Surya Shani Yuti 2026: వేద జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, మరో రెండు రోజుల్లో సూర్యుడు, శని గ్రహాల ప్రభావంతో నవపంచమ యోగం ఏర్పడనుంది. ఈ శుభ యోగం కారణంగా మేషం సహా ఈ 4 రాశులకు ధనలాభం కలిగే అవకాశం ఉంది.
ఈ జాబితాలో మీ రాశి కూడా ఉందేమో చూడండి.
Surya Shani Yuti 2026: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, వివిధ గ్రహాల కలయిక కారణంగా కొన్ని శుభ యోగాలు, అశుభ యోగాలు ఏర్పడుతూ ఉంటాయి. ఇవి ద్వాదశ రాశులపై ప్రభావం చూపుతాయి. ఈ నేపథ్యంలో గ్రహాలకు రాజుగా భావించే సూర్యుడు ప్రతి నెలా తన రాశిని మారుస్తూ ఉంటాడు. ప్రస్తుతం సూర్యుడు కర్కాటక రాశిలో సంచారం చేస్తూ గురు గ్రహంతో కలయిక ద్వారా గురు ఆదిత్య రాజయోగాన్ని ఏర్పరచనున్నాడు. ఇదే సమయంలో సూర్యుడు ఇతర గ్రహాలపై ద్రుష్టి సారించనున్నాడు. ఈ కారణంగా ఆగస్టు మాసంలో మీన రాశిలో ఉన్న శని గ్రహంతో 120 డిగ్రీల కోణంలో ఉండటం వల్ల ఆగస్టు 7వ తేదీన ఉదయం 8:11 గంటలకు నవ పంచమ రాజయోగాన్ని ఏర్పరచనున్నాడు. ఈ శుభ యోగం వేళ ఏ రాశుల వారికి ఆర్థిక ప్రయోజనాలు కలగనున్నాయనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.నవపంచమ యోగం ఎలా ఏర్పడుతుంది?

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, రెండు గ్రహాలు ఒకదానికొకటి పంచమ మరియు తొమ్మిదో స్థానాల్లో ఉన్నప్పుడు 'నవ పంచమ రాజయోగం' ఏర్పడనుంది. అలాగే రెండు గ్రహాల మధ్య 120 డిగ్రీల దూరం ఉన్నప్పుడు కూడా ఈ శుభ యోగం ఏర్పడనుంది. ప్రస్తుతం సూర్యుడు కర్కాటకరాశిలో, శని మీన రాశిలోనూ ఉన్నారు. ఈ రెండు గ్రహాల ప్రభావంతో నవపంచమ యోగం ఏర్పడటం కారణంగా కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు కలగనున్నాయి. చాలా కాలంగా పెండింగులో ఉన్న పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. మీ కష్టానికి తగిన ఫలితాలు లభించొచ్చు.
మేష రాశి(Aries)

మేషరాశి వారికి సూర్యుడు, శని గ్రహాల ప్రభావంతో ఏర్పడే నవపంచమ రాజయోగం వల్ల శుభఫలితాలు రానున్నాయి. ఈ కాలంలో మీరు కెరీర్ పరంగా మంచి పురోగతిని సాధించే అవకాశం ఉంది. సూర్య, శని గ్రహాల ప్రభావంతో మీకు ఆకస్మిక ధనలాభం రావొచ్చు. ఈ కాలంలో మీరు కోల్పోయిన డబ్బు తిరిగి పొందొచ్చు. మీ ఆర్థిక పరిస్థితి బలపడొచ్చు. నిరుద్యోగులకు తాము కోరుకున్న ఉద్యోగం లభించొచ్చు.
వృషభ రాశి(Taurus)

