Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
టీడీపీ ఎమ్మెల్యే ఇంటికి వెళ్లిన టాలీవుడ్ హీరో.. ఆయనకు బెస్ట్ ఫ్రెండ్

టీడీపీ ఎమ్మెల్యే ఇంటికి వెళ్లిన టాలీవుడ్ హీరో.. ఆయనకు బెస్ట్ ఫ్రెండ్

Telugu Samayam 2 weeks ago

టీడీపీ ఎమ్మెల్యే ఇంటికి టాలీవుడ్ హీరో వెళ్లారు.. ఈ మేరకు ఫోటోలు వైరల్ అవుతున్నాయి. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఇంటికి టాలీవుడ్ హీరో నితిన్ వెళ్లారు..

ఎమ్మెల్యే కుటుంబంతో సరదాగా గడిపారు. తన మిత్రుడు, టాలీవుడ్ హీరో నితిన్ శుక్రవారం తన నివాసానికి రావడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు సుధీర్ రెడ్డి. చాలా రోజుల తర్వాత తన ఇంటికి వచ్చిన నితిన్.. తన కుటుంబ సభ్యులందరితో కలిసి కాసేపు సరదాగా గడిపారన్నారు. నితిన్ కలిసిన సందర్భంగా తమ మధురమైన స్మృతులను ఇద్దరం కలిసి నెమరువేసుకోవడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు. బిజీ షెడ్యూల్స్ ఉన్నప్పటికీ.. ప్రత్యేకంగా సమయం కేటాయించి తన ఇంటికి వచ్చి, తన కుటుంబంతో ఇంతటి ఆత్మీయ సమయాన్ని పంచుకున్నందుకు తన ప్రియ మిత్రుడు నితిన్‌కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నానంటూ ట్వీట్ చేశారు.


టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డికి టాలీవుడ్‌లో పలువురితో పరిచయాలు ఉన్నాయి.. ఈ విషయాన్ని గతంలో చెప్పారు. టాలీవుడ్‌లో తనకు మంచి ఫ్రెండ్స్ ఉన్నారని.. స్టార్ హీరో ప్రభాస్‌తో కలిసి చదువుకున్నానని.. ఆయన తనకు మంచి స్నేహితుడిని తెలిపారు. అలాగే యూవీ క్రియేషన్స్ ప్రొడ్యూసర్ వంశీ కూడా తనకు క్లాస్‌మేట్ అని చెప్పారు. తామంతా కలిసి హైదరాబాద్ నలంద జూనియర్ కాలేజీలో ఇంటర్ చదివామన్నారు. తాను మొదట బైపీసీలో చేరానని.. ఆ తర్వాత సీఈసీకి మారినట్లు తెలిపారు. ప్రభాస్ మాత్రం సీఈసీలోనే చేరారన్నారు.

ప్రభాస్‌ తాను ఇంటి నుంచి తీసుకెళ్లే వంటలు బాగా తింటారని చెప్పుకొచ్చారు. తన సోదరుడితో కూడా ప్రభాస్ సినిమాలు తీశారన్నారు. ప్రభాస్‌ను అప్పుడప్పుడు కలుస్తుంటానని చెప్పారు. అలాగే బొజ్జల సుధీర్ రెడ్డికి నితిన్ కూడా మంచి స్నేహితుడు. బొజ్జల సుధీర్ రెడ్డి తండ్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మంత్రిగా పనిచేశారు. సుధీర్ రెడ్డి చదువు మొత్తం హైదరాబాద్‌లో కొనసాగింది.. ఆ సమయంలో రాజకీయ ప్రముఖులతో, టాలీవుడ్‌లో పలువురు ప్రముఖులతో ఆయనకు అనుబంధం ఉంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Samayam