Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Tax Notice: మరణించిన వ్యక్తి పేరుతో ఐటీ నోటీసు వచ్చిందా? విస్మరిస్తే ముప్పే.. వారసులు వెంటనే చేయాల్సిన పనులివే!

Tax Notice: మరణించిన వ్యక్తి పేరుతో ఐటీ నోటీసు వచ్చిందా? విస్మరిస్తే ముప్పే.. వారసులు వెంటనే చేయాల్సిన పనులివే!

Telugu Samayam 1 week ago

Tax Notice: మరణించిన వ్యక్తి పేరు మీద ఆదాయపు పన్ను శాఖ (Income Tax Department) నుంచి నోటీసు వస్తే చాలా మంది ఏమి చేయాలో తెలియక గందరగోళానికి గురవుతుంటారు.

మరికొందరు ఆ వ్యక్తి ఇక లేరు కాబట్టి నోటీసును పట్టించుకోవాల్సిన అవసరం లేదని విస్మరిస్తుంటారు. ఇలా వచ్చిన నోటీసును పట్టించుకోకపోతే చట్టపరమైన సమస్యలకు దారి తీసే ప్రమాదం ఉంటుంది. ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 159 ప్రకారం చనిపోయిన వ్యక్తికి చెందిన చట్టబద్ధమైన వారసులు (Legal Heirs) ఆ నోటీసుకు స్పందించి పన్ను ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. లీగల్ హెయిర్ గా మీకున్న బాధ్యతలు, తీసుకోవాల్సిన చట్టపరమైన చర్యల వివరాలు తెలుసుకుందాం.

చనిపోయిన వ్యక్తి పేరుపై ఇన్‌కమ్ ట్యాక్స్ నోటీసు వచ్చినప్పుడు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 159 కింద వారసులు బాధ్యత వహించాల్సి ఉంటుంది. మరణించిన వ్యక్తి నుంచి సంక్రమించిన ఆస్తి విలువ వరకే పన్ను చెల్లింపు పరిమితి ఉంటుంది. లీగల్ హెయిర్ తన సొంత ఆస్తుల నుంచి రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు. తమ ఆస్తులను అమ్ముకోవాల్సి వస్తుందని ఆందోళన చెందాల్సిన పని లేదు. సదరు ట్యాక్స్ పేయర్లు మరణించిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తుది రిటర్నులను లీగల్ హెయిర్ దాఖలు చేయాల్సి ఉంటుంది. ఒక వేళ నోటీసులకు సంబంధించకపోతే చిక్కుల్లో పడాల్సి వస్తుంది. అలాగే రోజువారీ వడ్డీ, జరిమానాలు, ఏకపక్ష అసెస్మెంట్ వంటివి ఎదురవుతాయి.

వ్యక్తి చనిపోయినంత మాత్రమాన అతని ఆదాయపు పన్ను అంశాలు ఆటోమేటిక్‌గా పూర్తి పరిష్కారం కావు. ఒక వేళ సదరు వ్యక్తి ఆదాయం బేసిక్ పన్ను పరిమితికి మించి ఉండి ఆదాయపు పన్ను రిటర్నులు ఫైల్ చేయకపోతే పెండింగ్ ట్యాక్స్ ప్రక్రియను, పన్ను బకాయిలను చట్టపరమైన వారసులు పూర్తి చేయాల్సి ఉంటుంది. కొన్నిసార్లు కుటుంబంలోని కలహాలు, ఇతర కారణాలతో చట్టపరమైన వారసులు ఎవరు అనేది తేల్చడం కష్టమవుతుంది. అలాంటి సందర్భాల్లో ఇన్‌కమ్ ట్యాక్స్ అసెసింగ్ అధికారికి ఈ విషయాన్ని తెలియజేయాలి. చట్టపరమైన వారసులు లేకపోతే వారసత్వంగా వచ్చిన ఆస్తులను తీసుకున్న వ్యక్తికి పన్ను బాధ్యతలు వెళ్తాయి. అయితే, ఒకసారి వ్యక్తి చనిపోయినట్లు ఐటీ శాఖకు తెలియజేస్తే ఆ తర్వాత అతని పేరుపై నోటీసులు జారీ చేయరు. కానీ, పన్ను బాధ్యతలను పూర్తి చేయాల్సి ఉంటుంది.

ఐటీఆర్ ఫైల్ చేయకముందే చనిపోతే ఎలా?

ఆదాయపు పన్ను చట్టం 2025లోని సెక్షన్ 302 కింద చనిపోయిన వ్యక్తి ట్యాక్స్ బాధ్యతలు అతని మరణంతో తొలగిపోవు. చట్టపరమైన ప్రతినిధులకు వెళ్తాయి. అతడి ఆస్తులను అనుభవిస్తున్న వారు పూర్తి చేయాల్సి ఉంటుందని పన్ను నిపుణులు చెబుతున్నారు. లీగల్ హెయిర్ స్టేటస్ కలిగి ఉన్న వారు ఐటీఆర్ ఫైల్ చేయాలి. ఏవైనా పన్ను బకాయిలు ఉంటే చెల్లించాల్సి ఉంటుంది.
Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Samayam