వృషభ రాశి వారికి 'నవపంచమ రాజయోగం' వల్ల అత్యంత శుభఫలితాలొచ్చే అవకాశాలున్నాయి. సూర్యుడ, శని గ్రహాల కలయికతో ఏర్పడే ఈ రాజయోగం కారణంగా మీరు చేసే పనులన్నింట్లో మంచి విజయం సాధించొచ్చు. ఈ సమయంలో మీకు అనుకూలంగా ఫలితాలు రావొచ్చు. మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగులకు కొన్ని శుభవార్తలు వినిపించొచ్చు. సమాజంలో మీకు గౌరవం కూడా లభిస్తుంది.
మిథున రాశి(Gemini)

మిథున రాశి వారికి నవపంచమ రాజయోగం కారణంగా అనేక ప్రయోజనాలు చేకూరే అవకాశం ఉంది. ఈ కాలంలో మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడొచ్చు. ఉద్యోగులకు కొన్ని మెరుగైన అవకాశాలు లభించొచ్చు. ప్రమోషన్ గురించి శుభవార్తలు వినిపించే అవకాశం ఉంది. మీ ఆదాయం పెరిగే అవకాశాలున్నాయి. పెండింగ్ బకాయిలను తిరిగి పొందే అవకాశాలున్నాయి. మీ వ్యక్తిగత జీవితం మెరుగుపడే అవకాశం ఉంది.
సింహ రాశి(Leo)

సింహ రాశి వారికి సూర్యుడు, శని గ్రహాల ప్రత్యేక అనుగ్రహంతో సానుకూల ఫలితాలు రానున్నాయి. నవపంచమ రాజయోగం ప్రభావంతో మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఈ కాలంలో పాత పెట్టుబడుల నుంచి భారీ లాభాలు పొందొచ్చు.
మీ ఆర్థిక పరిస్థితి గతంలో కంటే మెరుగుపడే అవకాశం ఉంది. ఈ కాలంలో స్నేహితుల సాయంతో కొన్ని పెద్ద పనులను పూర్తి చేసే అవకాశాలున్నాయి. ఉద్యోగులకు ప్రమోషన్ గురించి శుభవార్తలు వినిపించొచ్చు. ప్రభుత్వ పనుల విషయంలో మీరు గొప్ప విజయం సాధించొచ్చు.
మకర రాశి(Capricorn)

మకర రాశి వారికి నవపంచమ రాజయోగం కారణంగా అత్యంత శుభప్రదంగా ఉంటుంది. ఈ కాలంలో మీ ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడొచ్చు. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగం లభించే అవకాశం ఉంది. మీరు చేసిన పనికి ప్రశంసలు లభించొచ్చు. వ్యాపారులు మంచి లాభాలు పొందే అవకాశాలున్నాయి. ఉద్యోగులకు సహోద్యోగుల నుంచి సహకారం లభించొచ్చు.
కుంభ రాశి(Aquarius)

కుంభ రాశి వారికి శని, సూర్య గ్రహాల ప్రత్యేక కలయిక కారణంగా విశేష ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది. ఈ సమయంలో ఉద్యోగులకు కార్యాలయంలో ఉన్నత స్థానం లభించే అవకాశం ఉంది. వ్యాపారులకు పెద్ద లాభాలు రావొచ్చు. శని ప్రత్యేక అనుగ్రహం కారణంగా మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది. మీ పెండింగ్ పనులన్నీ విజయవంతంగా పూర్తవ్వొచ్చు.
ఈ కాలంలో కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఆరోగ్య పరంగా మెరుగైన ఫలితాలొచ్చే అవకాశాలున్నాయి. కోర్టు కేసులలో తీర్పు మీకు అనుకూలంగా రావొచ్చు.
గమనిక : ఇక్కడ అందించిన జ్యోతిష్య సమాచారం, పరిహారాలన్నీ జ్యోతిష్యశాస్త్రం, మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇవి కేవలం ఊహాల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఈ సమాచారాన్ని మీరు పరిగణనలోకి తీసుకునేందుకు సంబంధిత నిపుణులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరు.Read Latest Astrology News and Telugu News

