 'రాకా' టైటిల్, లుక్ బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. ట్రోల్స్ ఎలా ఉన్నా, అట్లీ-బన్నీ కాంబో అంటే అంచనాలు మాత్రం ఆకాశాన్నంటుతున్నాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Samayam