Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
"SRHకి ఇంకా సన్‌సెట్ కాలేదు.. ఈసారి ఆరెంజ్ ఆర్మీ తగలబెట్టేస్తుంది".. అశ్విన్ తెలుగు స్పీచ్‌తో ఫ్యాన్స్‌లో ఫుల్ ఫైర్

"SRHకి ఇంకా సన్‌సెట్ కాలేదు.. ఈసారి ఆరెంజ్ ఆర్మీ తగలబెట్టేస్తుంది".. అశ్విన్ తెలుగు స్పీచ్‌తో ఫ్యాన్స్‌లో ఫుల్ ఫైర్

Telugu Samayam 1 week ago

న్‌రైజర్స్ హైదరాబాద్ పేరు వినింటే ఐపీఎల్ స్కోర్ బోర్డు షేక్ అవుతుంది. ఐపీఎల్ 2026లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆడిన 15 మ్యాచ్‌లలో 9 సార్లు 200కు పైగా స్కోర్ చేసిందంటనే ఆ జట్టు ఎంత పవర్‌ఫుల్లో అర్థమవ్వాలి.

అలాంటి జట్టు ఈ ఏడాది ఫైనల్ బరిలో నిలుస్తుందని అందరూ అనుకున్నారు. కానీ.. ఎలిమినేటర్ మ్యాచ్‌లో వైభవ్ విధ్వంసానికి ఇంటిదారి పట్టాల్సి వచ్చింది. అలాంటి సన్‌రైజర్స్ హైదరాబాద్ వచ్చే సీజన్‌లో స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇస్తుందని రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు.

టీమిండియా మాజీ ఆల్‌రౌండర్, సీఎస్కే లెజెండ్ రవిచంద్రన్ అశ్విన్ తన యూట్యూబ్ ఛానల్ డిబేట్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ని ఆకాశానికి ఎత్తాడు. ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ ఆడిన తీరును అభినందిస్తూ తెలుగోళ్ల కోసం తెలుగులో మాట్లాడి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఐపీఎల్ 2027లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తగలబెట్టేస్తుందని.. అస్సలు తగ్గేదే లేదు అంటూ ఫ్యాన్స్‌లో ఫైర్ తెప్పించాడు.

యూట్యూబ్ ఛానల్ డిబేట్ జరుగుతున్న సమయంలో రవిచంద్రన్ అశ్విన్ సడెన్‌గా తెలుగులో మాట్లాడి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. అతనితో లైవ్‌లో ఉన్నవాళ్లు కూడా షాక్ అయ్యారు. అసలు అశ్విన్ మాట్లాడేది ఏ లాంగ్వేజ్ అని చెవులు రిక్కరించి విని.. ఆ తర్వాత తెలుగులోనే సన్‌రైజర్స్ ఫ్యాన్స్‌కి మోటివేషన్ ఇవ్వడంతో వాళ్లు కూడా జోష్‌లో మునిగిపోయారు. చివరికి పుష్ప ఫేమస్ డైలాగ్ తగ్గేదే లే అంటూ ఫ్యాన్స్‌లో కాన్ఫిడెన్స్ నింపాడు.

"చూడు బాబూ, గేమ్ అవేర్‌నెస్ బాగా చేయాలి. ఈ సారి మన సన్‌రైజర్స్ హైదరాబాద్‌లో సన్‌ సెట్ ఇంకా కాలేదు. నెక్స్ట్ సీజన్‌లో ఆరెంజ్ ఆర్మీ తగలబెట్టాలి. తగ్గేదేలే.. మంచిగా ఆడాలి. ప్యాట్ కమిన్స్ సారథ్యంలోని ఆరెంజ్ ఆర్మీ మంచి కమ్ బ్యాక్ ఇవ్వాలి" అంటూ రవిచంద్రన్ అశ్విన్ ఫ్యాన్స్‌లో జోష్ నింపాడు.

ఐపీఎల్ 2026లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆరంభంలో ఒడిదుడుకులను ఎదుర్కొన్న ఆ తర్వాత తిరిగి మంచి కమ్ బ్యాక్ ఇచ్చింది. లీగ్ స్టేజ్‌లో తొమ్మిది విజయాలు సాధించి 18 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది. ఎలిమినేటర్ మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ మీద వేసిన ప్లాన్లన్నీ విఫలమవ్వడంతో ఓటమిని అంగీకరించక తప్పలేదు. 2024 తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్ మళ్లీ రెండేళ్లలోనే ప్లే ఆఫ్స్ చేరుకున్నా టైటిల్ మాత్రం నెగ్గలేకపోయింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Samayam