Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
TG20 లీగ్ వివాదం.. విజయ్ దేవరకొండ, వెంకటేష్‌లకు లీగల్ నోటీసులు..

TG20 లీగ్ వివాదం.. విజయ్ దేవరకొండ, వెంకటేష్‌లకు లీగల్ నోటీసులు..

Telugu Samayam 8 hrs ago

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన 'టీజీ20 (TG20) లీగ్' చుట్టూ వివాదం నెలకొంది. ఈ లీగ్ నిర్వహణపై తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ (TCA) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.

బీసీసీఐ నుంచి ఎలాంటి ముందస్తు అనుమతులు లేవని, ఇది పూర్తిగా నిబంధనలకు విరుద్ధమని ఆరోపిస్తోంది. అంతేకాదు దీనికి ప్రచారకర్తలుగా, మద్దతుదారులుగా ఉన్న సినీ, క్రికెట్ ప్రముఖులకు లీగల్ నోటీసులు పంపడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ ప్రచారకర్తగా టీజీ20 లీగ్ నిర్వహించనున్నట్లు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) కార్యదర్శి మన్నె జీవన్ రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు మంగళవారం నగరంలోని ఒక హోటల్‌లో జరిగిన విలేకరుల సమావేశం నిర్వహించారు. జూన్ 21 నుంచి వచ్చే నెల 19 వరకు ఉప్పల్ స్టేడియంలో జరిగే ఈ లీగ్‌ను యువ క్రికెటర్లు తమ ప్రతిభను నిరూపించుకునేందుకు ఉపయోగించుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో టీజీ20 లీగ్ కమిషనర్ ఆగంరావు, గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులు సంజీవ్ రెడ్డి, హెడ్ ఆఫ్ ఆపరేషన్స్ భరిణి పాల్గొన్నారు.

అయితే టీజీ20 లీగ్ పేరిట తెలంగాణ క్రికెట్ సమూహాన్ని, ప్రజలను హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తప్పుదారి పట్టిస్తోందని తెలంగాణ క్రికెట్ సంఘం (టీసీఏ) కార్యదర్శి గురువారెడ్డి విమర్శించారు. మంగళవారం ఆయన విడుదల చేసిన బహిరంగ ప్రకటనలో టీజీ20 పేరిట హెచ్‌సీఏ ఒక సర్కస్‌ను నిర్వహిస్తోందని ఆరోపించారు. సంస్థాగత మోసానికి పాల్పడుతోందని, బీసీసీఐ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్నారని అన్నారు. లీగ్‌కు సంబంధించిన అనుమతి పత్రాలను మీడియా ముందు పెట్టాలని డిమాండ్ చేశారు. తెలంగాణ అనే పదాన్ని ఉపయోగించే హక్కు హెచ్‌సీఏకు లేదని, రాష్ట్రంలో క్రికెట్ వ్యవహారాలను చూసుకోవడానికి 'తెలంగాణ క్రికెట్ అసోసియేషన్' ఉందని తెలిపారు.



అంతేకాదు టీజీ20 లీగ్‌కు మద్దతు ఇస్తున్న హీరోలు వెంకటేష్, విజయ్ దేవరకొండ, హెచ్‌సీఏ హెడ్ ఆఫ్ ఆపరేషన్స్ అంబటి రాయుడు, క్రికెటర్లు తిలక్ వర్మ, మహమ్మద్ సిరాజ్ కు లీగల్ నోటీసులు ఇవ్వనున్నట్టు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ తెలిపింది. అయితే హెచ్‌సీఏ మాత్రం ఈ లీగ్‌ను అధికారికంగా నిర్వహిస్తున్నామని, బీసీసీఐ అనుమతి ఉందని ప్రకటించింది. ఈ టోర్నీలో భారత క్రికెటర్లు కూడా పాల్గొంటున్నారని నిర్వాహకులు చెబుతున్నారు. ఈ లీగ్ పై తెలంగాణ క్రికెట్ సంఘం అభ్యంతరం తెలుపుతున్న నేపథ్యంలో, షెడ్యూల్ ప్రకారం ఈ నెల 21 నుంచి టీజీ20 లీగ్ జరుగుతుందా లేదా? దీనిపై విజయ్ దేవరకొండ, వెంకటేష్ ఎలా స్పందిస్తారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Samayam