Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సముద్రాన్ని ఈదుకుంటూ చొరబడిన వేలాది మంది.. మొరాకో- స్పెయిన్ బోర్డర్‌లో అలజడి

సముద్రాన్ని ఈదుకుంటూ చొరబడిన వేలాది మంది.. మొరాకో- స్పెయిన్ బోర్డర్‌లో అలజడి

Telugu Samayam 2 weeks ago

ముద్రాన్ని ఈదుకుంటూ వేలాది మంది మొరాకో నుంచి స్పెయిన్‌లోకి చొరబడటం కలకలం సృష్టించింది. ఈ ప్రయత్నంలో 19 మందికిపైగా వలసదారులు కోల్పోయారు. మొరాకో నుంచి ఒక్కసారిగా స్పెయిన్ సరిహద్దు నగరం సెయూటలోకి గురువారం వేలాది మంది చొరబడ్డారు.

మొత్తం 49 వేల మంది అక్రమంగా సరిహద్దులు దాటినట్టు స్పెయిన్ అంతర్గ భద్రతా వ్యవహారాల శాఖ ప్రకటించింది. దీంతో సరిహద్దుల్లో సైనిక బలగాలను భారీగా మోహరించినట్టు తెలిపింది. ఈ పరిణామం స్థానిక అధికారులను ఉక్కిరిబిక్కిరి చేసింది. వలసలు, సరిహద్దు భద్రత, మొరాకోతో స్పెయిన్ సంబంధాలపై చర్చను మళ్లీ రాజేసింది. సరిహద్దు వద్ద శాంతిభద్రతల పునరుద్ధరణకు యూరోపియన్ యూనియన్ మద్దతును ప్రకటించింది.

ఈ వలసల వెల్లువ స్పెయిన్‌లో రాజకీయ ఉద్రిక్తతలను రేకెత్తించింది. ఐరోపా సరిహద్దులపై ఆందోళనల కారణంగా అసాధారణ చర్యలు తీసుకునే అవకాశం ఉందని ఇటలీ హెచ్చరించగా, కొంతమంది ఐరోపా రాజకీయ నాయకులు రాజకీయ లబ్ధి కోసం ఈ సంక్షోభాన్ని వాడుకుంటున్నారని స్పెయిన్ మండిపడింది.

ఇదిలా ఉండగా, వేల మంది స్పెయిన్‌లో ప్రవేశించడానికి కారణాలేంటనే దానిపై స్పష్టత లేదు. కానీ, మొరాకో రాజు క్షమాభిక్షల వేళ ఈ పరిణామాలు చోటుచేసుకోవడం గమనార్హం. జులై 30న మొరాకో రాజు పట్టాభిషేక వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించగా.. ఈ క్రమంలోనే ఆయన వేలాది మంది ఖైదీలకు క్షమాభిక్షలు ప్రసాదించారు. చిన్న చిన్న నేరాలు చేసి జైలుకు వెళ్లినవారిని మానవతా దృక్పథంతో విడుదల చేశారు. జైలు నుంచి విడుదలైన వీరే స్పెయిన్‌లోకి చొరబడినట్లు ఆరోపణలు వస్తున్నాయి.

సెయూటా ద్వీపకల్పం

ఈశాన్య ఆఫ్రికాలోని మొరాకో సరిహద్దులో జిబ్రాల్టర్ జల సంధి సమీపంలో ఉండే సెయూటా ద్వీపకల్పం స్పెయిన్‌ అధీనంలో ఉంది. ఆఫ్రికా దేశాలతో యూరోపియన్ యూనియన్‌కు ఉన్న ఏకైక భూ సరిహద్దు.. అత్యంత సమీప మార్గం ఇదే. అందుకే ఆఫ్రికా నుంచి ఐరోపాకు వలస వెళ్లేందుకు ఈ నగరాన్ని ఎంట్రీగా. 1580ల నుంచి స్పెయిన్‌ నియంత్రణలోనే ఈ నగరం ఉన్నప్పటికీ.. మొరాకో మాత్రం ఇప్పటికీ అధికారికంగా గుర్తించలేదు. దీనిపై రెండు దేశాల మధ్య కొన్నేళ్లుగా వివాదాలు కొనసాగుతున్నాయి.

