Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Solar Eclipse 2026: ఆగస్టులో సూర్యగ్రహణం వేళ ఏ రాశులకు లాభం? ఎవరికి పరీక్షా కాలం?

Solar Eclipse 2026: ఆగస్టులో సూర్యగ్రహణం వేళ ఏ రాశులకు లాభం? ఎవరికి పరీక్షా కాలం?

Telugu Samayam 1 month ago

Solar Eclipse 2026: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈ ఏడాది ఇప్పటికే సూర్య, చంద్ర గ్రహణాలు ఏర్పడ్డాయి. అయితే ఆగస్టు 12వ తేదీన రెండో సూర్య గ్రహణం ఏర్పడనుంది.

ఇది చాలా అరుదైనదిగా, శక్తివంతమైనదిగా జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఈ సందర్భంగా ఈ గ్రహణ ప్రభావం ఏ రాశులపై ఎలా ఉంటుందనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.


Solar Eclipse 2026: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ప్రతి ఏడాది సహజంగానే సూర్య, చంద్ర గ్రహణాలు ఏర్పడతాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఆగస్టు 12వ తేదీ బుధవారం నాడు సంపూర్ణ సూర్య గ్రహణం సంభవించనుంది. అయితే ఇది భారతదేశంలో కనిపించదు. అయితే ఈ సూర్య గ్రహణ ప్రభావంతో మన దేశంలో కనిపించనప్పటికీ ద్వాదశ రాశులపై ప్రభావం ఉంటుందా? లేదా అనే ప్రశ్న చాలా మందిలో సహజంగా తలెత్తుతుంది. ఈ నేపథ్యంలో 12 రాశులపై ఎలాంటి ప్రభావం పడనుంది? ఏ రాశి వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.మేష రాశి(Aries)

మేష రాశి వారికి సూర్యుని అనుగ్రహంతో సానుకూల ఫలితాలొచ్చే అవకాశం ఉంది. కెరీర్ పరంగా పురోగతి లభించొచ్చు. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగావకాశాలు రావొచ్చు. అయితే తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మానుకోవాలి.


వృషభ రాశి(Taurus)

వృషభ రాశి వారికి మిశ్రమ ఫలితాలు రానున్నాయి. ఈ కాలంలో ఆర్థిక పరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మీ ఖర్చులను నియంత్రించుకోవాలి. మీ కుటుంబ జీవితానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా ఓపికగా ఉండాలి.


మిథున రాశి(Gemini)

మిథున రాశి వారిలో ఉద్యోగులకు సానుకూల వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. వ్యాపారం కోసం మీరు కొత్త ప్రణాళికలు రూపొందించొచ్చు. మీ మాటతీరులో సంయమనం పాటించాలి.


కర్కాటక రాశి(Cancer)

కర్కాటక రాశి వారు సూర్య గ్రహణ కాలంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఈ కాలంలో చేసే ప్రయాణం విషయంలో కొంత ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది.


సింహ రాశి(Leo)

సింహ రాశి వారికి సూర్యుడు అధిపతిగా ఉంటాడు. ఈ నేపథ్యంలో సూర్యుని అనుగ్రహంతో మీ ఆత్మవిశ్వాసం పెరిగే అవకాశం ఉంది. అయితే మీ అహంకారాన్ని తగ్గించుకోవాలి. కొత్త పనులను ఆలోచనాత్మకంగా ప్రారంభించాలి.

ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఆర్థిక పరంగా కొంత ఇబ్బంది ఉండొచ్చు. అప్పుల బాధలు ఎక్కువయ్యే అవకాశం ఉంది. మీరు చేసే ప్రయత్నాల్లో నిరాశ ఎదురుకావొచ్చు.


కన్య రాశి(Virgo)

కన్య రాశి వారు సూర్య గ్రహణం వేళ ప్రతికూల ఫలితాలు ఎదురయ్యే అవకాశాలున్నాయి. ఈ కాలంలో మీరు చేసే పనిలో బాధ్యతలు పెరగొచ్చు. వ్యాపారులు పెట్టుబడి పెట్టే ముందు బాగా ఆలోచించాలి. ఆ తర్వాతే నిర్ణయాలు తీసుకోవాలి.

మీ కష్టానికి తగిన ఫలితాలు రాకపోవచ్చు. అంతేకాదు మీ వ్యక్తిగత జీవితంలో కొంత ఇబ్బందిగా ఉండొచ్చు. నిరుద్యోగులు ఉద్యోగం కోసం మరింత కష్టపడాల్సి ఉంటుంది. ఆర్థిక పరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి.


తుల రాశి (Libra)

తులా రాశి వారు సూర్య గ్రహణం వేళ చాలా ఓపికగా ఉండాలి. అనవసరమైన వివాదాలకు దూరంగా ఉండాలి. మీ ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. వ్యాపారులు చాలా కష్టపడాల్సి ఉంటుంది.


వృశ్చిక రాశి(Scorpio)

వృశ్చిక రాశి వారికి సూర్య గ్రహణ కాలంలో తాము చేసే పనుల్లో మార్పులు సంభవించే అవకాశం ఉంది. ఈ కాలంలో మీకు కొత్త బాధ్యతలు రావొచ్చు. మీరు ఒత్తిడిని నివారించడానికి ప్రయత్నించాలి. మీ కుటుంబ జీవితంలో వాతావరణం అనుకూలంగా ఉండకపోవచ్చు.

మీ కుటుంబ సభ్యులతో కొన్ని విషయాల్లో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. మీ వైవాహిక జీవితంలో అనేక సమస్యలు ఎదురవ్వొచ్చు. ఆరోగ్య పరంగా కొంత ఇబ్బంది ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.


ధనస్సు రాశి (Sagittarius)

ధనస్సు రాశి వారు సూర్య గ్రహణం కాలంలో సానుకూల ఫలితాలు పొందే అవకాశం ఉంది. ఈ కాలంలో మీరు చేసే ప్రయాణాల వల్ల మంచి ఫలితాలు రావొచ్చు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించే అవకాశం ఉంది. ఆర్థిక పరమైన విషయాల్లో నిర్ణయాలను చాలా జాగ్రత్తగా తీసుకోవాలి.


మకర రాశి(Capricorn)

మకర రాశి వారు సూర్య గ్రహణం వేళ ఆర్థిక పరమైన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఆస్తి సంబంధిత విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి. తొందరపడి ఎవరినీ నమ్మకండి. లేదంటే మీరు చాలా నష్టపోవాల్సి వస్తుంది.


Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Samayam