Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
స్వర్ణ గ్రామ, వార్డు కార్యాలయాల్లో ప్రతిరోజూ పీజీఆర్ఎస్.. సోమవారం వరకూ ఆగాల్సిన అక్కర్లేదు..

స్వర్ణ గ్రామ, వార్డు కార్యాలయాల్లో ప్రతిరోజూ పీజీఆర్ఎస్.. సోమవారం వరకూ ఆగాల్సిన అక్కర్లేదు..

Telugu Samayam 1 week ago

నకు ఉన్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లాలన్నా, ఏవైనా అంశాలపై ఫిర్యాదులు చేయాలన్న ఉన్న మార్గం.. ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS). ప్రతీ సోమవారం మండలం, డివిజన్, జిల్లా స్థాయిలో ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపడుతోంది.

ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో అధికారులను కలిసి ప్రజలు తమ సమస్యల పరిష్కారంపై అర్జీలు ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది. వారంలో ఒక్క రోజు, అది కూడా సోమవారం మాత్రమే ఈ పీజీఆర్ఎస్ కార్యక్రమం అమలు చేస్తున్నారు. దీంతో ఏదైనా అర్జీ అందించాలంటే సోమవారం వరకూ ఆగాల్సిన పరిస్థితి. అయితే ఇకపై ఈ ఇబ్బంది తప్పనుంది. ప్రజలు అర్జీలు సమర్పించేందుకు ఇకపై సోమవారం వరకూ నిరీక్షించాల్సిన అవసరం లేదు. స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు కార్యాలయాలలో అన్ని పనిదినాలలో పీజీఆర్ఎస్ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

ఈ ఆదేశాల నేపథ్యంలో ప్రతిరోజూ మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఐదు గంటల వరకూ స్వర్ణ గ్రామ, వార్డు కార్యాలయాలలో ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ సమయంలో కార్యాలయాల్లో సిబ్బంది కచ్చితంగా అందుబాటులో ఉండాలి. ప్రజలు అందించే అర్జీలను స్వీకరించి, పరిష్కారానికి సంబంధించిన సమాచారం తెలపాల్సి ఉంటుంది. అలాగే ఆయా అర్జీలు, ఫిర్యాదులను సంబంధిత శాఖ అధికారుల వద్దకు పంపించి.. పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ముఖ్యంగా రెవెన్యూ, వ్యవసాయ సహాయకులు, సర్వే, పశు సంవర్థక శాఖ, ఇంజినీరింగ్‌ సహాయకులు అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు.

మరింత పారదర్శకంగా పీజీఆర్ఎస్..

మరోవైపు పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని మరింత పారదర్శకంగా అమలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. అందులో భాగంగా ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించనున్నారు. ఇందుకోసం ప్రత్యేక క్యూఆర్ కోడ్ ఉపయోగిస్తారు. ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి, ప్రజల తమ అభిప్రాయాలను, స్పందనను తెలియజేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ప్రజాసమస్యల పరిష్కార వేదికలో సమర్పించే అర్జీల పరిష్కారం, వాటి స్థితి, ప్రజా స్పందన తెలియజేసేలా అధికారులు ఏర్పాట్లు చేస్తు్న్నారు. ఇప్పటికే కొన్ని జిల్లాల కలెక్టర్లు ఈ మేరకు ఆదేశాలు కూడా జారీ చేశారు.
Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Samayam