ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్టైల్ మార్చినట్లు కనిపిస్తోంది. నిత్యం రివ్యూలు, సమావేశాలు అంటూ అధికారులను ఉరుకులు పరుగులు తీయిస్తుంటారు చంద్రబాబు.
ముఖ్యమంత్రిగా తనకు ఉన్న పనుల నేపథ్యంలో సోషల్ మీడియాలో యాక్టివిటీ కాస్త తక్కువనే చెప్పొచ్చు. కానీ ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు తన స్టైల్ మార్చినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో వచ్చే అంశాలను ఎప్పటికప్పుడు గమనిస్తున్న సీఎం.. ట్రెండ్‌కు తగినట్లుగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే తనను కలవాలంటూ వస్తున్న అభ్యర్థనలపై సానుకూలంగా స్పందిస్తూ.. జనంలోనే ఎక్కువగా ఉంటున్నారు.
ఈ క్రమంలోనే ఇటీవల పశ్చిమగోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గానికి చెందినసానబోయిన సత్యనారాయణ అనే వృద్ధుణ్ని కలిశారు సీఎం. చంద్రబాబును ఓసారైనా కలవాలని ఉందంటూ సత్యనారాయణ మాట్లాడిన వీడియో వైరల్ కాగా.. చంద్రబాబు స్పందించారు. సిద్ధాంతం పర్యటనకు వస్తున్నానని, అక్కడ కలుద్దామని హామీ ఇచ్చిన చంద్రబాబు.. చెప్పినట్లుగానే సత్యనారాయణను కలిశారు. ఆత్మీయంగా పలకరించారు. కుటుంబ యోగక్షేమాలు అడిగి తెలుసుకుని.. సత్యనారాయణకు సొంతిల్లు కట్టివ్వాలని అధికారులను ఆదేశించారు.
చంద్రబాబుపై ఉన్న అభిమానంతో దీన్ని రూపొందించామని.. చేనేత దినోత్సవం రోజున ముఖ్యమంత్రికి దీనిని అందించాలనేదే తమ కోరిక అని చెప్పుకొచ్చారు. ఈ విషయం చంద్రబాబు దృష్టికి రాగా.. మీ అభిమానానికి నా మనసు ఆనందంతో నిండిపోయిందంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు. మీరు కోరినట్టే ఆగస్టు 7వ తేదీ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా మిమ్మల్ని తప్పకుండా కలుస్తానంటూ హామీ ఇచ్చారు. మీరు ఎంతో కష్టపడి నేసిన ఆ అపురూప కానుకను అందుకుంటానంటూ ట్వీట్ చేశారు.

