Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రోహిణి గతాన్ని తవ్వుతున్న మీనా.. త్వరలోనే గుట్టురట్టు.. బాలు ప్లాన్ అదుర్స్

రోహిణి గతాన్ని తవ్వుతున్న మీనా.. త్వరలోనే గుట్టురట్టు.. బాలు ప్లాన్ అదుర్స్

Telugu Samayam 0 months ago

గుండెనిండా గుడిగంటలు సీరియల్ ప్రస్తుతం హైవేలో వంద స్పీడు మీద దూసుకెళ్తున్నట్టుగా ఉంది. రోహిణి చేసే మోసాలు, చెప్పే అబద్దాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి.

మనోజ్, రోహిణి కలిసి కల్పన దగ్గర వసూల్ చేసిన 45 లక్షల వ్యవహారం బయట పడింది. విల్లా విషయంలో ఈ ఇద్దరూ అడ్డంగా బుక్కయ్యారు. పైగా సబ్ డీలర్ల నుంచి ముప్పై లక్షలు స్వాహా చేశారు. ఇవన్నీ కాకుండా రోహిణి గతం ఉండనే ఉంది. మొదటి పెళ్లి, కొడుకు, అమ్మ, మలేషియా నాటకం ఇవన్నీ ఉన్నాయి. మటన్ కొట్టే వాడ్ని తీసుకు వచ్చి మలేషియా మామగా రోహిణి ఆడించిన నాటకం కూడా ఉంది.

అలా రోహిణి చెప్పిన అబద్దాలు, చేసిన మోసాల్ని బాలు ఒక్కొక్కటిగా బయటకు తీసుకు వచ్చేలా ఉన్నాడు. రీసెంట్‌గా బాలు క్యాబ్‌లో ఓ మలేషియా జంట ఎక్కింది. బాలు, మీనాల మంచితనానికి ఆ జంట ముచ్చటపడిపోయింది. ఆ జంట 25వ పెళ్లి రోజు సందర్భంగా ఇంటికి భోజనానికి పిలుస్తారు బాలు, మీనా. మలేషియా నుంచి వచ్చారా? అని ప్రభావతి తెగ సంబరపడుతుంది. కానీ తన గుట్టు రట్టు అవుతుందని రోహిణి మాత్రం పంటి నొప్పి అని నాటకం ఆడింది. ఆ నాటకాన్ని బాలు కనిపెట్టాడు. శ్రుతిని వెంట వెళ్లమని రోహిణితో పంపించాడు.

అక్కడ శ్రుతి దగ్గరుండి రోహిణి నాటకాన్ని సాగనివ్వలేదు. బాగున్న పన్నుని పీకించేసింది. అబద్దాలు ఆడితే పళ్లు రాలతాయి అన్నట్టుగా బాలు, మీనాలు కామెడీ చేసుకుంటారు. రోహిణి ఇంకా ఏదో పెద్ద రహస్యాల్ని దాచేస్తుందని బాలు, మీనాలకు అనుమానం వస్తుంది. దీంతో ఇద్దరూ డిటెక్టివ్ పనులు స్టార్ట్ చేశారు. రోహిణిని అసలు అత్తయ్యకు తగిలించింది కామాక్షి అత్త అని.. అక్కడి నుంచి ఇన్వెస్టిగేషన్ ప్రారంభిస్తారు. కానీ కామాక్షికి కూడా రోహిణి గురించి ఏమీ తెలీదని మీనా అర్థం చేసుకుంటుంది. ఆ తరువాత విద్య దగ్గరకు వెళ్లి కూపీ లాగే ప్రయత్నం చేస్తుంది.

కానీ విద్య రకరకాల అబద్దాలు చెబుతూ కంగారు పడుతుంటుంది. దీంతో మీనాకి విద్య, రోహిణిల మీద మరింత అనుమానం వస్తుంది. ఇక ఇదే విషయాన్ని రోహిణికి విద్య చెబుతుంది. మీనా ఎంక్వైరీ చేస్తోందని తెలియడంతో రోహిణి మరింత భయపడుతుంది. మీ వాళ్లు నా గురించి ఎంక్వైరీ చేస్తున్నారట అని మనోజ్‌కి చెబుతుంది రోహిణి. వెంటనే మనం డబ్బులు తిరిగి ఇచ్చేయాలి.. అప్పుడే వీరు సైలెంట్ అవుతారు అని రోహిణి అంటే.. మీ మలేషియా మామ అడ్రస్ చెప్పు.. నేను వెళ్లి డబ్బులు అడుగుతాను అని మనోజ్ అంటాడు. దీంతో రోహిణి మరింతగా భయపడుతుంది. ఇక బాలు మలేషియా ట్రిప్ అంటూ ఏదో ప్లాన్ వేశాడు. ఈ ప్లాన్ సంగతి ఏంటి? రోహిణి గుట్టు ఎలా రట్టు అవుతుంది అనేది వచ్చే వారం తెలియనుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Samayam