Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తెలంగాణ ఆర్టీసీ 'సెల్ఫ్ టికెట్'.. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీరే టికెట్ తీసుకోవచ్చు

తెలంగాణ ఆర్టీసీ 'సెల్ఫ్ టికెట్'.. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీరే టికెట్ తీసుకోవచ్చు

Telugu Samayam 1 week ago

తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది.. నాన్‌స్టాప్ బస్సు సర్వీసుల్లో సెల్ఫ్ టికెట్ విధానాన్ని అమలు చేయనుంది. బస్సు ఎక్కే ముందు టికెట్ కోసం వేచి ఉండాల్సిన అవసరం లేకుండా సెల్ఫ్ టికెట్‌ను తీసుకొచ్చారు.

ఈ నాన్‌స్టాప్ బస్సుల్లో ప్రయాణికులే స్వయంగా టికెట్ తీసుకునేలా ఆర్టీసీ ప్లాన్ చేసింది. బస్సు ఎక్కే ముందు డోర్ దగ్గర ఏర్పాటు చేసే క్యూఆర్ కోడ్‌ను స్మార్ట్ మొబైల్‌లో స్కాన్ చేయాలి.. అప్పుడు టికెట్ బుకింగ్ ప్రక్రియలో భాగంగా బస్సు ఎక్కే స్టాప్, దిగే స్టాప్ వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. అనంతరం ఆన్‌లైన్‌లో డబ్బులు చెల్లిస్తే టికెట్ బుక్ అవుతుంది.. దాన్ని డ్రైవర్‌కు చూపిస్తే సరిపోతుంది.

ఈ స్మార్ట్ టికెట్ విధానాన్ని ప్రయోగాత్మకంగా నల్గొండ టు హైదరాబాద్‌ మార్గంలో అమలు చేయాలని ఆర్టీసీ నిర్ణయించింది. నల్గొండ నుంచి హైదరాబాద్ వెళ్లే మార్గంలో ప్రస్తుతం 45 డీలక్స్‌ బస్సులు నాన్‌స్టాప్‌ సర్వీసులుగా రాకపోకలు సాగిస్తున్నాయి. ఈ రూట్‌లో ఈ స్మార్ట్ టికెట్ విధానం విజయవంతమైతే సెప్టెంబరు నెలాఖరులోగా మిగిలిన అన్ని రూట్లలో అమలు చేయాలని ఆర్టీసీ భావిస్తోంది. ఈ స్మా్ర్ట్ టికెట్ కొత్త విధానంతో ప్రయాణికులకు చిల్లర సమస్య కూడా ఉండదని.. డ్రైవర్లు టికెట్లు జారీ చేయాల్సిన అవసరం ఉండదని.. వారిపై పనిభారం కూడా తగ్గుతుందని భావిస్తున్నారు. అలాగే సమయం కూడా ఆదా అవుతుంది.. వెళ్లా్ల్సిన చోటుకు త్వరగా వెళ్లొచ్చు. కాకపోతే స్మార్ట్‌ఫోన్‌ లేని, డిజిటల్‌ చెల్లింపులపై అవగాహన లేని వారికి మాత్రం బస్సు డ్రైవర్‌ నుంచే టికెట్‌ తీసుకోవచ్చిని ఆర్టీసీ తెలిపింది. ఈ సెల్ఫ్‌ టికెటింగ్‌ విధానం కోసం మీ సేవకు చెందిన మీ టికెట్‌తో ఒప్పందం చేసుకున్నారు.

తెలంగాణ ఆర్టీసీ రాఖీ పండగ సందర్భంగా స్పెషల్ బస్సులు నడుపుతోంది. రాఖీ పండుగ కావడంతో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ 5 వేల ప్రత్యేక బస్సులు నడుపుతుందని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. ఈ ప్రత్యేక సర్వీసులు 27వ తేదీ గురువారం నుంచి ప్రారంభమై ఆగస్టు 31 సోమవారం వరకు అందుబాటులో ఉంటాయన్నారు. గతేడాది 4760 స్పెషల్ బస్సులు నడపగా.. సుమారు 3.68 కోట్ల మంది ప్రయాణించారు.. అందులో 2.51 కోట్ల మంది మహిళా ప్రయాణికులు ఉన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Samayam