Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతి కేసులో కీలక మలుపు.. భర్తపై అనుమానాలు, మెజిస్టీరియల్ విచారణకు ఆదేశాలు

సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతి కేసులో కీలక మలుపు.. భర్తపై అనుమానాలు, మెజిస్టీరియల్ విచారణకు ఆదేశాలు

Telugu Samayam 1 week ago

విజయనగరం జిల్లాకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ రాధాగాయత్రి మృతి కేసు కీలక మలుపు తిరిగింది. భర్తతో కలిసి ఉత్తరాఖండ్‌లోని మసూరీకి ట్రిప్‌నకు వెళ్లిన ఈమె అనుమానాస్పదంగా మృతిచెందింది.

దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేస్తున్న వేళ తమ కుమార్తె మృతికి అల్లుడు శ్రీచరణ్ కారణమంటూ ఆమె తల్లిదండ్రులు ఆరోపించారు. దాంతో కేసు మరో కీలక మలుపు తిరిగింది. ఘటనపై పూర్తి స్థాయి విచారణ చేపట్టాలంటూ డెహ్రాడూన్ జిల్లా కలెక్టర్ రాహుల్ ఆనంద్ మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించారు.

పోస్టుమార్టం నివేదికపై మెజిస్టీరియల్ విచారణకు జోక్యం చేసుకోవాలంటూ సైనిక్ వెల్ఫేర్ డైరెక్టర్ లెఫ్టినెంట్ కర్నల్ వీరేంద్ర ప్రసాద్ భట్‌ను ఈ నెల 4న రాధా గాయత్రి తల్లిదండ్రులు సుధాకర్, సత్యవతి కోరారు. ఈ నేపథ్యంలోనే జూన్ 14వ తేదీ అర్ధరాత్రి నుంచి 16వ తేదీ వరకు జరిగిన ఘటనలపై మేజిస్ట్రేట్ విచారణ ప్రారంభించారు. రాధా గాయత్రి తల్లిదండ్రులు రాకుండానే మృతదేహానికి పోస్టుమార్టం ప్రక్రియ ఎందుకు పూర్తి చేశారు అనేది ప్రశ్నగా మారింది.

READ ALSO సాయికృష్ణకు వైద్యం చేసిన ఆర్ఎంపీ అజ్ఞాతంలోకి..? కేసులో కీలక మలుపు ఇదే, అతను దొరికితే అంతా బయటకు!


మసూరి డివిజినల్ మేజిస్ట్రేట్ ఈ విచారణను నిర్వహిస్తుండగా.. రాధా గాయత్రి మరణానికి ముందు, తర్వాత జరిగిన పరిణామాలను క్షుణ్నంగా పరిశీలించనున్నారు. ముఖ్యంగా ఆమె ఆరోగ్య పరిస్తితి, ప్రయాణ వివరాలు, ఘటన జరిగిన సమయంలో ఆమెతో ఉన్న వ్యక్తులు, ఆస్పత్రి రికార్డులు తదితర అంశాలపై సమాచారం సేకరిస్తున్నట్లు తెలుస్తోంది.

ముఖ్యంగా పోస్టుమార్టం ప్రక్రియలో పాల్గొన్న వైద్య సిబ్బంది, సంబంధిత అధికారులను ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ కేసు విచారణ పూర్తయిన అనంతరం రాధా గాయత్రి మృతికి సంబంధించిన పూర్తి వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఈ కేసులో పోస్టు మార్టం నివేదికే కీలకం కానుంది. ఆ రిపోర్టు వస్తే ఆమె ఏ విధంగా మరణించారు అనేది తెలుస్తుంది. అయితే, పోస్టుమార్టం నివేదిక రాక ముందే మెజిస్టీరియల్ దర్యాప్తునకు ఆదేశించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. మొత్తానికి ఈ కేసు రోజు రోజుకూ ఆసక్తికరంగా మారుతోంది.
Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Samayam