Dailyhunt
Tax Free SWP: మ్యూచువల్ ఫండ్స్‌లో 15 లక్షలు ఉన్నాయి.. ట్యాక్స్ లేకుండా నెల నెలా ఎంత విత్ డ్రా చేయొచ్చు?

Tax Free SWP: మ్యూచువల్ ఫండ్స్‌లో 15 లక్షలు ఉన్నాయి.. ట్యాక్స్ లేకుండా నెల నెలా ఎంత విత్ డ్రా చేయొచ్చు?

Telugu Samayam 2 weeks ago

Tax Free SWP: ఉద్యోగంలో ఉన్నప్పుడే రిటైర్మెంట్ గురించి ఆలోచించాలి. సంపాదించిన దాంట్లో నుంచి కొంత పెట్టుబడి పెట్టాలి. ప్రస్తుత రోజుల్లో చాలా మంది మ్యూచువల్ ఫండ్స్ ఎంచుకుంటున్నారు.

సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP) లేదా లంప్ సమ్ పెట్టుబడి ద్వారా ఏకమొత్తంలో ఇన్వెస్ట్ చేసే అవకాశం ఇందులో ఉంటుంది. దీర్ఘకాలంలో మంచి రాబడులు అందుకోవాలనుకునే వారు సిప్ మార్గాన్ని ఎంచుకుంటారు. పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేసే వారికి సైతం ఇందులో మంచి రిటర్న్స్ ఉంటాయి. ఇక పెద్ద మొత్తం కార్పస్ ఏర్పడిన తర్వాత చాలా మంది నెల నెలా పెన్షన్ మాదిరిగా విత్ డ్రా చేసుకునేందుకు సిస్టమాటిక్ విత్ డ్రాయల్ ప్లాన్ (SWP) లో చేరతారు.తమ వద్ద ఉన్న డబ్బులను అందులో ఉంచి నెల నెలా కొంత విత్ డ్రా చేస్తారు. అయితే, ఇక్కడ చాలా మందికి ఎంత విత్ డ్రా చేస్తే ట్యాక్స్ పడకుండా చూసుకోవచ్చు అనే ప్రశ్న తలెత్తుతోంది. మరి దానికి సమాధానం ఈ కథనం ద్వారా తెలుసుకుందాం.

ప్రశ్న: నేను ఉద్యోగ విరమణ చేశాను. ప్రస్తుతం మ్యూచువల్ ఫండ్స్‌లో రూ.15 లక్షల కార్పస్ ఉంది. నా కూతురు పదో తరగతి కోసం దానిని అట్టిపెట్టాను. ఒక వేళ నేను సిస్టమాటిక్ విత్ డ్రాయల్ ప్లాన్ (SWP)లో ఆ డబ్బులను పెడితే ట్యాక్స్ పడకుండా నెల నెలా ఎంత విత్ డ్రా చేయవచ్చు? ఎంత తీస్తే ట్యాక్స్ పడుతుంది?

నిపుణుల సమాధానం: సిస్టమాటిక్ విత్ డ్రాయల్ ప్లాన్ కు కేవలం ప్రతి విత్ డ్రాయల్‌పై క్యాపిటల్ గెయిన్స్ కాంపోనెంట్‌కు పన్ను వర్తిస్తుంది. కానీ, మొత్తం రిడంప్షన్ అమౌంట్‌కి ట్యాక్స్ వర్తించదు. ప్రస్తుతం చాలా చిల్డ్రెన్ మ్యూచువల్ ఫండ్స్ ఈక్విటీ-ఓరియంటెడ్ హైబ్రిడ్ ఫండ్స్ మాదిరిగా రూపొందిస్తున్నారు. 5 ఏళ్ల లాకిన్ పీరియడ్ ఉంటుంది. కేవలం లాంగ్ టర్మ్ యూనిట్ల నుంచి మాత్రమే విత్ డ్రాయల్ ఉంటుంది. ఇవి ఏడాది పెట్టుబడి తర్వాతే విత్ డ్రాకు అర్హత సాధిస్తాయి.

లిస్టెడ్ ఈక్విటీ షేర్లు, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ల నుంచి వచ్చే మొత్తం దీర్ఘకాలిక మూలధన లాభాలు (LTCG) ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 1.25 లక్షలకు మించకుండా, వర్తించే మినహాయింపు పరిమితిలోనే ఉండేలా SWPని రూపొందించాలి. ఉపసంహరణలను ప్రారంభించే ముందు యూనిట్లకు ఎలాంటి లాక్-ఇన్ పీరియడ్ లేదా నిష్క్రమణ పరిమితులు లేవని నిర్ధారించుకోవడం కూడా ముఖ్యం. అలాగే మ్యూచువల్ ఫండ్స్‌లోనూ హైరిస్క్ ఉంటుంది. ఎంచుకునే స్కీమ్ గురించి ముందే అన్ని విషయాలు తెలుసుకోవాలి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Samayam