Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Swiggy Q1 results: ఫుడ్ డెలివరీలో స్విగ్గీ అదుర్స్..  రూ.300 కోట్ల లాభం.. కానీ మొత్తంగా భారీ నష్టాలు..!

Swiggy Q1 results: ఫుడ్ డెలివరీలో స్విగ్గీ అదుర్స్.. రూ.300 కోట్ల లాభం.. కానీ మొత్తంగా భారీ నష్టాలు..!

Telugu Samayam 1 week ago

Swiggy Q1 results: దిగ్గజ ఫుడ్ డెలివరీ, క్విక్ కామర్స్ కంపెనీ స్విగ్గీ ఈ ఆర్థిక సంవత్సరం 2026-27 తొలి త్రైమాసికం (ఏప్రిల్- జూన్) ఆర్థిక ఫలితాలను గురువారం మార్కెట్లు ముగిసిన తర్వాత వెల్లడించింది.

ప్రస్తుత ఆర్థిక ఏడాది ఏప్రిల్- జూన్ క్వార్టర్‌లో కంపెనీ ఫుడ్ డెలివరీ బిజినెస్‌లో అదరొట్టింది. 3 నెలల కాలంలోనే దాదాపు రూ.300 కోట్ల నికర లాభాన్ని చూపించింది. అయితే, మొత్తం కంపెనీ వ్యాపారాలను కలిపి చూస్తే భారీగా నష్టాలను చవి చూసింది. క్యూ1లో కంపెనీ రూ.791 కోట్ల నికర నష్టాన్ని చూపించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ నికర నష్టం రూ.1197 కోట్లుగా ఉండగా ఇప్పుడు భారీగా తగ్గడం గమనార్హం.

సమీక్షా త్రైమాసికంలో కంపెనీ వ్యాపార కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం 37 శాతం మేర పెరిగి రూ. 6,182 కోట్లుగా చూపించింది. అంతకు ముందు సంవత్సరం ఈ మొత్తం రూ. 4961 కోట్లుగా ఉంది. మొత్తం కంపెనీ ఆదాయం చూస్తే రూ. 7023 కోట్లుగా ఉంది. మొత్తం ఖర్చులు 25 శాతం పెరిగి రూ. 7813 కోట్లకు చేరినట్లు కంపెనీ తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వెల్లడించింది. అంటే రూ. 791 కోట్ల నికర నష్టం వచ్చినట్లయిందని తెలిపింది.

లాభాలు తెచ్చిన ఫుడ్ డెలివరీ

స్విగ్గీకి ఫుడ్ డెలివరీ బిజినెస్ లాభాలను తెచ్చి పెడుతోంది. ఈ కేటగిరీలో కంపెనీ నికర లాభం 48 శాతం మేర పెరిగి రూ. 299 కోట్లుగా నమోదు చేసింది. ఆదాయం 23 శాతం వృద్ధి సాధించి రూ.2,208 కోట్లుగా పేర్కొంది. ఇక ఇన్‌స్టామార్ట్ విభాగం చూస్తే రూ. 651 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించింది. ఆదాయం మాత్రం 53 శాతం మేర పెరిగి రూ. 1232 కోట్లకు చేరింది. సమీక్షా త్రైమాసికంలో ఇన్‌స్టామార్ట్ డార్క్ స్టోర్ల సంఖ్య మరో 28 పెరిగాయి. మొత్తంగా చూసుకుంటే ఇన్‌స్టా మార్ట్ స్టోర్ల సంఖ్ 1171 కు చేరింది.

ఇన్‌స్టామార్ట్ (Instamart) విస్తరణలో కంపెనీ పెట్టుబడులు కొనసాగిస్తున్నప్పటికీ, ఆదాయం పెరిగిన వేగంతో పోలిస్తే మొత్తం ఖర్చులు తక్కువ వేగంతోనే పెరిగాయి. దీనిని బట్టి, ప్రధాన ఆహార పంపిణీ వ్యాపారం లాభదాయకంగా కొనసాగుతుండగానే క్విక్ కామర్స్ విభాగం వల్ల వస్తున్న నష్టాలు తగ్గుముఖం పడుతున్నాయని అర్థమవుతోంది. దీంతో పోలిస్తే, దీని ప్రధాన ప్రత్యర్థి అయిన జొమాటో జూన్ త్రైమాసికంలో రూ. 92 కోట్ల లాభాన్ని నమోదు చేయగా, దాని ఆదాయం ఏడాది ప్రాతిపదికన 17 శాతం పెరిగి రూ. 20,211 కోట్లకు చేరింది.
Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Samayam