SIP Calculator: దీర్ఘకాలికంగా క్రమానుగత పెట్టుబడి విధానం (సిప్) ద్వారా పెట్టుబడి పెట్టడం వల్ల ఎలాంటి వెల్త్ క్రియేషన్ సాధించవచ్చో నిరూపించే నివేదిక ఇది.
గడిచిన 10 సంవత్సరాల కాలంలో కాంపౌండింగ్ మ్యాజిక్‌తో ఇన్వెస్టర్లకు ఏకంగా 20 శాతానికి పైగా వార్షిక రాబడిని అందించిన టాప్ 7 ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ల జాబితాను ఈటీ వెల్త్ సిద్ధం చేసింది. క్రమం తప్పకుండా చిన్న మొత్తం ఇన్వెస్ట్ చేసినా సరైన ఫండ్లను ఎంచుకుంటే 10 ఏళ్ల వ్యవధిలో కోటీశ్వరులు కావడం అసాధ్యమేమీ కాదని ఈ ఫండ్ల పని తీరు స్పష్టం చేసింది.
10 ఏళ్లలో రికార్డు రిటర్నులు ఇచ్చిన ప్రధాన ఫండ్లు
ఈటీ మ్యూచువల్ ఫండ్స్ విశ్లేషణ ప్రకారం గడిచిన 10 సంవత్సరాల కాలంలో 20 శాతం కంటే ఎక్కువ రాబడి ఇచ్చిన ఫండ్లలో ప్రధానంగా స్మాల్ క్యాప్ , కొన్ని మిడ్ క్యాప్ ఈక్విటీ పండ్లు అగ్రస్థానంలో నిలిచాయి.1. నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ (Nippon India Small Cap Fund) అత్యధికంగా దాదాపు 22.21 శాతం పైగా అన్యువలైజ్డ్ ఎస్ఐపీ రాబడిని ఇచ్చి అగ్రస్థానంలో నిలిచింది. రూ.10 వేలు నెల నెలా పొదుపు చేసినట్లయితే రూ.38.80 లక్షలు అందించింది.
2. ఇన్వెస్కో ఇండియా మిడ్ క్యాప్ ఫండ్ (Invesco India Mid Cap Fund) 21.97 శాతం వార్షిక రాబడితో రెండో స్థానంలో ఉంది. 10 సంవత్సరాల యాన్యువలైజ్డ్ సిప్ ద్వారా హైరిటర్న్స్ రూ.10 వేల పొదుపుతో రూ.38.30 లక్షలు అందించింది.
3. ఎడల్వేయిస్ మిడ్ క్యాప్ ఫండ్ (Edelweiss Mid Cap fund) గత 10 సంవత్సరాల కాలంలో సగటున వార్షిక రాబడి 21.52 శాతం మేర అందించింది. రూ.10 వేల పొదుపుతో రూ.37.40 లక్షలు అందించింది.
4. నిప్పాన్ ఇండియా గ్రోత్ మిడ్ క్యాప్ ఫండ్ (Nippon India Growth Mid Cap Fund) పదేళ్లలో 20.95 శాతం సిప్ రాబడి అందించింది. రూ.10 వేల సిప్ పెట్టుబడిని 10 ఏళ్లలోనే రూ.36.20 లక్షలు అందించింది.
5. యాక్సిస్ స్మాల్ క్యాప్ ఫండ్ (Axis Small Cap Fund) గత పది సంవత్సరాల కాలంలో సగటున 20.66 శాతం చొప్పున రాబడి అందించింది. రూ.10 వేల పొదుపుతో రూ.35.70 లక్షలు అందించింది.
6. యూనియన్ స్మాల్ క్యాప్ ఫండ్ (Union Small Cap Fund) గత పదేళ్లలో సగటున వార్షిక రాబడి 20.28 శాతం అందించింది. రూ.10 వేల పొదుపుతో రూ.35 లక్షల వరకు అందించింది.
7. హెచ్‌డీఎఫ్‌సీ మిడ్ క్యాప్ (HDFC Mid Cap Fund) గత పది సంతవ్సరాల కాలంలో వార్షిక రాబడి 20.21 శాతం చొప్పున రాబడి అందించింది. రూ.10 వేల సిప్ పొదుపుతో రూ.34 లక్షలకు పైగా అందించింది.
గత 10 సంవత్సరాల్లో ఫండ్ ఇచ్చిన రిటర్నులు భవిష్యత్తులో కూడా అదే స్థాయిలో వస్తాయని చెప్పలేము. స్మాల్ క్యాప్ పండ్లు అధిక రాబడి ఇచ్చినా, మార్కెట్ దిద్దుబాటు సమయంలో ఇవి తీవ్రంగా క్షీణించే అవకాశం ఉంటుంది. కేవలం స్మాల్ క్యాప్‌లకే పరిమితం కాకుండా మీ పోర్ట్ పోలియోలో లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్ ఫండ్లకు చోటు కల్పించాలి. మార్కెట్ తీవ్ర హెచ్చుతగ్గులకు లోనైనా భయపడకుండా 10 ఏళ్ల పాటు డిసిప్లిన్డ్ గా ఎస్ఐపీ కొనసాగించిన ఇన్వెస్టర్లు భారీ సంపదను సృష్టించుకోగలిగారు. పెట్టుబడి ప్రయాణంలో ఓపికే ప్రధాన మంత్రం.