పటిష్టమైన నిఘా వ్యవస్థలు, గస్తీ దళాలు, భద్రతా అవరోధాలు ఉన్నప్పటికీ ఫెన్సింగ్ ఎక్కి స్పెయిన్‌లోకి వెళ్లడం కొత్తేం కాదు. సెయుటాలోకి ప్రవేశించిన వలసదారులు స్పెయిన్‌లో ఆశ్రయం కోరవచ్చు. అయినప్పటికీ ద్వైపాక్షిక ఒప్పందాల ప్రకారం చాలా మందిని వెంటనే మొరాకోకు తిరిగి పంపిస్తారు. 2021 మే నెలలో ఇటువంటి సంఘటన చోటుచేసుకుంది. అప్పుడు కేవలం రెండు రోజుల్లోనే 8 వేల మంది వలసదారులు స్పెయిన్‌లోకి ప్రవేశించారు. ఆ స్థాయిలో చొరబాట్లు జరగడం మళ్లీ ఇప్పుడేనని స్పెయిన్‌ అధికారులు వెల్లడించారు.

ఈ వారంలో ఏం జరిగింది?

గురువారం వేలాది మంది వలసదారులు సెవుటాలోకి ప్రవేశించడానికి కొన్ని రోజుల ముందు నుంచే సరిహద్దు దాటడానికి జరిగే ప్రయత్నాల సంఖ్య పెరుగుతూ వచ్చింది. మొరాకో, స్పెయిన్‌లను వేరు చేసే ఆనకట్టల చుట్టూ ఈదుకుంటూ చాలామంది వచ్చారు. మరికొందరు గాలితో నింపిన రింగులు, ఈత రెక్కలు (flippers) ఉపయోగించి స్థానిక తీరాలకు చేరుకున్నారు. స్పెయిన్ భూభాగంలోకి అడుగుపెట్టిన తర్వాత కాలినడకన వస్తున్న జనసమూహాల ఫోటోలు బయటకు వచ్చాయి. వీరిలో ఎక్కువగా యువకులు ఉన్నప్పటికీ, మహిళలు, పిల్లలు కూడా ఉన్నారు. అధికారులు కచ్చితమైన సంఖ్యను ధ్రువీకరించనప్పటికీ, ఆ ఒక్క రోజే దాదాపు 2,000- 3,000 మంది వరకు సెవుటాలోకి ప్రవేశించినట్లు భావిస్తున్నారు.

ఎందుకు ప్రాణాలు కోల్పోయారు?

దూరం చాలా తక్కువే అయినప్పటికీ, ఈ సరిహద్దును దాటడం అత్యంత ప్రమాదకరమైనది. సెవుటాకు చేరుకోవడానికి ప్రయత్నిస్తూ కనీసం 19 మంది వలసదారులు మరణించారు. వీరిలో ఎక్కువమంది నీటిలో మునిగిపోయినట్లు భావిస్తున్నారు. తీవ్రమైన అలల ఉధృతి, పరిమితికి మించి జనం ఒకేసారి దాటడం, సరిహద్దు గోడల చుట్టూ ఈదడానికి ప్రయత్నించడం ఈ మార్గాన్ని మరింత ప్రమాదకరంగా మార్చాయి. నీటిలో చిక్కుకుపోయిన మరికొంతమందిని రక్షించాల్సి వచ్చింది.

ఈ ఆకస్మిక వలసలకు కారణమేంటి?

ఈ వారంలో ఇంతమంది సెవుటాలోకి ప్రవేశించడానికి ఎందుకు ప్రయత్నించారనే దానిపై అధికారులు ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే, సెయుటా లేదా మెలిల్లా చేరుకోవడానికి ప్రయత్నిస్తూ సముద్రంలో పట్టుబడిన వలసదారులను మొరాకోకు తిరిగి పంపకూడదని ఇటీవల స్పెయిన్ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఓ కారణమని తెలుస్తోంది. దీనిని ఆసరాగా చేసుకుని, మానవ అక్రమ రవాణా నెట్‌వర్క్‌లు వలసదారులను ప్రోత్సహించి ఉండొచ్చని స్పానిష్ అధికారులు భావిస్తున్నారు. స్పెయిన్, మొరాకోల మధ్య నెలకొన్న విస్తృత దౌత్యపరమైన ఉద్రిక్తతలు కూడా దీనికి కారణమై ఉండొచ్చని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Samayam