Dailyhunt
Stock Split: 100 షేర్లు కొంటే 1000 షేర్లొస్తాయ్.. ఈ నెల 5 వరకే ఛాన్స్.. రూ.125 నుంచి రూ.12కు తగ్గనున్న స్టాక్ ధర

Stock Split: 100 షేర్లు కొంటే 1000 షేర్లొస్తాయ్.. ఈ నెల 5 వరకే ఛాన్స్.. రూ.125 నుంచి రూ.12కు తగ్గనున్న స్టాక్ ధర

Telugu Samayam 1 week ago

Stock Split: స్మాల్ క్యాప్ కేటగిరికి చెందిన ప్లాస్టిక్ ప్రొడక్ట్స్ రంగానికి చెందిన అవ్రో ఇండియా లిమిటెడ్ (Avro India Limited) బంపర్ ఆఫర్ తెచ్చింది.

ఈ కంపెనీ బోర్డు అఫ్ డైరెక్టర్స్ ఇటీవలే తమ షేర్ హోల్డర్లకు స్టాక్ స్ప్లిట్ ప్రకటించింది. ఈ కంపెనీ షేర్ హోల్డర్లకు 1:10 రేషియోలో స్టాక్ స్ప్లిట్ చేయాలని నిర్ణయించారు. రికార్డు డేట్ మే 05గా నిర్ణయించారు. మే 05 ఇంకా జస్ట్ 2 రోజులు మాత్రమే ఉంది. 2 రోజుల్లో ఈ కంపెనీ షేర్లు ఎక్స్ - స్ప్లిట్ ట్రేడ్ నిర్వహించనుంది. మరోవైపు ఈ కంపెనీ షేరు గత ఏడాదిలో తమ షేర్ హోల్డర్లకు 20 శాతం నష్టాన్ని ఇచ్చింది. స్టాక్ స్ప్లిట్ తర్వాత ప్రస్తుతం రూ. 125 వద్ద ఉన్న షేర్ ధర రూ. 12 స్థాయికి తగ్గుతుంది.

కంపెనీ ఎక్స్చేంజ్ ఫైలింగ్ ప్రకారం ఇటీవలే కంపెనీ బోర్డు డైరెక్టర్స్ సమావేశమై కంపెనీల చట్టం 2013 లోని సెక్షన్ 61 ని అనుగుణంగా 1:10 రేషియోలో స్టాక్ స్ప్లిట్ చేపట్టేందుకు ఆమోదం తెలుపారు. దీని అర్ధం రూ. 10 ఫేస్ వ్యాల్యూ ఉన్న 1 ఈక్విటీ షేరు రూ. 1 ఫేస్ వ్యాల్యూ ఉన్న 10 ఈక్విటీ షేర్లుగా విభజించేందుకు డైరెక్టర్స్ బోర్డు ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించిన అర్హులైన షేర్ హోల్డర్లను నిర్ణయించే రికార్డు డేట్ మే 5గా బోర్డు డైరెక్టర్స్ నిర్ణయించినట్లు కంపెనీ తెలిపింది.

సాట్ మార్కెట్ చివరి ట్రేడింగ్ సెషన్ లో అవ్రో ఇండియా లిమిటెడ్ షేరు 0.90 శాతం నష్టంతో రూ. 125.50 వద్ద ముగిసింది. ఈ షేరు 52 వారాల గరిష్ఠ ధర రూ. 202, అలాగే 52 వారాల కనిష్ఠ ధర రూ. 101.35 వద్ద ఉంది. గత వారం రోజుల్లో ఈ షేరు 2 శాతం నష్టపోయింది. గత నెల రోజుల్లో ఈ షేరు 11 శాతం లాభాన్ని ఇచ్చింది. గత ఆరు నెలల్లో 2 శాతం నష్టాన్ని మిగిల్చింది. గత ఏడాది కాలంలో 20 శాతం నష్టపోయింది. గత ఐదు సంవత్సరాలలో 60 శాతం లాభాన్ని అందించింది. ప్రస్తుతం ఈ కంపెనీ మార్కెట్ విలువ రూ. 170 కోట్లుగా ఉంది.

ఈ కథనం కేవలం సమాచారం అందించేందుకు మాత్రమే. స్టాక్ మార్కెట్లో హైరిస్క్ ఉంటుంది. ఎంచుకున్న స్టాక్ గురించిన వివరాలు ముందే తెలుసుకోవాలి. లేదంటే తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Samayam